![Police Acts Favour For A Tycoon In Drunk And Drive In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/11/drunk-and-drive.jpg.webp?itok=Nwk6-yCE)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: సామాన్యుడు కనబడితే నిబంధనలు గుర్తు చేసి, చలాన్లతో వాయించే ట్రాఫిక్ సిబ్బంది కారులో షికారు చేసే బడా వ్యాపారులకు సలాం చేస్తున్నారని శుక్రవారం జరిగిన ఓ ఘటనపై పలువురు మండిపడుతున్నారు. వివరాలు.. శుక్రవారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఓ వ్యాపారి కారును సీజ్ చేయకుండా పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇలాంటి ఘటనల్లో సామాన్య జనం దొరికితే వారి వాహనాలను ఈడ్చుకెళ్లి సీజ్ చేస్తారనీ, వ్యాపారి వాహనాన్ని క్రేన్ సాయంతో కాకుండా రాచమర్యాదలతో స్టేషన్‌కు తరలించారని ఘటనకు సాక్ష్యంగా నిలిచిన జనం మండిపడుతున్నారు. వ్యాపారితో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment