Talambaralu
-
రూ. 151 చెల్లిస్తే.. ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు
సాక్షి, హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను ఈ ఏడాది భక్తులకు అందజేసేందుకు తెలంగాణ ఆర్టీసీ (సిద్ధమైంది. గతేడాదిలానే ఈసారి కూడా దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని టీఎస్ ఆర్టీసీ తెలిపింది. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని పేర్కొంది. సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నారు. కాగా ఏప్రిల్ 17న భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు హైదరాబాద్‌లోని బస్ భవన్లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040-23450033, 040-69440000, 040-69440069ను సంప్రదించాలని సూచించారు. భక్తుల ఇంటికే భద్రాద్రి శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలు రూ.151 చెల్లిస్తే విశిష్టమైన రాములోరి తలంబ్రాలు పొందే సదావకాశం శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది… pic.twitter.com/POrpO87fEi — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 1, 2024 -
రామయ్య తలంబ్రాలు గంటకు 1,500 ప్యాకెట్లు
భద్రాచలం: భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు సిద్ధమవుతున్నాయి. భద్రాచలంలో కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు పంచడంతోపాటు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునేవారికి సరఫరా చేసేందుకు దేవస్థా నం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది భక్తులకు తలంబ్రాలు అందించేందుకు వీలుగా ప్రత్యే క యంత్రాల ద్వారా వాటిని ప్యాకింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తలంబ్రాల తయారీ ప్రక్రియ వేగం పుంజుకుంది. రామయ్య కల్యాణ తలంబ్రాలు కావాల నుకునేవారు మీసేవ కేంద్రాల ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇన్నాళ్ల ఇబ్బందికి చెక్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏటా శ్రీసీతా రాముల కల్యాణ మహోత్స వాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీతారాములకు సమర్పించే ముత్యా ల తలంబ్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఆ ముత్యాల తలంబ్రాలను ఇంటికి తీసుకెళితే మంచి జరు గుతుందన్న భావనతో చాలా మంది భక్తులు తీసుకుంటుంటారు. శ్రీరామనవమి రోజున భద్రాచలం వచ్చిన భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉచితంగానే ముత్యాల తలంబ్రాలను అందిస్తారు. దూర ప్రాంతాల్లో ఉండి కల్యాణోత్సవానికి హాజరు కాలేని వారితోపాటు బంధువులు, స్నేహితులకు అందజేసేందుకు కావాలను కునే భక్తుల కోసం దేవస్థానం రెండు ముత్యాలతో కూడిన తలంబ్రాలను విక్రయిస్తోంది. గతంలో ఈ తలంబ్రాలను స్వచ్ఛంద సంస్థ సభ్యులతో ప్యాకింగ్ చేయించేవారు. దీనితో చాలా సమయం పట్టడంతోపాటు ఆ ప్యాకెట్లు రవాణాలో చిరిగిపోయేవి. ఈ క్రమంలోనే వేగంగా ప్యాకింగ్ చేయడం, రవాణాలో దెబ్బతినకుండా ఉండేలా దేవస్థానం అధికారులు ప్యాకింగ్ యంత్రాలపై దృష్టిపెట్టారు. దాతల చేయూతతో యంత్రాలు.. ముత్యాల తలంబ్రాలు, పులిహోర ప్రసా దం ప్యాకింగ్ యంత్రాల కోసం దేవస్థానం అధికారులు దాతలను సంప్రదించారు. తిరుపతి ఖాదీబండార్కు చెందిన కుమార్ కిట్టు యాజమాన్యం రూ.1.40 లక్షలతో తలంబ్రాల ప్యాకింగ్ యంత్రాన్ని, శశి విద్యాసంస్థల యాజమాన్యం రూ.1.50 లక్షల విలువైన ప్యాకింగ్ కవర్లను సమకూ ర్చాయి. ఇక రూ.1.45 లక్షల విలువైన పులిహోర ప్రసాదం ప్యాకింగ్ యంత్రాన్ని తులసి ఆస్పత్రి యజమాన్యం ఏజేఆర్ సేవా సంస్థ పేరుతో సమకూర్చింది. గంటకు 1,500 ప్యాకెట్లు యంత్రంలో తలంబ్రాల నడుమ ముత్యాలు ఉంచి ఆన్ చేస్తే ఆటోమేటిక్‌గా ప్యాకెట్లు తయారై బయటికి వస్తాయి. ఈ యంత్రం ద్వారా నిమిషానికి 25 చొప్పున గంటకు 1,500 ప్యాకెట్లు సిద్ధమవుతున్నాయి. రోజూ సుమారు 20 వేల వరకు ప్యాకెట్లు చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. పులిహోర ప్యాకింగ్ యంత్రం ద్వారా గంటకు 1,400 వరకు ప్యాకెట్లు సిద్ధ మవుతున్నాయి. ఇటీవలి వరకు రోజువారీగా విక్ర యించే ప్రసాదాన్ని ప్యాక్ చేయాలంటే కార్మికులకు ఒకపూటంతా పట్టేదని.. ఇప్పుడు 2 గంటల్లోనే పని పూ ర్తవుతోందని అధికారులు చెప్పారు. పోస్టల్ శాఖ, ఆర్టీసీ కార్గో ద్వారా తలంబ్రాలను భక్తులకు చేరవేస్తున్నామని పేర్కొన్నారు. -
భద్రాద్రి రాములోరి కల్యాణానికి చీరాల గోటి తలంబ్రాలు
చీరాల: భద్రాద్రి సీతారాముల కల్యాణం అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు ఎనలేని భక్తిభావం. అవకాశం ఉన్నవాళ్లు భద్రాద్రి వెళ్లి ఆ కల్యాణాన్ని కనులారా వీక్షించి పులకించిపోతారు. వెళ్లలేని వాళ్లు టీవీల్లో వీక్షిస్తూనే భక్తిభావంతో ఉప్పొంగిపోతారు. సీతారాముల కల్యాణ క్రతువులో వినియోగించే తలంబ్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. తలంబ్రాలలో వినియోగించే బియ్యాన్ని గోటితో ఒలిచి స్వామివారికి సమర్పించే అవకాశం క్షీరపురిగా పిలిచే చీరాల వాసులకు వరుసగా తొమ్మిదోసారి దక్కింది. సీతారాముల కల్యాణానికి వడ్లను గోటితో ఒలిచి ఇక్కడి నుంచి పంపించడం ఈ ప్రాంత ప్రజలు తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. ఈ మహాసంకల్పానికి చీరాలకు చెందిన సిద్ధాంతి పి.బాలకేశవులు, మరికొందరు పూనుకుని నియమనిష్టలతో నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. చీరాలలో శ్రీ రఘురామ భక్తసేవా సమితి 2011లో 11మందితో ఏర్పాటైంది. వీరికి భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవానికి తలంబ్రాలు అందించే అవకాశం పూర్వజన్మ సుకృతంలా వచ్చింది. తలంబ్రాల కొరకు వడ్లను ఎంతో శ్రమంచి ఒలిచి, పసుపు, ఇతర సుగంధ ద్రవ్యాలతో కలిపి.. నియమనిష్టలతో, శాస్త్రోక్తంగా తలంబ్రాలు చేస్తారు. విజయదశమి నుంచి ప్రారంభించి ఉగాది వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 2015 అక్టోబర్ 23న చేపట్టిన ఈ మహా కార్యక్రమంలో.. ఏటా వందలాది భక్తులు పాల్గొంటున్నారు. విదేశాల్లోని వారికీ భాగస్వామ్యం రాములోరి కల్యాణానికి అవసరమైన తలంబ్రాలను తయారు చేసే క్రతువులో స్థానికంగానే గాక దేశ, విదేశాల్లోని తెలుగు వారిని కూడా భాగస్వాములు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ రాష్ట్రాలతో పాటు అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా దేశాల్లోని 10 వేల మంది భక్తులు ఇందులో భాగస్వాములయ్యారు. కమిటీ ప్రతినిధులు సీతారామ కల్యాణ వైభోగం, భద్రాద్రి సీతారామ కల్యాణం పేర్లుతో వాట్సాప్ గ్రూపులు ప్రారంభించారు. ఆసక్తి ఉన్న భక్తులను గ్రూపుల్లో చేర్చుకుని ఆయా ప్రాంతాలలో పర్యవేక్షకులుగా ఉన్న వారి ద్వారా భక్తులకు వడ్లు ఇచ్చారు. మరికొందరికి కొరియర్ ద్వారా పంపారు. అమెరికా నుంచి నాలుగేళ్లుగా వక్కలగడ్డ వెంకటేశ్వరరావు, పద్మజ దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అలానే దక్షిణాఫ్రికాలో 400 మంది భక్తులు మూడు సంవత్సరాలుగా వడ్లు ఒలిచి పంపిస్తున్నారు. ఇక్కడ ఆత్మకూరి శ్రీనివాసరావు, అప్పాజోస్యుల వీరవెంకటశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈనెల 25న భద్రాద్రికి తలంబ్రాలు, పసుపు, కుంకుమ, భద్రాద్రికి తీసుకెళ్తారు. పూర్వజన్మ సుకృతంలా భావిస్తున్నాం భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణానికి ఉపయోగించే తలంబ్రాలను అందించే అవకాశం మాకు కలగడం పూర్వజన్మ సుకృతమే. ప్రతి సంవత్సరం మేమంతా కలిసి తలంబ్రాలు తయారు చేస్తున్న విధానంపై దేవస్థానం అధికారులు, ధర్మకర్తలు సంతృప్తి చెందుతున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములే. – పొత్తూరి బాలకేశవులు, చీరాల -
