
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో మద్య నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మద్యం ధరలను మరో 50 శాతం పెంచింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. లిక్కర్, ఫారెన్ లిక్కర్, బీర్, వైన్‌ల ప్రతి బాటిల్‌పై ట్యాక్స్ విధించారు. అలాగే పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయని తెలిపింది. ఇంతకు ముందు పెంచిన దానితో కలుపుకుని ఏపీలో మద్యం ధరలు మొత్తం 75 శాతం పెరిగినట్టయింది. రాష్ట్రంలో మద్యాపానాన్ని నిరుత్సాహరిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ చెప్పారు. (చదవండి : ఏపీలో మద్యం ధరలు మరో 50 శాతం పెంపు..)
పెరిగిన ధరలు..
- రూ. 120 నుంచి 150 మధ్య ఉన్న క్వార్టర్ ధరపై రూ. 80 పెంపు
- రూ. 150 ఉన్న క్వార్టర్‌పై రూ. 120 పెంపు
- బీర్‌పై రూ. 60, మినీ బీర్‌పై రూ. 40 పెంపు