
ప్రేమపెళ్లిని అడ్డుకున్న అధికారులు
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మాధవనగర్‌లోని సాయిబాబా మందిరంలో జరుగుతున్న ఓ ప్రేమ పెళ్లిని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. సిరికొండ మండలం పాళ్లరామడుగు గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ యువతీయువకులు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరుకావడం, అందులోనూ మైనర్లు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఇంట్లో చెప్పాపెట్టకుండా ఇద్దరూ పారిపోయి సోమవారం సాయిబాబా మందిరంలో పెళ్లి చేసుకోవడానికి వెళ్లారు. ఈ విషయం తెలిసిన అధికారులు పెళ్లిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.