పార్లమెంటు ఉభయసభలు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: లోక్ సభ, రాజ్యసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇరు సభల స్పీకర్లు సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది శీతాకాల సమావేశాలు నిస్సారంగా సాగాయి. ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ సభలు ముగిసిపోయాయి. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్ సభకు హాజరయ్యారు.
ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ బిల్లు-2016ను లోక్ సభ ఆమోదించింది. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై ప్రతిపక్షాలు, అధికారపక్షం ఒకరిపై ఒకరు ఆరోపణల మినహా ఇరు సభల్లో ఎలాంటి చర్చా జరగలేదు. మొత్తం 30 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ఒక్క రోజు కూడా సభ సజావుగా సాగలేదు.