భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఈ నెల 28న జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి కోటి గోటితో వలిచిన తలంబ్రాలు తీసుకురానున్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి సమీపంలోని కోరుకొండకు చెందిన కల్యాణం అప్పారావు తెలిపారు. దీనిలో భాగంగా మూడు కలశాల తలంబ్రాలను ఆలయ అధికారులకు శనివారం అందజేశారు. కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో స్వయంగా గోటితో ధాన్యం గింజలను ఒలిచి కోటి తలంబ్రాలను సిద్ధం చేశామన్నారు.
సంఘం వారు తీసుకొచ్చిన మూడు కలశాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఏఈవో శ్రావణ్‌కుమార్, ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, ఆలయ పర్యవేక్షకులు నర్సింహారాజు, వెంకటప్పయ్య, పీఆర్‌వో సాయిబాబా, ప్రసాదవధాని పాల్గొన్నారు.
రామయ్య పెళ్లికి గోటి తలంబ్రాలు
Published Sun, Mar 15 2015 4:34 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM
Advertisement
Advertisement