మైనర్లకు ఉచిత న్యాయ సహాయం
మైనర్లకు ఉచిత న్యాయ సహాయం
Published Fri, Feb 17 2017 11:26 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM
– లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్
కర్నూలు(అర్బన్): మైనర్ చిన్నారులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ తెలిపారు. శుక్రవారం స్థానిక సీ క్యాంప్‌లోని మున్సిపల్ హైస్కూల్‌లో డా.జె. యధుభూషణ్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వైన్‌ఫ్లూ నివారణకు ఉచిత హోమియా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన సోమశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు, స్కూల్ టీచర్లు హోమియో మందులను తప్పక వాడాలన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. న్యాయ పరంగా ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహనను పెంచుకోవాలన్నారు.
పిల్లలతో పాటు మహిళలకు కూడా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామన్నారు. బాలల హక్కులు, అనాథ పిల్లలకు ఎన్‌జీఓ ఆర్గనైజేషన్స్ అందిస్తున్న సేవలను వివరించారు. ఈ నేపథ్యంలోనే హాజరైన విద్యార్థులు, టీచర్లకు హోమియో మందులను అందించారు. కార్యక్రమంలో న్యాయవాదులు బి. ఆదినారాయణరెడ్డి, పి. నిర్మల, ఎంఏ తిరుపతయ్య, శివసుదర్శన్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement