
సాక్షి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ శనివారం ఉదయం కాకినాడ జేన్‌టీయూ సెంటర్ నుంచి అశేష ప్రజానీకం మధ్య 217 రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి నాగమల్లి తోట జంక్షన్, సర్పవరం జంక్షన్ మీదుగా ఏపీఐఐసీ కాలనీకు పాదయాత్ర చేరుకుంటుంది.
అనంతరం జననేత మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి 2.45కు ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి అచ్చంపేట జంక్షన్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత స్థానిక మత్స్యకారుల సమస్యలు అడిగి వైఎస్ జగన్ తెలుసుకుంటారు. రాజన్న బిడ్డ రాత్రికి అక్కడే బస చేస్తారు. ప్రజా సమస్యలు వింటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment