
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 21 మందిపై కేసు
హైదరాబాద్ సిటీ: నగరంలోని జూబ్లీహిల్స్‌లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 21 మందిపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఆదివారం వేకువజామున నిర్వహించిన తనిఖీల్లో 21 మందిపై కేసులు నమోదుచేశారు. ఈ తనిఖీల్లో 14 కార్లు, 7 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.