బాలలపై లైంగిక వేధింపులు ఆందోళనకరం | Sexual harassment on children is a concern | Sakshi
Sakshi News home page

బాలలపై లైంగిక వేధింపులు ఆందోళనకరం

Dec 19 2017 2:23 AM | Updated on Apr 6 2019 8:52 PM

Sexual harassment on children is a concern - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాలలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయని, వేధింపులకు గురైన బాలలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జిల్లా సంక్షేమాధికారులు, సీడీపీఓ, డీసీపీఓల శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాలల రక్షణ బాధ్యతగా తీసుకోవాలని, లైంగిక దాడులను అరికట్టాలన్నారు. బాలల హక్కులను హరిస్తున్నారని, వారి రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోందని శాఖ సంచాలకులు విజయేందిర ఆవేదన వ్యక్తం చేశారు. బాలల హక్కుల రక్షణపై అవగాహన కల్పించేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement