
సమావేశంలో మాట్లాడుతున్న అనూరాధ
సాక్షి, మండపేట: వైఎస్సార్ సీపీ అభ్యర్థి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను అఖండ విజయంతో గెలిపించి పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇద్దామని, తద్వారా మండపేటకు మంత్రి పదవిని తెచ్చుకుందామని పార్టీ శ్రేణులకు నేతలు సూచించారు. సమయం తక్కువగా ఉన్నందున ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని బోస్ పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం స్థానిక అరవింద రైస్‌మిల్లు ఆవరణలో జరిగింది. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పార్టీ అభ్యర్థి బోస్, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి చింతా అనురాధ, మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన, మున్సిపల్ ప్రతిపక్షనేత రెడ్డి రాధాకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, దూలం వెంకన్నబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చింతా అనూరాధ మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా తాను, తన నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించుకుని అధినేతకు కానుకగా అందజేస్తానన్నారు.
మాజీ ఎంపీ రవీంద్రబాబు మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి మాట్లాడుతూ వైఎస్ స్వర్ణయుగం పాలన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమన్నారు. మున్సిపల్ ప్రతిపక్షనేత రాజుబాబు మాట్లాడుతూ మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన బోస్ రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి ఆరోపణ లేకపోవడం ఆయన నిజాయితీకి నిదర్శనమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు మాట్లాడుతూ బోస్ విజయంతో మండపేట నియోజకవర్గానికి మంత్రి పదవి రానుందన్నారు. రాష్ట్ర కార్యదర్శి వెంకన్నబాబు మాట్లాడుతూ పార్టీ శ్రేణులు శక్తివంచన లేకుండా బోస్ విజయానికి కృషి చేయాలన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు చిన్నం అపర్ణపుల్లేష్, సొసైటీ అధ్యక్షులు నల్లమిల్లి చినకాపు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నల్లమిల్లి వీర్రెడ్డి, పెంకే వెంకట్రావు, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ సిరిపురపు శ్రీనివాసరావు, పార్టీ నాయకులు ఆకుమర్తి చిన్న, పోతంశెట్టి ప్రసాద్, సత్యకృష్ణ, గంగుమళ్ల రాంబాబు, పిల్లా వీరబాబు, సాధనాల శివ, దంతులూరి శ్రీరామవర్మ, వల్లూరి రామకృష్ణ, బోణి కుమారి, నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
బోస్ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా : పట్టాభి
సమావేశంలో మాట్లాడుతున్న పట్టాభి
నియోజకవర్గంలో బోస్ విజయానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని పార్టీ నేత పట్టాభిరామయ్య చౌదరి తెలిపారు. ఎల్లప్పుడు బోస్ వెంటే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పట్టాభి సూచించారు. బోస్ విజయాన్ని జగన్‌కు కానుకగా అందజేస్తామన్నారు. అలాగే ఎంపీ అభ్యర్థి చింతా అనురాధకు నియోజకవర్గంలో భారీ ఆధిక్యత వచ్చేందుకు పాటుపడతానని పట్టాభిరామయ్య చౌదరి పేర్కొన్నారు.

వేలాదిగా హాజరైన పార్టీ శ్రేణులు

సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ బిక్కిన
Comments
Please login to add a commentAdd a comment