రైతు మోసకారి చంద్రబాబు
ఒంగోలు అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల్ని నిలువునా మోసం చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బూటకపు హామీలతో అన్ని వర్గాలను మభ్యపెట్టారని విమర్శించారు.
రుణమాఫీ విషయంలో పూటకో మాట మారుస్తూ ఇప్పుడేమో రూ.50 వేలలోపు వారికి రుణ విముక్తి అంటూ పనికిరాని పత్రాలను ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రుణ విముక్తి ద్వారా ఎవరైనా లబ్ధి పొందారంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేనని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ, రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, సీజీసీ సభ్యుడు శేషారెడ్డి, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ వేమూరి బుజ్జి తదితరులున్నారు.
రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించిన వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డికి, అందుకు సహకరించిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
బత్తుల సేవలు పార్టీకి అవసరం
అపార అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డికి రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించడం సంతోషకరమని జిల్లా వైఎస్సార్ సీపి నాయకులు అన్నారు. ఈ మేరకు జిలా ్లనేతలు పూలమాలలు, పుష్పగుఛాలతో ఆయన్ని అభినందించారు. విజయవాడ ఇన్‌చార్జి వై.వెంకటేశ్వర్లు, ట్రేడ్ యూనియన్ నాయకులు కేవీ ప్రసాద్, జిల్లా ఉపాధి కల్పన విభాగం కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, నరాల రమణారెడ్డి, నగర మహిళా కన్వీనర్ కావూరి సుశీల, బడుగు ఇందిర, బత్తుల ప్రమీల, గంగాడ సుజాత ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.