సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు బాబు జగజ్జీవన్ రామ్‌కి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అంబేడ్కర్, జగజ్జీవన్ రామ్ లు ఒకరు ఆలోచన..మరొకరు ఆచరణ. ఈ రోజు ఈ దేశం ఇలా సమతా దిశగా ఉందంటే అది వారిద్దరి కృషే. వైఎస్సార్సీపీలోనే దళిత డీఎన్‌ఏ ఉంది. ఈ ప్రభుత్వం మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతి కోసం పాటు పడుతోంది. రాజకీయ సాధికారితలో భాగంగా ఒక ప్రణాళిక బద్దంగా ఇవన్నీ చేస్తున్నాం.
ఇంతకుమందు నాయకులకు మాటలు తప్ప చేతలు లేవు. కానీ మా పార్టీ మంత్రి వర్గ కూర్పు నుంచి అన్నింటిలో దళితులకు ప్రాధాన్యం ఇస్తోంది. దళితులను అన్నిరకాలుగా ముందు తీసుకురావడానికి నిబద్ధతతో చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాయి. ఎవరో బిచ్చం వేసేదిగా కాకుండా హక్కుగా మేము ఇస్తున్నాం. బడుగు బలహీనవర్గాల వారందరూ ఈ ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలు ఉపయోగించుకోవాలి. అప్పుడే రానున్న పదేళ్ళలో జగజ్జీవన్ రామ్ ఆశయాలు నెరవేరతాయి అని నొక్కి చెప్పారు. ఈ వేడుకలకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అదిమూలపు సురేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మెరుగ నాగార్జున, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
(చదవండి: చంద్రబాబు దున్నపోతు ఈనిందని చెబితే పవన్ దూడను కట్టెసే రకం: పేర్ని నాని)
Comments
Please login to add a commentAdd a comment