టీఎస్ఆర్టీసీ ఆఫర్.. ఇంటి వద్దకే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసేందుకు సన్నద్దమవుతోంది. తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కార్గో పార్శిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్ఆర్టీసీ హోం డెలివరీ చేయనుంది. హైదరాబాద్‌లోని బస్ భవన్లో బుధవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు. అనంతరం బిజినెస్ హెడ్ (లాజిస్టిక్స్) పి.సంతోష్ కుమార్‌కు రూ.116 చెల్లించి రశీదును ఆయన స్వీకరించారు. తొలి బుకింగ్ చేసుకుని తలంబ్రాల బుకింగ్‌ను ప్రారంభించారు. ‘భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఆ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని గత ఏడాది టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. తమ సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. గత ఏడాది దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను అందజేశాం. తద్వారా రూ.71 లక్షల రాబడి వచ్చింది. గత ఏడాది డిమాండ్ దృష్ట్యా ఈ శ్రీరామ నవమికి భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను కోరుకునే భక్తులకు అందజేయబోతున్నాం. ఈ సారి రాములోరి కల్యాణంతో పాటు 12 ఏళ్లకో సారి నిర్వహించే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. భద్రాద్రిలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలి. విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందాలి’ అని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్ఆర్టీసీ కార్గో పార్శిల్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగ ఫోన్ నంబర్లు 9177683134, 7382924900, 9154680020ను సంప్రదించాలన్నారు. తమ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద కూడా ఆర్డర్‌ను స్వీకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, వినోద్ కుమార్, మునిశేఖర్, సీపీఎం కృష్ణకాంత్, సి.టి.ఎం (ఎం అండ్ సి) విజయ్‌కుమార్, సీఎంఈ రఘునాథ రావు, సీఎఫ్ఎం విజయ పుష్ప, నల్లగొండ ఆర్ఎం శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. -
భద్రాద్రి రాముడి తలంబ్రాలకు సీమంతం
సాక్షి, గోకవరం(తూర్పుగోదావరి): భద్రాచలం, ఒంటిమిట్టలలో జరిగే శ్రీరాముని కళ్యాణానికి వినియోగించే కోటి తలంబ్రాల పంటకు శుక్రవారం సీమంతం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో పండిస్తున్న ఈ కోటి తలంబ్రాల పంటకు కోరుకొండ శ్రీకృష్ణచైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో సీమంతం జరిపారు. పొట్టదశలో ఉన్న పంటకు గాజులు, రవిక, పండ్లు, పుష్పాలు సమర్పించారు. సీతారామ అష్టోత్తర సహస్రనామార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. ఈ సందర్భంగా కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ.. శ్రీరామతత్వం ప్రచారం, కోటి తలంబ్రాల జ్ఞానయజ్ఞంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. 11వ సారి భద్రాచలంకు, 5వ సారి ఒంటిమిట్టకు కోటి తలంబ్రాలు పంపుతుండటం సంతోషంగా ఉందన్నారు. -
రామ నామము తలచి...గోటితో వలిచి..
భద్రాచలం: సీతమ్మవారి మెడలో జగదభిరాముడు మంగళసూత్రాలు కట్టే క్షణం కోసం భక్తులు ఎదురు చూస్తారు. ఈ సందర్భంగా ‘జానకి దోసిట కెంపుల బ్రోవై.. రాముని దోసిట నీలపు రాశై.. ఆణిముత్యములే తలంబ్రాలుగా..’ అంటూ శ్రీ సీతారాముల కల్యాణాన్ని వర్ణించే క్రమంలో తలంబ్రాలకు గల ప్రత్యేకతను వివరిస్తారు. అలాంటి తలంబ్రాలను భక్తితో, అకుంఠిత దీక్షతో, వడ్లను గోటితో ఒలిచి రామయ్య కల్యాణానికి తీసుకొస్తున్న కోరుకొండ భక్త సైన్యంపై ప్రత్యేక కథనం.. 2012లో శ్రీకారం.. శ్రీ సీతారాముల కల్యాణానికి నాడు శచీదేవి, అహల్యతో పాటు శబరి కూడా శ్రీరామ ధ్యానం చేస్తూ గోటితో వడ్లను ఒలిచారని ప్రతీతి. అప్పట్లో రామయ్యకు ముత్యాల తలంబ్రాలతో పాటు గోటి తలంబ్రాలు కూడా అందేవని ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా వాసులు తరతరాలుగా గోటి తలంబ్రాలు అందించేవారని, కొంత కాలం తర్వాత అది నిలిచిపోయిం దని తెలుసుకున్న తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన కల్యాణం అప్పారావు ఓ బృహత్కార్యానికి 2012లో శ్రీకారం చుట్టారు. తానొక్కడే కాకుండా రామ భక్తులందరినీ ఏకం చేసి ‘శ్రీకృష్ణ చైతన్య సంఘం’ ఏర్పాటు చేసి గోటి తలంబ్రాల యజ్ఞాన్ని ప్రారంభించారు. ‘శ్రీరామ క్షేత్రం’లో గోటి తలంబ్రాల పంట.. తలంబ్రాలకు వినియోగించే వరి నారు వేసేటప్పటి నుంచి పంట కోత కోసే వరకు ఆధ్యాత్మిక కార్యక్రమంగానే భక్తులు భావిస్తుంటారు. నారు పోసే ముందు విత్తనాలను భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మూలమూర్తుల పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత వాటిని అప్పారావుకు చెందిన తూర్పుగోదావరి గోకవరం మండలం అచ్యుతాపురంలోని ఎకరం పొలంలో.. భక్తులు ఆంజనేయస్వామి, వానరుల వేషధారణలో పొలం దున్ని, నాటు వేస్తారు. పొట్ట దశకు వచ్చాక భక్తిశ్రద్ధలతో సీమంతం చేస్తారు. వరి కోసేటప్పుడు కూడా రాముడి వేషధారణలో ఉన్న భక్తుడికి మొదట అందజేస్తారు. శ్రీరామనవమికి 2 నెలల ముందు నుంచే గోటితో వడ్లను ఒలుస్తారు. పరిసర గ్రామాల మహిళలు, భక్తులు శ్రీరామ చిత్ర పటం ముందు రామ నామస్మరణ చేస్తూ ‘వడ్లు వలుపు–శ్రీరాముని పిలుపు’ పేరిట గోటితో ఒలుస్తారు. ఆ బియ్యాన్ని కలశాలలో పెట్టి రాజమండ్రిలో గోదావరి పుష్కర ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి ‘రామయ్య పెళ్లికి రామచిలుకలతో పిలుపు’ కార్యక్రమం నిర్వహించి భద్రాచ లం తీసుకొస్తారు. తలంబ్రాలతో భద్రగిరి ప్రదక్షిణ చేసి రామాలయంలో అందజేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాలకు విస్తరణ.. గోటి తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొంటే శుభం కలుగుతుందనే నమ్మకంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలోని పలు జిల్లాల భక్తులు కూడా గోటి తలంబ్రాలు ఒలుస్తున్నారు. కర్ణాటకకు చెం దిన భక్తులు సైతం ఈ ఏడాది ఈ యజ్ఞంలో పాల్గొంటుండడం విశేషం. గతంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో మహిళా ఖైదీల్లో మార్పు రావడం కోసం గోటి తలంబ్రాలను ఒలిపించారు. ఒంటిమిట్ట రామాలయానికి.. భద్రాచలం కల్యాణానికి అందిస్తున్న ఈ గోటి తలంబ్రాలను రాష్ట్ర విభజన తర్వాత 2015 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట రామాలయంలో జరిగే కల్యాణానికి సైతం పంపిస్తున్నారు. -
కోటి తలంబ్రాల సేద్యానికి శ్రీకారం
భద్రాచలం: ఏటా శ్రీరామనవమి రోజున గోటితో వలిచిన కోటి తలంబ్రాలను తూర్పు గోదావరి జిల్లా నుంచి భద్రాచలం తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో వచ్చే శ్రీరామనవమికి తీసుకొచ్చే వరి ధాన్యాన్ని పండించేందుకు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ శ్రీ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో గురువారం పనులకు శ్రీకారం చుట్టా రు. సీతారామచంద్రస్వామికి, ఒంటిమిట్ట కోదండరామయ్యకు ఎనిమిదో సారి గోటి తలంబ్రాలను సమర్పించేందుకు వరి విత్తనాలకు ఇటీవలే భద్రాద్రి రామయ్య సన్నిధిలో పూజలు జరిపామని సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు తెలిపారు. ఆ విత్తనాలను గోకవరంలోని తమ భూమిలో పండిస్తామన్నారు. పూజ చేసిన విత్తనాలను పొలంలో ఉంచి శ్రీరామ అష్టోత్తర శతనామ పూజలు చేశారు. వానర వేషధారణతో ఉన్న శ్రీరామ భక్తులు అరక దున్ని, విత్తనాలనుచల్లి ఆకుమడి తయారు చేశారు. ఇలా తలంబ్రాల వరకు అంతా రామమయం అనే భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అప్పారావు తెలిపారు. సేంద్రియ ఎరువులతో సాగు చేసేలా రైతులను చైతన్యం చేయడానికి కోటి తలంబ్రాలు సాగు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. -
రామయ్య పెళ్లికి గోటి తలంబ్రాలు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఈ నెల 28న జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి కోటి గోటితో వలిచిన తలంబ్రాలు తీసుకురానున్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి సమీపంలోని కోరుకొండకు చెందిన కల్యాణం అప్పారావు తెలిపారు. దీనిలో భాగంగా మూడు కలశాల తలంబ్రాలను ఆలయ అధికారులకు శనివారం అందజేశారు. కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో స్వయంగా గోటితో ధాన్యం గింజలను ఒలిచి కోటి తలంబ్రాలను సిద్ధం చేశామన్నారు. సంఘం వారు తీసుకొచ్చిన మూడు కలశాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఏఈవో శ్రావణ్‌కుమార్, ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, ఆలయ పర్యవేక్షకులు నర్సింహారాజు, వెంకటప్పయ్య, పీఆర్వో సాయిబాబా, ప్రసాదవధాని పాల్గొన్నారు.