‘ఏరు దాటక ముందు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అనే తన దుర్నీతిని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి చేతల్లో చూపించారు. ‘తక్కువ ధరకు నాణ్యమైన మద్యం ఇస్తాం..’ అని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని ఆయన తుంగలో తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం తెరుచుకున్న టీడీపీ సిండికేట్ మద్యం దుకాణాల్లో మద్యం ధరలు మోత మోగించాయి. తక్కువ ధరకు మద్యం లభిస్తుందని మద్యం దుకాణాలకు వెళ్లిన మద్యం ప్రియులకు ధరలు షాక్ కొట్టాయి. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం ధరల కంటే ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీ సిండికేట్ మద్యం దుకాణాల్లో ధరలు అధికంగా ఉన్నాయని మద్యం ప్రియులు మండిపడుతున్నారు.
రూ.99 మద్యం ఇంకా లేదు..
ఒక బ్రాండు మద్యాన్ని రూ.99కే అందిస్తామన్న విధాన నిర్ణయాన్ని టీడీపీ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకు రాలేదు. టీడీపీ మద్యం సిండికేట్ దుకాణాల్లో చీప్ లిక్కర్ (క్వార్టర్)కు కూడా రూ.130 ధర నిర్ణయించడం గమనార్హం. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కనిష్ట మద్యం బ్రాండు ధర రూ.120కే విక్రయించారు. కానీ ప్రస్తుతం టీడీపీ మద్యం సిండికేట్ దుకాణాల్లో చీప్ లిక్కరే రూ.130కి విక్రయించడంపై మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రూ.99కే మద్యం బ్రాండు మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందనే విషయంపై ఎకైŠస్‌జ్ శాఖ స్పష్టత ఇవ్వనే లేదు. రూ.99కు మద్యం బ్రాండు కావాలని డిమాండ్ చేస్తున్న వారిపై టీడీపీ సిండికేట్ యజమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ‘మాకు ఎలాంటి సమాచారం లేదు.. చీప్ లిక్కర్ రూ.130 చొప్పునే విక్రయిస్తాం.. నచ్చితే కొనండి.. లేకపోతే పొండి’ అని దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దాంతో రాష్ట్రంలో పలు మద్యం దుకాణాల వద్ద వాగ్వాదాలు, ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment