సాక్షి, రాజమహేంద్రవరం: పోలీసులు తనను హింసించడమే కాకుండా గుండు గీయించారని ప్రసాద్ అనే యువకుడు ఆరోపించాడు. తనపై దౌర్జన్యం చేసిన ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు. వివరాలు.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ముని కూడలిలో బైక్ వెళుతున్న ప్రసాద్‌ను ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాదంపై లారీ డ్రైవర్‌కు, ప్రసాద్‌కు మధ్య వాగ్వాదం చెలరేగింది. రాజీ చేసేందుకు మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి సైతం ప్రయత్నించగా వివాదం ఇంకాస్తా ముదిరింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ప్రసాద్‌పై సీతానగరం పోలీస్ స్టేషన్‌లో మాజీ సర్పంచ్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తనను తీవ్రంగా కొట్టి గుండు గీయించారని ప్రసాద్ ఆరోపిస్తున్నాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు ఎస్ఐ ఫిరోజ్‌తో పాటు కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment