
గౌరిబిదనూరు: తెలిసీ తెలియని తనం రెండు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఏది ప్రేమో..ఏది వ్యామోహమో తెలియక ఇద్దరు పిల్లలు తమ జీవితాలను చాలించుకున్నారు. మైనర్ బాలిక, బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాలూకాలోని పెద్దానహళ్లిలో జరిగింది.
గ్రామానికి చెందిన గిరీశ్ (18), గానవి (16) ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఇరుకుటుంబాల వారు వీరి ప్రేమను వ్యతిరేకించడంతో దొంగచాటుగా కలుసుకునేవారు. మైనర్లు కావడంతో వీరి పెళ్లికి అంగీకరించలేదు. జీవితంపై విరక్తి చెందిన ఇద్దరూ మంగళవారం తెల్లవారుజామున ఊరి చివరి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment