న్యూఢిల్లీ: చంద్రబాబు సొంత ఎజెండాతోనే అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'బాబు తన బినామీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరగాలనే ఆలోచనతో వైఎస్ జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి అవసరం లేదా..?.
సీఎం తీసుకున్న నిర్ణయాలను కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు. పేదలకు ఇల్లు దక్కకుండా కేసులు వేశారు. సీఎం జగన్ మన ఇల్లు- మన పట్టా ద్వారా న్యాయమైన హక్కు కల్పిస్తామని అంటే దానికి అడ్డుపడ్డారు. ఇంగ్లీష్ మీడియం చదువులు పేదలకు అందకుండా ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పేదలపై సామాజిక దాడి చేస్తున్నారు. జస్టిస్ చంద్రుపై చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన అహంభావానికి నిదర్శనం. కుప్పం ఎన్నికలలో చంద్రబాబును ఛీత్కరించారు. మూడు లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదని' మోపిదేవి వెంకటరమణ అన్నారు.
చదవండి: (రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొనే పీఆర్సీ: సజ్జల)
ప్రజల్ని రెచ్చగొట్టేందుకు రాజధాని పాదయాత్రలు
అమరావతిలో పేదలకు పట్టాలు ఇస్తే జనాభాలో అసమతుల్యత జరుగుతుందని చంద్రబాబు అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన బాబును ఏం చేసినా పాపం లేదు. వైఎస్ జగన్ పవిత్రమైన లక్ష్యంతో పరిపాలన చేస్తున్నారు. బాబు ఇకనైనా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.. భూముల కోసం రాజధాని పెట్టాలా..? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసమే అమరావతి. రాజధానికి 33వేల ఎకరాలు అనవసరం. మూడు వేల ఎకరాలకంటే ఎక్కువ అవసరం లేదు. రైతులను మోసం చేసి ముంచిన ఘనుడు బాబు.
రియల్ ఎస్టేట్ వ్యాపారానికి విఘాతం కలిగిందని బాబు ఏడుపు. పరిపాలన వికేంద్రీకరణ వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యం. వికేంద్రీకరణతో మరోసారి రాష్ట్ర విభజన రాదు. ఏపీ ప్రజలను రెచ్చగొట్టేందుకు రాజధాని పాదయాత్రలు చేస్తున్నారు. కార్పొరేషన్లపై రూ.13 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్లకు అప్పుల భారం పెంచారు. దీనిపై వడ్డీలకు వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్థిక మాంద్యం, కరోనా వల్ల రాష్ట్రానికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు రెచ్చగొట్టే విధానాలను మానుకోవాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment