
మద్యం ధరల పెంపు
హైదరాబాద్: ప్రయాణికుల నడ్డి విరిగేలా ఆర్టీసీ బస్ చార్జిలు పెంచిన కొద్ది సేపటికే మద్యం ధరలను కూడా పెంచుతున్నట్లు చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. ఖరీదైన ప్రీమియం మద్యంతోపాటు సామాన్యుడు సేవించే చీప్ లిక్కర్ ధర కూడా పెరిగింది.
ఈ మేరకు జీవో నంబర్ 394, 395 లను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. పెంచిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని పేర్కొంది. ధరల పెరుగుదలలోని ముఖ్యాంశాలు
- ప్రీమియం మద్యం ధరలు: కనిష్ఠంగా రూ. 25 నుంచి గరిష్ఠంగా రూ. 100 పెంపు
- చీప్ లిక్కర్: కనిష్ఠంగా రూ.5 నుంచి గరిష్ఠంగా రూ.10 పెంపు
- బీరు, వైన్ ధరల్లో స్వల్ప తగ్గుదల
- పెరిగిన ధరలతో ప్రభుత్వానికి ఏటా రూ.200 కోట్ల అదనపు ఆదాయం