మద్యం దుకాణానికి నిప్పంటించిన దుండగులు | wineshop fired by thieves in chittoor district | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణానికి నిప్పంటించిన దుండగులు

Published Thu, Feb 4 2016 11:05 AM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM

wineshop fired by thieves in chittoor district

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో దోపిడీదొంగలు రెచ్చిపోయారు. మద్యం షాపులో దొంగతనానికి ప్రయత్నించిన దుండగులు డబ్బులు లభించకపోవడంతో.. దుకాణానికి నిప్పంటించారు.

నిమ్మనపల్లిలో బుధవారం రాత్రి రమణ వైన్స్‌లో దొంగలు నిప్పంటించడంతో మద్యం షాపు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో సుమారు రూ. 5 లక్షల విలువైన మద్యం బాటిల్స్ కాలిబూడిదైనట్లు తెలుస్తుంది. దీనిపై షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement