న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో మైనర్ పేరిట సంరక్షకులు చేసే పెట్టుబడులకు సంబంధించిన నిబంధనల్లో సెబీ మార్పులు చేసింది. దీని కింద మైనర్ పేరిట చేసే పెట్టుబడులకు.. వారి ఖాతా లేదా తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఖాతాల నుంచి ఏ రూపంలో అయినా చెల్లింపులను మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అనుమతించాలి. తల్లిదండ్రి లేదా సంరక్షకులతో జాయింట్ అకౌంట్ నుంచి చెల్లింపులు చేసినా ఆమోదించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: 18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్‌మెంట్
జూన్ 15 నుంచి ఇందుకు అవకాశం కల్పించేందుకు కావాల్సిన ఏర్పాట్లను, సవరణలను చేసుకోవాలని అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలకు (ఏఎంసీలు) సెబీ ఆదేశాలు జారీ చేసింది. పెట్టుబడుల ఉపసంహరణ మొత్తాన్ని మైనర్ ఖాతా లేదా తల్లిదండ్రి, సంరక్షకులతో జాయింట్ ఖాతాకు మాత్రమే జమ చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment