చెన్నై: సమాజంలో ఆడవారికి రక్షణ కరువైంది. ప్రభుత్వాలు ఎన్ని నూతన చట్టాలు తీసుకొస్తున్నా.. కఠిన శిక్షలు విధిస్తున్నా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. పుట్టిన బిడ్డ నుంచి రేపో మాపో చనిపోయే పండు ముసలి వరకు ఎవరినీ వదలకుండా వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. 14 సంవత్సరాల బాలుడు అభం శుభం తెలియని 9 ఏళ్ల బాలికపై అత్యాచారాయత్నానికి ప్రయత్నించి, ప్రతిఘటించడంతో కొట్టి చంపిన ఘటన తమిళనాడులోని మణప్పరై పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆ బాలిక మూడవ తరగతి చదువుతుండగా.. అదే పాఠశాలలో ఆ బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చదవండి: జోతిష్యుడు చెప్పాడని.. భార్య కడుపుపై
అభం శుభం తెలియని ఆ చిన్నారిపై కన్నేసిన బాలుడు మాయమాటలు చెప్పి గ్రామ సమీపంలోని మల్లెతోటలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ చిన్నారి తీవ్రంగా ప్రతిఘటించడంతో కోపంతో బాలిక తలపై బండరాయితో మోదాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం తనకేమీ తెలియదన్నట్లు గ్రామంలోకి వచ్చిన బాలుడు తోటలో బాలిక అపస్మారక స్థితిలో ఉన్నట్లు స్థానికులకు సమాచారం ఇచ్చాడు.
వెంటనే అక్కడకు చేరుకున్న గ్రామస్థులు బాలికను ఎమ్‌జీఎమ్‌జీహెచ్ ఆస్సత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలుడిపై అనుమానంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. మైనర్ బాలికపై అత్యాచారయత్నం, హత్య చేసిన బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జువైనల్ హోంకు తరలించారు. చదవండి: అత్యాచారయత్నం!.. సోషల్ మీడియాలో పోస్టు
Comments
Please login to add a commentAdd a comment