
సాక్షి, కాకినాడ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 216వ రోజు షెడ్యూల్ ఖరారైంది. వైఎస్ జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత గురువారం ఉదయం మండపేట నియోజకవర్గంలోని రాయవరం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.
అక్కడి నుంచి మాధవనగర్, రంగరాయ మెడికల్ కాలేజీ మీదుగా జేఎన్‌టీయూ సెంటర్ వరకు కొనసాగుతుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జననేత పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. రాజన్న బిడ్డకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసన పాదయాత్ర
వైఎస్ జగన్ 215వ రోజు పాదయాత్రను ముగించారు. నేడు ఆయన పాదయాత్రను కొవ్వాడ శివారు నంచి చీడిగ, ఇంద్రపాలెం, ఎస్‌ఆర్‌కే సెంటర్, సంతచెరువు, కల్పన సెంటర్, కోకిల సెంటర్ మీదుగా ఆదిత్య కళాశాల సెంటర్ వరకు పాదయాత్ర కొనసాగించారు. ఇవాళ రాజన్నబిడ్డ 9 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ 2,559.9 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.