కాచిగూడ (హైదరాబాద్) : ఓ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని వివాహం చేసుకున్న బాలుడిని సోమవారం కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాచిగూడ ఏసీపీ సీహెచ్.లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... నింబోలిఅడ్డా ప్రాంతానికి చెందిన జక్కుల బాలమల్లు కుమారుడు(17) అదే ప్రాంతానికి చెందిన రాంబాబు కూతురు(17) కొంతకాలంగా ప్రేమించుకున్నారు.
గత నెల 22వ తేదీన ఇంటి నుంచి ఇద్దరూ పారిపోయి యాదగిరి గుట్టలో పెళ్లి చేసుకున్నారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు బాలుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌పెక్టర్ కె.సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాలికను పెళ్లిచేసుకున్న బాలుడికి రిమాండ్
Published Mon, Jun 6 2016 7:14 PM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM
Advertisement
Advertisement