wineshop
-
ఆ రెండు రోజులు వైన్స్ బంద్ : పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
హైదరాబాద్,సాక్షి : నగరంలో గణనాథుల నిమజ్జనాల సందర్భంగా పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల పాటు వైన్,కల్లు,బార్ షాపులు మూసివేస్తున్నట్లు తెలిపారు.గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని అన్ని వైన్, కల్లు, బార్ షాపులను మూసివేయాలని సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 17 ఉదయం 6 గంటల నుండి సెప్టెంబర్ 18 సాయంత్రం 6 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది.తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 20 కింద నిమజ్జన ఉత్సవాల సందర్భంగా ప్రజల శాంతి, ప్రశాంతతను కాపాడటం లక్ష్యంగా పోలీసు విభాగం స్టార్ హోటళ్లు రిజిస్టర్డ్ క్లబ్‌లలో ఉన్న బార్లు మినహా రెస్టారెంట్లకు అనుబంధంగా బార్లు సైతం మూసివేయాలని సీవీ ఆనంద్ నిర్వాహకులకు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నగరంలోని అన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ల అదనపు ఇన్స్పెక్టర్లకు అధికారం ఇచ్చినట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.ఇదీ చదవండి : కేజ్రీవాల్‌కు బెయిల్ -
ఎలైట్ వైన్స్.. బార్లు!
సాక్షి, హైదరాబాద్: లాటరీ ప్రక్రియ, పోటీలేకుండా నేరుగా లైసెన్సులు ఇచ్చే ‘ఎలైట్ బార్ల’తరహాలో.. ‘ఎలైట్ వైన్స్’విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతమున్న ఏ4 కేటగిరీ వైన్‌షాపులకు అదనంగా.. నగర ప్రాంతాల్లో ఈ ఎలైట్ వైన్స్ ఏర్పాటుకు అనుమతించే దిశగా కసరత్తు ప్రారంభించింది. వీటికి సాధారణ వైన్‌షాపుల కంటే కనీసం రెండింతలు, ఆపైన లైసెన్స్ ఫీజులను నిర్ణయించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఇలా నేరుగా లైసెన్సు మంజూరు చేసిన ‘టానిక్’ఎలైట్ వైన్‌షాపులు ఉన్నాయి. వాటికి ఇచ్చిన ఐదేళ్ల లైసెన్సుల గడువు ఈ ఏడాది మార్చితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో.. టానిక్ షాపుల తరహాలోనే మరిన్ని ఎలైట్ వైన్‌షాపులు ఏర్పాటు చేసేందుకు.. వీటితోపాటు మరిన్ని వాకిన్ స్టోర్స్ (సూపర్ మార్కెట్ల తరహాలో లోనికి వెళ్లి నచ్చినవి ఎంచుకునే ఉండేవి)ను ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. అంతేగాకుండా హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో బార్ల సంఖ్యను కూడా పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. బార్లకు బాగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. కొందరు బార్ లైసెన్సులను ఇతరులకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, అలా కాకుండా బార్ల సంఖ్యను పెంచడం ద్వారా డిమాండ్ తీరి, సర్కారుకు అదనపు ఆదాయమూ సమకూరుతుందని ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎక్సైజ్ ఆదాయం పెంపుకోసం.. 2023–24లో రూ.19,884.90 కోట్ల మేర ఎక్సైజ్ ఆదాయాన్ని గత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగినట్టుగా రాబడి ఉంది. కాంగ్రెస్ సర్కారు తాజాగా పెట్టిన బడ్జెట్ (2024–25)లో మరో రూ. 6 వేల కోట్లు అదనంగా.. రూ.25,617.52 కోట్లు లక్ష్యంగా నిర్ణయించుకుంది. అంటే ప్రతి నెలా రూ.500 కోట్ల వరకు అదనపు ఆదాయాన్ని సమీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం మద్యం ధరలు పెంచాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదన చేసినా ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఎలైట్ వైన్స్ ఏర్పాటు, బార్ల సంఖ్య పెంచడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న దానిపై మాత్రం సానుకూలత వచ్చినట్టు ఎక్సైజ్‌శాఖ వర్గాలు చెప్తున్నాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయం యథాతథం సర్కారు తాజా బడ్జెట్లో రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయ పద్దులో.. స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ అంచనాలను యథాతథంగా కొనసాగించింది. గత బడ్జెట్ (2023–24)లో రూ.18,500 కోట్ల మేర రిజిస్ట్రేషన్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించుకోగా.. ఈసారి (2024–25) స్వల్పంగా తగ్గించి రూ.18,228 కోట్ల రాబడి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిపాదనలను బట్టి ఈ ఏడాది భూముల విలువల పెంపు ఉండదని తెలుస్తోంది. ► వాహనాల పన్నుల ద్వారా రూ.8,477 కోట్లు, జీఎస్టీ ద్వారా రూ.50,762 కోట్లు వస్తుందని తాజా బడ్జెట్లో పేర్కొంది. జీఎస్టీ ద్వారా 2023–24లో రూ.40వేల కోట్ల రాబడి అంచనా వేయగా.. ఈసారి ఏకంగా రూ.10వేల కోట్లకుపైగా పెంచడం గమనార్హం. ఇక కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ)లో వాటా ద్వారా మరో రూ.7,838 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ► 2023–24లో వ్యాపార, అమ్మకపు పన్ను ద్వారా రూ.39,500 కోట్లు వస్తాయని అంచనా వేయగా రూ.34,166 కోట్లు సమకూరాయి. దీంతో ఈసారి ఈ పద్దు కింద ఆదాయ అంచనాను గతంకన్నా తక్కువగా రూ.33,449 కోట్లుగా సర్కారు పేర్కొంది. ► పన్నేతర ఆదాయాన్ని కూడా ఈసారి బడ్జెట్లో తగ్గించి చూపెట్టారు. గత బడ్జెట్లో దీనిని రూ.22,801 కోట్లుగా అంచనా వేయగా.. తాజా బడ్జెట్లో రూ.20,658 కోట్లకు తగ్గించారు. అంటే ప్రజలపై నేరుగా భారం వేయకుండా, ఇతర మార్గాల ద్వారా పన్ను ఆదాయం పెంచుకునే దిశలో సర్కారు బడ్జెట్ ప్రతిపాదనలు చేసినట్టు స్పష్టమవుతోందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. -
తరగతి గదులే మందుబాబులకు సిట్టింగ్ రూములు
అది ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యార్థులు చదువుకునే బడి. సాయంత్రం ఐదు దాటితే విద్యాలయ ప్రాంగణం మందుబాబులకు అడ్డా. బడికి ఆనుకుని ఉన్న బెల్టుషాపుల్లో మద్యం కొనుగోలు చేసి తరగతి గదులను సిట్టింగ్ రూములకు మార్చేసుకుంటున్నారు. పీకల దాకా తాగి మత్తులో ఊగుతూ సీసాలను పగులగొట్టి ఇష్టమొచ్చినట్లు విసురుతున్నారు. ఉదయాన్నే బడికి చేరుకున్న పిల్లలు పగిలిన గాజుపెంకులు గుచ్చుకుని రక్తమోడుతూ బాధతో విలవిలలాడుతున్నారు. సాక్షి, హిందూపురం సెంట్రల్: హిందూపురం మండలం మనేసముద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు 100 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత టీడీపీ పాలనలో కొందరు నాయకుల అండదండలతో గ్రామంలో బెల్టుషాపులు వెలిశాయి. ప్రాథమికోన్నత పాఠశాలకు ఆనుకుని ఒకటి.. దాని సమీపంలో మరొకటి.. ఇలా నాలుగు ఏర్పాటు చేశారు. ఐదేళ్లూ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తూ వచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక బెల్టుషాపులు సమూలంగా నిర్మూలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అప్పటి వరకు నిరాటంకంగా కొనసాగిస్తూ వచ్చిన బెల్టుషాపులను అధికారులు మూసివేయించాల్సి ఉంది. అయితే బెల్టుషాపుల నిర్వాహకులకు టీడీపీ నాయకులతో పాటు ఎమ్మెల్యే బాలకృష్ణ అండదండలు ఉన్నాయన్న కారణంతో అధికారులెవరూ పట్టించుకోలేదు. బడి ముగియగానే మందు శాల.. బడి వేళలు ముగియగానే సాయంత్రం నుంచి బెల్టుషాపులు తెరుచుకుంటాయి. అప్పటి వరకు ఇళ్లల్లో ఉంచుకున్న మద్యాన్ని నిర్వాహకులు బెల్టుషాపుల్లోకి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇక్కడ మందు కొనుగోలు చేసిన బాబులు నేరుగా ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలోకి వెళ్తున్నారు. అక్కడి తరగతి గదిని ఏకంగా సిట్టింగ్ రూమ్‌గా మార్చుకున్నారు. అక్కడే పూటుగా తాగి తందనాలు ఆడుతున్నారు. అంతటితో ఆగకుండా మద్యం సీసాలను పగులగొడుతున్నారు. గాజు పెంకులు తరగతి గదులు.. ఆవరణల్లోనే ఎగిరిపడుతున్నాయి. పాఠశాలలో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకు కింద మందు సీసాలు, గ్లాసులు, గాజు పెంకు గుచ్చుకోవడంతో కాలికి గాయమైందని చెబుతున్న విద్యార్థిని పసి మొగ్గలకు రక్తగాయాలు పాఠశాలకు చేరుకున్న పిల్లలు ఏమాత్రం అజాగ్రత్తగ ఉన్నా ప్రమాదాలకు గురవుతున్నారు. పాదరక్షలు లేకుండా గదిలోంచి బయటకు వస్తే గాజు పెంకులు గుచ్చుకుని విలవిలలాడుతున్నారు. పాఠశాల ఆవరణంలోనే మందుబాబుల సీసాలతో పాటు ప్లాస్టిక్ గ్లాసులు పడేస్తున్నారు. పాఠశాల ఆవరణలో ఉదయాన్నే శుభ్రం చేస్తున్నప్పటికీ సాయంత్రం మళ్లీ పగిలిన సీసాలు దర్శనమిస్తున్నాయి. బడి ఆవరణలో జరిగే అసాంఘిక కార్యకలాపాల గురించి ఉపాధ్యాయులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎటువంటి ప్రయోజనమూ కనిపించలేదు. సీఎం ఆదేశాలు బేఖాతరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెల్టుషాపులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా మనేసముద్రంలో బేఖాతరు చేస్తున్నారు. ఎక్సైజ్‌శాఖ అదికారులు, తహసీల్దార్ అక్కడ బెల్టు షాపులను ఎత్తివేయించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పాఠశాలలో ఉన్న పాత భవనాలు, క్రీడా ప్రాంగణం మొత్తం వేలాది మద్యం సీసాలతో దర్శనమిస్తున్నాయి. బెల్టుషాపులపై పలుమార్లు అదికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానిక వైఎస్సార్సీపీ కార్యకర్తలు తెలిపారు. ఎవరైనా ఎదురు తిరిగితే దాడులకు తెగబడుతున్నారన్నారు. ఫిర్యాదు చేసి అలసిపోయాం బెల్టుషాపులు తీసేయాలని పలుమార్లు విన్నవించుకున్నా వారు తొలగించుకోలేదు. ఇది పాఠశాలలాగా కాకుండా ఒక బారులా కనిపిస్తోంది. ఎంతని శుభ్రం చేయించగలం. ఎంత చేసినా రోజూ వందలకొద్దీ మందుబాటిళ్లు ఇక్కడ పడేస్తున్నారు. భయమేస్తోంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. విద్యార్థులకు, మాకు గాజు పెంకులు కాళ్లకు గుచ్చుకుంటూనే ఉన్నాయి. ప్రథమ చికిత్స కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను అందుబాటులో ఉంచుకున్నాం. – జయమ్మ, హెచ్ఎం, ప్రాథమికోన్నత పాఠశాల వాటికి అనుమతుల్లేవు మనేసముద్రంలోని బెల్టుషాపులకు అనుమతులు లేవు. రెండేళ్లుగా వారు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేశాం. ఫైన్లు వేశాం. వారిపై బైండోవర్లు కూడా ఉన్నాయి. మేము చాలా ప్రయత్నాలు చేశాం. తహసీల్దార్, ఎంపీడీఓల దృష్టికి తీసుకెళ్లాం. వారు నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. అక్కడ బెల్టుషాపులు నిర్వహిస్తున్నది మహిళలు. ఇక ఉపేక్షించబోము. విద్యార్థులున్న చోట అలాంటి కార్యకలాపాలకు చోటు కల్పించడం తీవ్ర నేరం. చర్యలు చేపడతాం. – ప్రతాప్‌రెడ్డి, ఎక్సైజ్ సీఐ, హిందూపురం -
వైన్‌షాప్ రేకులు పగలకొట్టి..
హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో దొంగలు రెచ్చిపోయారు. అడ్డు అదుపు లేకుండా చోరీలకు పాల్పడుతున్నారు. "కన్నం వేయడానికి కాదేది అనర్హం" అనుకున్నారో ఏమో ఈసారీ ఏకంగా మద్యం దుకాణానికే కన్నం వేశారు. షాప్‌లో ఉన్నదంతా స్వాహా చేశారు. తాళం వేసి ఉన్న దుకాణం రేకులు బద్దలు కొట్టి ఉన్నకాడికి ఊడ్చెకెళ్లిన సంఘటన నగరంలోని నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగుచూసింది. స్థానిక సైనిక్‌పురిలోని గోకుల్ వైన్స్‌లో శనివారం రాత్రి దొంగలు పడి రూ. 6 లక్షల నగదుతో పాటు మద్యాన్ని ఊడ్చుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
మైనర్లకు మద్యం విక్రయించిన వైన్స్‌పై కేసు
చైతన్యపురి: మైనర్లకు మద్యం విక్రయించిన వైన్ షాపుపై సరూర్‌నగర్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. సీఐ లింగయ్య కథనం ప్రకారం... దిల్సుఖ్నగర్ రాజీవ్ చౌక్‌లోని శిల్పి వైన్‌షాపు సిట్టింగ్ రూమ్‌లో బాలురు మద్యం తాగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సదరు వైన్స్‌పై దాడి చేశారు. మద్యం తాగుతున్న బాలురకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు. మైనర్లకు మద్యం సరఫరా చేసినందుకు వైన్ షాపుపై కేసు నమోదు చేసి యజమాని భరత్‌గౌడ్, క్యాషియర్ శ్రీకాంత్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
మద్యం దుకాణానికి నిప్పంటించిన దుండగులు
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో దోపిడీదొంగలు రెచ్చిపోయారు. మద్యం షాపులో దొంగతనానికి ప్రయత్నించిన దుండగులు డబ్బులు లభించకపోవడంతో.. దుకాణానికి నిప్పంటించారు. నిమ్మనపల్లిలో బుధవారం రాత్రి రమణ వైన్స్‌లో దొంగలు నిప్పంటించడంతో మద్యం షాపు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో సుమారు రూ. 5 లక్షల విలువైన మద్యం బాటిల్స్ కాలిబూడిదైనట్లు తెలుస్తుంది. దీనిపై షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.