ఒంటిమిట్టకు పూర్వవైభవం తీసుకొస్తాం: చంద్రబాబు | Vontimitta temple developed, says chandrababu | Sakshi
Sakshi News home page

ఒంటిమిట్టకు పూర్వవైభవం తీసుకొస్తాం: చంద్రబాబు

Published Thu, Apr 21 2016 9:54 AM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

Vontimitta temple developed, says chandrababu

కడప : వచ్చే ఏడాదిలోగా పనులన్నీ పూర్తి చేసి... ఒంటిమిట్టకు పూర్వవైభవం తీసుకోస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం కడపలో మాట్లాడుతూ... పెద్దదర్గా, గండికోటలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామన్నారు. తాగునీటి ప్రాజెక్ట్లు పూర్తి చేసి ప్రతి ప్రాంతానికి నీరు అందిస్తామని చంద్రబాబు చెప్పారు.

హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులు పూర్తి అయితే జిల్లాలో నీటి కొరత ఉండదన్నారు. కడపను ఉద్యాన హబ్గా మారుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. నదుల అనుసంధానంతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. నీరు చెట్టు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement