
హైదరాబాద్,సాక్షి : నగరంలో గణనాథుల నిమజ్జనాల సందర్భంగా పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల పాటు వైన్,కల్లు,బార్ షాపులు మూసివేస్తున్నట్లు తెలిపారు.
గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని అన్ని వైన్, కల్లు, బార్ షాపులను మూసివేయాలని సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 17 ఉదయం 6 గంటల నుండి సెప్టెంబర్ 18 సాయంత్రం 6 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది.
తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 20 కింద నిమజ్జన ఉత్సవాల సందర్భంగా ప్రజల శాంతి, ప్రశాంతతను కాపాడటం లక్ష్యంగా పోలీసు విభాగం స్టార్ హోటళ్లు రిజిస్టర్డ్ క్లబ్‌లలో ఉన్న బార్‌లు మినహా రెస్టారెంట్‌లకు అనుబంధంగా బార్లు సైతం మూసివేయాలని సీవీ ఆనంద్ నిర్వాహకులకు స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నగరంలోని అన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌ల అదనపు ఇన్‌స్పెక్టర్‌లకు అధికారం ఇచ్చినట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
ఇదీ చదవండి : కేజ్రీవాల్‌కు బెయిల్
Comments
Please login to add a commentAdd a comment