సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మహానేత వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహానేతతో తమ జ్ఞాపకాలను నేతలు గుర్తుచేసుకున్నారు.
కోట్లాది మంది ప్రజల హృదయాల్లో వైఎస్సార్ సుస్థిరస్థానం సంపాదించుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్ ఎప్పటికీ మనతోనే ఉంటారు. వైఎస్సార్ మనసున్న నాయకుడు. మనసుతో పాలన చేసిన మహానేత వైఎస్సార్. వైఎస్సార్ అడుగుజాడల్లోనే సీఎం జగన్ పాలన చేస్తున్నారని సజ్జల అన్నారు.
‘‘వైఎస్సార్, వైఎస్ జగన్ పాలనలో ఉండటం మన అదృష్టం. అందరూ బావుండాలని కోరుకునే వ్యక్తి వైఎస్సార్. మనసున్న వ్యక్తి పాలకుడైతే ప్రజలు సంతోషంగా ఉంటారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
తిరుపతిలో..
సీఎం జగన్ సంక్షేమ పాలనలో రాష్ట్రంలో 60 శాతానికిపైగా ప్రజలు తిరిగి వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తుడా సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి భూమన నివాళులర్పించారు. వైఎస్సార్ మనల్ని విడిచి 14 ఏళ్లు అయినా ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేక పోతున్నారనీ, ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు.
ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా వైఎస్సార్: మంత్రి పెద్దిరెడ్డి
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తిరుపతిలో క్యాంప్ కార్యాలయంలో ఆయన విగ్రహానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సంక్షేమ పాలన అందించిన వైఎస్సార్ ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో..
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కంట్రోల్ రూం వద్ద వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి , డిప్యూటీ మేయర్లు, వైసీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment