ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. ఈ వేడుకలను చూడటానికి వచ్చిన ఇద్దరు భక్తులు మృత్యువాత పడ్డారు. ఈదురు గాలులు, వడగండ్ల వర్షం కురుస్తుండటంతో నవమి వేడుకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నవమి వేడకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప చేరుకున్నారు. భారీ వర్షం కారణంగా ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తున్నారు. ఇదే సమయంలో ఉత్సవాలకు అంతరాయం కలిగిస్తూ ఒంటిమిట్టలో భారీ వర్షం కురుస్తోంది. కోదండరాముని ఆలయం వద్ద ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన పడుతోంది. దీంతో ఆలయ సమీపంలో ఉన్న చెట్టు నేలకొరిగింది.