మైనర్లకు మద్యం విక్రయించిన వైన్స్‌పై కేసు | Wines sold alcohol to minors case | Sakshi
Sakshi News home page

మైనర్లకు మద్యం విక్రయించిన వైన్స్‌పై కేసు

Published Fri, Jul 29 2016 8:17 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

Wines sold alcohol to minors case

చైతన్యపురి: మైనర్లకు మద్యం విక్రయించిన వైన్‌ షాపుపై సరూర్‌నగర్‌ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. సీఐ లింగయ్య కథనం ప్రకారం... దిల్‌సుఖ్‌నగర్‌ రాజీవ్‌ చౌక్‌లోని శిల్పి వైన్‌షాపు సిట్టింగ్‌ రూమ్‌లో బాలురు మద్యం తాగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సదరు వైన్స్‌పై దాడి చేశారు. మద్యం తాగుతున్న బాలురకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపేశారు. మైనర్లకు మద్యం సరఫరా చేసినందుకు వైన్‌ షాపుపై కేసు నమోదు చేసి యజమాని భరత్‌గౌడ్, క్యాషియర్‌ శ్రీకాంత్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement