ఒంటిమిట్ట రాములోరి కళ్యాణ వేదిక ఏర్పాట్లు పరిశీలన | TTD EO Dharma Reddy Ontimitta Ramulori wedding Venue Arrangements Examination | Sakshi
Sakshi News home page

ఒంటిమిట్ట రాములోరి కళ్యాణ వేదిక ఏర్పాట్లు పరిశీలన

Apr 2 2023 12:30 PM | Updated on Apr 2 2023 12:51 PM

TTD EO Dharma Reddy Ontimitta Ramulori wedding Venue Arrangements Examination - Sakshi

వైఎస్సార్‌ జిల్లా: ఒంటిమిట్ట రాములోరి కళ్యాణ వేదిక ఏర్పాట్లను టీటీడీ ఈవో  ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ నెల 5వ తేదీన జరుగనున్న రాములోరి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి అక్కడ ఏర్పాట్లను పరిశిలించారు.

దీనిలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈవో.. ‘ ఏప్రిల్ 5వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాములోరి కళ్యాణ మహోత్సవానికి హాజరవుతారు. సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులకు కంపార్ట్‌మెంట్లలోనే ప్రసాదాలను అందజేస్తాం. కళ్యాణ ప్రాంగణమంతా అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement