Winter Sessions
-
పార్లమెంట్ సమావేశాలకు తెర
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు షె డ్యూల్ కంటే ఆరు రోజుల ముందే శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 7న సమావేశాలు ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న ముగియాల్సి ఉంది. సరిహద్దులో భారత్–చైనా ఘర్షణపై పార్లమెంట్ చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఉభయ సభలను కొద్దిరోజులుగా స్తంభింపజేస్తున్నాయి. దీంతో సభలను తరచూ వాయిదా వేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శీతాకాల సమావేశాలను షెడ్యూల్ కంటే ముందే ముగించినట్లు తెలుస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ దృష్ట్యా ఇందుకు అన్ని పార్టీల సభాపక్ష నేతలు అంగీకరించారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. శుక్రవారం చివరి రోజు పార్లమెంట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ తదితరులు హాజరయ్యారు. వరుసగా ఎనిమిదోసారి.. పార్లమెంట్ సమావేశాలు షెడ్యూల్ కంటే ముందే ముగియడం ఇది వరుసగా ఎనిమిదోసారి! 17వ లోక్‌సభలో అత్యంత తక్కువ కాలం జరిగిన భేటీల్లో ఇది కూడా ఒకటని సమాచారం. -
‘మహా’ అసెంబ్లీ సమావేశాలు: 10 మందికి పాజిటివ్
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి వ్యాప్తి దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందనుకున్న కోవిడ్.. ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మళ్లీ పంజా విసురుతోంది. 54 ఒమిక్రాన్ కేసులతో మహారాష్ట్ర దేశంలోనే రెండో స్థానంలో ఉంది. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పది మందికి కోవిడ్ నిర్ధారణ అవ్వడం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానునున్నాయి. ఈ క్రమంలో సమావేశాలకు ముందు దాదాపు 3,500 మందికి ఆర్టీపీసీఆర్ ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు. చదవండి: ఒమిక్రాన్ అప్డేట్స్.. రాష్ట్రాలవారీగా కేసుల వివరాలు.. వీరిలో 10 మందికి పాజిటివ్‌గా తేలింది. కోవిడ్ సోకిన వారిలో ఎనిమిది మంది పోలీసులతోపాటు ఇద్దరు అసెంబ్లీ సిబ్బంది ఉన్నారు. అయితే ఏ జర్నలిస్ట్ గానీ, ఎమ్మెల్యేల గానీ కోవిడ్ బారిన పడలేదు. కాగా పది కరోనా కేసులు వెలుగుచూడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరింత పటిష్టంగా వైద్య పరీక్షలు నిర్వహించి అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాటు చేయనున్నారు. చదవండి: ఎన్నికల సంస్కరణలకు రాజ్యసభలోనూ ఆమోదం స్పీకర్ రేసులో సంగ్రామ్ థోపటే మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత నానా పటోలే అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి స్పీకర్ స్థానం ఖాళీగా ఉంటోంది. ఈ క్రమంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ను ఎన్నుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, మహావికాస్ ఆఘాడి కూటమి ఒప్పందంలో భాగంగా స్పీకర్ పదవిని కాంగ్రెస్‌కే ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ పార్టీ నేత, భోర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సంగ్రామ్ థోపటే స్పీకర్ రేసులో ఉన్నారు. మరోవైపు, నిన్న మొన్నటి వరకు స్పీకర్ ఎన్నిక గురించి నోరు విప్పని బీజేపీ.. ఇప్పుడు తమ అభ్యర్థిని కూడా స్పీకర్ ఎన్నిక బరిలో దింపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ప్రకటన చేశారు. దీంతో స్పీకర్ ఎన్నిక రసవత్తరంగా మారే అవకాశం లేకపోలేదు. అయితే, రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 మంది ఎమ్మెల్యేలుండగా, అందులో మహావికాస్ ఆఘాడి కూటమికి చెందినవారు 170 మంది ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు 106 మంది ఉన్నారు. ఈ క్రమంలో సంఖ్యా బలం దృష్ట్యా చూస్తే స్పీకర్ పదవి మహావికాస్ ఆఘాడి కూటమికి చెందిన అభ్యర్థికే దక్కే అవకాశమే కనిపిస్తోంది. -
మొదటి వారం రాజ్యసభ సమావేశాలు.. 52 శాతం సమయం వృథా
సాక్షి, న్యూఢిల్లీ: శీతాలకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీలు పలు అంశాల మీద నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించిన 12 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. 12 మంది ఎంపీలను సస్పెండ్ చేసినందుకు ప్రతిపక్షాలు.. ఇది అప్రజాస్వామిక చర్య అని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయటం పట్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, కాని వారు సభకు క్షమాపణలు చెప్పాలని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషీ డిమాండ్ చేశారు. చదవండి: గాంధీల దేశాన్ని గాడ్సే దేశంగా మారుస్తున్నారు: మెహబూబా ముఫ్తీ ఈ నేపథ్యంలో మొదటి వారం రోజులు జరిగిన సమావేశాల్లో 52 శాతం సమయాన్ని రాజ్యసభ కోల్పోయింది. విపక్షాల నిరసన వల్ల సభా సమయం వృథా కావడంపై రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కొంతమంది ప్రతిపక్ష నాయకులు, కేంద్ర మంత్రులతో చర్చించారు. 12 మంది సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై ఇరు పక్షాలు చర్చించి ఒక అభిప్రాయానికి రావాలని తెలిపారు. మొదటి వారం రాజ్యసభ సమావేశాల్లో రెండు బిల్లులు ఆమోదం పొందాయి. -
చర్య తీసుకున్నాం.. అదే ఫైనల్
న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి 12 మంది విపక్ష ఎంపీలను శీతాకాల సమావేశాల్లో సెషన్ మొత్తం సస్పెండ్ చేయడాన్ని చైర్మన్ వెంకయ్య నాయుడు మంగళవారం సమర్థించారు. వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా ప్రవర్తించారని, అయినప్పటికీ వారిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు. ‘12 మందిపై సస్పెన్షన్ వేటు వేస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. చర్య తీసుకున్నాం. ఇక అదే ఫైనల్’ అని తేల్చిచెప్పారు. ఈ సస్పెన్షన్‌ను రద్దు చేయాలంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే చేసిన విజ్ఞప్తిని వెంకయ్య తిరస్కరించారు. అంతకముందు సభలో ఖర్గే మాట్లాడుతూ.. 12 మందిని సస్సెండ్ చేస్తూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ నిబంధనలకు విరుద్ధంగా తీర్మానం ప్రవేశపెట్టారని విమర్శించారు. ప్రవర్తన సక్రమంగా లేని సభ్యులను సభ నుంచి బహిష్కరించే అధికారం సభాపతికి ఉందని వెంకయ్య గుర్తుచేశారు. సస్పెన్షన్ అంశాన్ని జీరో అవర్‌లో ప్రస్తావించేందుకు వెంకయ్య అవకాశం ఇవ్వలేదు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. సస్పెన్షన్‌ను రద్దు చేయండి ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని 16 విపక్షాల నేతలు మంగళవారం వెంకయ్యను కలిసి విజ్ఞప్తి చేశారు. అనుచిత ప్రవర్తను క్షమాపణ చెప్పాలని వెంకయ్య సూచించినట్లు తెలిసింది. ప్రతిపక్ష నేతలు తొలుత కాంగ్రెస్ ఎంపీ ఖర్గే చాంబర్లో సమావేశమయ్యారు. ఈ భేటీకి రాహుల్ హాజరైనట్లు తెలిసింది. కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, టీఆర్ఎస్, ఆర్ఎస్పీ, ఆమ్ ఆద్మీ, ఎండీఎంకే, ఎల్జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర ప్రతిపక్షాల భేటీకి తృణమూల్ హాజరుకాకపోవడం గమనార్హం. ఈ సెషన్ మొత్తం సస్పెండైన 12 మంది ఎంపీలలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు. ఎంపీలపై నిబంధలనకు విరుద్ధంగా తీర్మానం ప్రవేశపెట్టారని ఖర్గే తెలిపారు. ఇలా చేయడం రూల్స్ ఆప్ ప్రొసీజర్, కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌లోని రూల్ 256(1)ను ఉల్లంఘించడమే అవుతుందని వెంకయ్యకు లేఖ రాశారు. దిగువ సభలో నిరసనల హోరు లోక్‌సభలో మంగళవారం గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాల నిరసనల కారణంగా సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. రైతాంగం సమస్యలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో పలుమార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. తొలుత సభ ప్రారంభం కాగానే కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రశ్నోత్తరాలు మొదలుపెట్టగానే టీఆర్ఎస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో మృతిచెందిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, వామపక్ష సభ్యులు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు చేశారు. వెనక్కి వెళ్లి, సీట్లలో కూర్చోవాలని స్పీకర్ బిర్లా పదేపదే కోరినప్పటికీ టీఆర్ఎస్ సభ్యులు పట్టించుకోలేదు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, వామపక్షాల ఎంపీలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల(వేతనాలు, సేవలు) సవరణ బిల్లు–2021ను ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్ ఓంబిర్లా సభను బుధవారానికి వాయిదా వేశారు. క్షమాపణ ఎందుకు చెప్పాలి?: రాహుల్ ఎందుకోసం క్షమాపణ చెప్పాలి? ప్రజా సమస్యల ను పార్లమెంట్లో ప్రస్తావించినందుకా? క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. -
కావాలనే సభ నుంచి వెళ్లిపోయిన చంద్రబాబు!
సాక్షి, అమరావతి: సభలో టీడీపీ తీరుపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్ష పార్టీ తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని.. సభ నిర్వహణకు అస్సలు సహకరించడం లేదని పేర్కొన్నారు. కాగా ఐదో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పోడియం వద్దకు దూసుకొచ్చిన టీడీపీ సభ్యులను స్పీకర్ సభ నుంచి బయటకు పంపించారు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం గురించి స్పీకర్ మాట్లాడుతూ.. ‘‘ప్రతిరోజు ఇలాగే సభను అడ్డుకుని దారుణంగా వ్యవహరిస్తున్నారు. రోజు సస్పెండ్ చేయడం నాకు బాధ కలుగుతోంది. కానీ వాళ్ళ ప్రవర్తనతో నాకు వేరొక ప్రత్యామ్నాయం లేదు. అందుకే ఈ సభలో కొన్ని నిబంధనలు తీసుకు రావాలని అనుకుంటున్నాం. సభను సక్రమంగా నడిపేందుకు ప్రత్యేక నిర్ణయాలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. (చదవండి: ఏపీ అసెంబ్లీ, మండలి 5వ రోజు: లైవ్ అప్డేట్స్) ముందే నిర్ణయించుకున్న చంద్రబాబు! ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే సభలో ఉండరాదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నేడు సభలో అమూల్ (ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్) గురించి చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా హెరిటేజ్ ప్రస్తావన వచ్చింది. ఈ నేపథ్యంలో రైతులకు హెరిటేజ్ చేస్తున్న మోసంపై సమాధానం చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో బైటకు రావాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు కావాలనే స్పీకర్ పోడియం చుట్టి ముట్టి.. సభలో గొడవ చేసి సస్పెండ్ చేయించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అమూల్ గురించి చర్చ సందర్భంగా సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలతో చంద్రబాబు బయటకు వచ్చేయడం గమనార్హం. -
ఏపీ అసెంబ్లీ: పథకం ప్రకారం నిర్వీర్యం
బాబు సీఎంగా ఉన్నప్పుడే పెరిగిన హెరిటేజ్ షేర్లు సహకార రంగాన్ని పథకం ప్రకారం చంద్రబాబు ఖూనీ చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రభుత్వ డైయిరీలను ఏపీ మ్యాక్స్ కిందకు తీసుకొచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హెరిటేజ్ షేరు లాభాలు పెరుగుతాయని తెలిపారు. ‘2014లో వంద రూపాయలు ఉన్న హెరిటేజ్ 2017లో 827 రూపాయలకు పెరిగింది. 2020 మార్చి నాటికి మళ్లీ 200 రూపాయలకు పడిపోయింద’ని సీఎం వివరించారు. చిత్తూరు డైయిరీని మూసేయించిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. ప్రైవేటు డైయిరీలు అనుసరించిన అనైతిక చర్యల వల్ల సహకార డైయిరీలు తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. అమూల్‌తో తమ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో పాల్ప ఉత్పత్తి దారుల సామాజిక, ఆర్థిక ఉన్నతి సాధ్యమవుతుందన్న నమ్మకాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. సూచనలు ఇస్తారనుకుంటే... ప్రతిపక్ష నాయకులు సూచనలు ఇస్తారనుకుంటే, నానా యాగీ చేసి సభ నుంచి వెళ్లిపోయారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఏపీ-అమూల్ భాగస్వామ్యంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ వైఖరిని తప్పుబట్టారు. ప్రభుత్వ డైయిరీలను ప్రణాళిక ప్రకారం చంద్రబాబు నిర్వీర్యం చేశారని ఆరోపించారు. హెరిటేజ్ డెయిరీతో వేల కోట్ల రూపాయలు సంపాదించారని తెలిపారు. రాష్ట్రంలో సంవత్సరానికి 76,650 కోట్ల రూపాయల పాల వ్యాపారం జరుగుతోందన్నారు. డైరీకి సంబంధించి 6 శాతం జీడీపీలో భాగంగా ఉందని వెల్లడించారు. ప్రైవేటు డైయిరీలకు లీటర్ పాలపై 35 రూపాయల వరకు లాభం వస్తోందని తెలిపారు. 27 లక్షల మంది మహిళలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం: సీఎం జగన్ అమూల్‌తో ఒప్పందంతో మహిళలకు మేలు జరుగుతుందని, పాల రైతులకు అదనంగా ఆదాయం వస్తుందని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... అమూల్‌పై చర్చ సందర్భంగా చంద్రబాబు సభలో ఉంటారని తాము ఆశించామని, ఆయన మాత్రం స్వప్రయోజనాలు చూసుకున్నారని అన్నారు. స్పీకర్ పోడియం వద్దకు సభ్యులను పంపి గందరగోళం సృష్టిస్తున్నారని, సభ నుంచి సస్పెండ్ చేయించుకుని ఎల్లోమీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని ఆరోపించారు. ఎల్లో మీడియాలో తమ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. జులై 8న రూ.2,250 నుంచి రూ.2500లకు పింఛన్ పెంచుతామని హామీయిచ్చారు. 2023 జులై 8న రూ.2,750 నుంచి రూ.3వేలకు పింఛన్ పెంచుతామని ప్రకటించారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు మరోసారి సస్పెన్షన్‌కు గురయ్యారు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం వద్దకు దూసుకొచ్చిన టీడీపీ సభ్యులను స్పీకర్ సభ నుంచి బయటకు పంపించారు. నిమ్మల రామానాయుడు, బుచ్చయ్యచౌదరి, జోగేశ్వరరావు, సత్యప్రసాద్, అశోక్, రామరాజులను సస్పెండ్ చేశారు. వీరితో పాటు చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అమూల్‌పై చర్చ జరుగుతుండగా చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లిపోవడం గమనార్హం. బీఏసీలో ఎందుకు పెట్టలేదు: బొత్స శాసనమండలిలో విపక్షాల తీరును మంత్రి బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. అమరావతిపై చర్చించాలని అనుకున్నప్పుడు బీఏసీలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బీఏసీలోని ప్రతీ అంశంపై చర్చించడానికిసిద్దంగా ఉన్నామని ప్రకటించారు. పబ్లిసిటీ కోసం టీడీపీ అమరావతి అంటోందని, అమరావతి గురించి చర్చించడానికి తమకు భయం లేదన్నారు. ‘టీడీపీకి రాజకీయ లబ్దికావాలి. సమస్య పరిష్కారం కాదు. ఏ విషయంపైన అయినా చర్చించడానికి సిద్దంగా ఉన్నామ’ని మంత్రి తెలిపారు. టీడీపీ వాయిదా తీర్మానం తిరస్కరణ శాసనమండలి సమావేశాలు ఐదో రోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. రాజధానిగా అమరావతి కొనసాగాలని టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ షరీఫ్ తిరస్కరించారు. అమరావతిపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ సభను స్తంభింపజేశారు. కీలకమైన అంశాలపై చర్చ జరగాల్సి ఉందని చైర్మన్ వివరించినా వినిపించుకోలేదు. దీంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. టీడీపీ సభ్యుల గందరగోళం సభ ప్రారంభమైనప్పటి నుంచే ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. గట్టిగా నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించారు. ముఖ్యమైన బిల్లులు ఉన్నాయని, సహకరించాలని స్పీకర్ కోరినా టీడీపీ సభ్యులు వినలేదు. విపక్ష సభ్యుల గందరగోళం నడుమ పలు కీలక బిల్లులను సభ ఆమోదించింది. ప్రతిపక్ష సభ్యుల తీరును అధికార పక్షం తప్పుబట్టింది. టీడీపీ ఎమ్మెల్యేల నినాదాల నేపథ్యంలో 15 నిమిషాల పాటు సభను స్పీకర్ వాయిదా వేశారు. స్పీకర్ స్థానాన్ని అవమానిస్తున్న టీడీపీ విలువైన సమయాన్ని ప్రతి రోజు వృధా చేస్తున్నారని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. స్పీకర్ స్థానాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు చెప్పిన ప్రతి అంశాన్ని చర్చిస్తున్నా ఈవిధంగా సభా కార్యకలాపాలను అడ్డుకోవడం తగదన్నారు. కేవలం బురద చల్లాలనే ప్రయత్నంతోనే ఏదోరకంగా సభను ఆటంకపరచాలని టీడీపీ సభ్యులు చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ఐదో రోజు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. పాడిపరిశ్రమ అభివృద్ధి - అమూల్‌తో భాగస్వామ్యంపై నేడు అసెంబ్లీలో చర్చించనున్నారు. కరోనా నివారణ, ఆస్పత్రుల్లో నాడు-నేడుపై కూడా శాసనసభలో చర్చ జరుగుతుంది. నేడు శాసన మండలిలో ఐదు బిల్లులపై చర్చ జరగనుంది. పోలవరం, టిడ్కో, స్కూళ్లల్లో నాడు-నేడుపై శాసనమండలిలో చర్చించనున్నారు. -
ఏపీ అసెంబ్లీ: టీడీపీ సభ్యుల సస్పెన్షన్
సీఎం జగన్‌పై జనసేన ఎమ్మెల్యే ప్రశంసలు పేదల పెన్షన్ల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మాసినక పరిస్థితి సరిగా లేదని విమర్శించారు. పెన్షన్ల గురించి మాట్లాడే హక్కు వైఎస్సార్‌కు, ఆయన తనయుడు వైఎస్ జగన్‌కే ఉందన్నారు. ‘జగన్‌లాంటి నాయకుడు ఉండటం మన అదృష్టం. పేదల ఇంటి కల సాకారం చేసింది అప్పట్లో వైఎస్ఆర్.. ఇప్పుడు జగనే. సీఎం జగన్ లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. సచివాలయం ద్వారా ప్రతి గ్రామంలోనూ 30 నుంచి 40 మంది వలంటీర్లను నియమించారు. వలంటీర్ వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమ ఆలోచన అని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇళ్ల కోసం పేదలు ఇంతకుముందు ఎమ్మెల్యేల ఇంటి ముందు బారులు తీరేవారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే పేదల కోసం సీఎం జగన్ లక్షల ఇళ్లు ఇస్తున్నార’ని రాపాక వరప్రసాద్ అన్నారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ నాలుగోరోజు టీడీపీ సభ్యులు శాసనసభలో గందరగోళం సృష్టించారు. ఎమ్మెల్యే పి.రాజన్నదొర మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు. ఎంత నచ్చజెప్పినా వినకుండా నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలింగించారు. దీంతో వెలగపూడి రామకృష్ణబాబు, వీరాంజనేయులు, అచ్చెన్నాయుడు, మంతెన రామరాజు, జోగేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌లను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులతో పాటు మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. రామానాయుడిపై సీఎం జగన్ ఆగ్రహం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూరక్వంగా సభను తప్పుదారి పటిస్తున్నారని, పదే పదే అబద్దాలు చెప్పేవారికి మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని స్పీకర్‌కు విజ్ఞప్తి. రామానాయుడికి సభలో మాట్లాడే అర్హత లేదని, ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాస్తవాల ఆధారంగా రామానాయుడిపై చర్య తీసుకుంటామని స్పీకర్ సభలో ప్రకటించారు. సభలో వాస్తవాలు చెప్పాలని సభ్యులకు సూచించారు. రికార్డ్ నుంచి రామానాయుడు వాఖ్యలు తొలగించాలని స్పీకర్ ఆదేశించారు. చంద్రబాబు ఫేక్ ప్రతిపక్షనేత: కొడాలి నాని పారిపోయేవాళ్లు ఎవరో ప్రజలందరికి తెలుసునని, చంద్రగిరి వదిలి కుప్పం పారిపోయింది చంద్రబాబు కాదా? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ‘ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయారు.. కరోనా రాగానే కాల్వగట్టు నుంచి హైదరాబాద్‌కు పారిపోయార’ని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఫేక్ ప్రతిపక్షనేత, టీడీపీ ఫేక్ పార్టీ అని ధ్వజమెత్తారు. పొత్తు లేకుండా చంద్రబాబు పోటీ చేయలేరని ధ్వజమెత్తారు. పేదల అభివృద్ధే లక్ష్యంగా పాలన: ధర్మాన పేదల అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, ఏడాదిన్నరలో సంక్షేమ పథకాల ద్వారా రూ.67వేల కోట్లు అందించామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ పథకాలపై సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన సాగుతోందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ... ఒక్క కుటుంబానికి కూడా కన్నీళ్లు లేకుండా సంక్షేమం అందించారని ప్రశంసించారు. ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా సంక్షేమ పథకాలు ఆపలేదని, లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పడే వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. ఏ పథకానికి ఎవరు అర్హులో గుర్తించడమే పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. భూ హక్కుల యాజమాన్య బిల్లుకు ఆమోదం భూ యజమానులకు శాశ్వత హక్కులు కల్పించడమే లక్ష్యంగా ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ప్రవేశపెట్టినట్టు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ బిల్లుతో భూ వివాదాలకు సత్వర పరిష్కారం లభిస్తుందని చెప్పారు. రెవెన్యూ చట్టాలను సంస్కరించి తయారు చేసిన ఈ బిల్లుతో భూ వివాదాలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, సామినేని ఉదయభాను అభిప్రాయపడ్డారు. చర్చ తర్వాత ఏపీ భూ హక్కుల యాజమాన్య బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టిన ఏపీ మున్సిపల్ లా సెకండ్ అమెండ్మెంట్ బిల్లుపై చర్చించిన తర్వాత సభ ఆమోదం తెలిపింది. టీడీపీ సభ్యుల గందరగోళం దిశా చట్టం సవరణ బిల్లు ఆమోదం సందర్భంగా టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. తమకు మాట్లాడే ఇవ్వాలని పట్టుబడుతూ సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు. ఎవరెవరు మాట్లాడతారో ముందుగా తన లిస్టు పంపించకుండా ఇలా మధ్యలో అడగడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని స్పీకర్ వివరణయిచ్చారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేశ్.. టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. టీడీపీ సభ్యుల నినాదాల నడుమ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ల్యాండ్ టైట్లింగ్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. కాసేపు సభకు అడ్డం పడి సభ నుంచి టీడీపీ సభ్యులు బయటకు వెళ్లిపోయారు. దిశా చట్టానికి 4 జాతీయ అవార్డులు: సుచరిత గతంలో చేసిన దిశా చట్టానికి సవరణలు చేసి తాజాగా శాసనసభలో పెట్టారు. సవరణ బిల్లుపై హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులపై జరిగే దాడుల నివారణకు దిశా చట్టాన్ని తెచ్చినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 18 దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, విచారణ వేగవంతం కోసం డీఎస్పీస్థాయి అధికారిని నియమించినట్టు చెప్పారు. తిరుపతి, మంగళగిరి, విశాఖలో ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశామన్నారు. దిశా చట్టానికి జాతీయస్థాయిలో 4 అవార్డులు వచ్చాయన్నారు. దిశా చట్టంతో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని విశ్వాసం చేశారు. దిశా చట్టం వచ్చాక 3 కేసుల్లో ఉరిశిక్షలు పడ్డాయని వెల్లడించారు. దిశ యాప్‌ను లక్షలాది మంది డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. మంత్రి ప్రసంగం తర్వాత దిశా చట్టసవరణ బిల్లును సభ ఆమోందించింది. ఎలక్ట్రిసిటీ డ్యూటి బిల్లు ఆమోదం సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఏపీ విద్యుత్ సుంకం సవరణ(ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటి అమెంట్‌మెంట్) బిల్లుపై చర్చకు స్పీకర్ తమ్మినేని సీతారాం అంగీకరించారు. దీంతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చను ప్రారంభించారు. మంత్రి ప్రసంగం తర్వాత బిల్లు సభ ఆమోదం పొందింది. తర్వాత దిశా చట్టంపై చర్చ ప్రారంభమైంది. నగదు బదిలీ, కరోనా కట్టడిపై శాసన సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. కాగా, మీడియా, బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై దాడులు అరికట్టాలంటూ చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ సంక్షేమ పథకాలపై శాసన సభలో చర్చించనున్నారు. శాసన మండలిలో నేడు 9 బిల్లులపై చర్చ జరగనుంది. పోలవరం, ఉద్యోగుల సంక్షేమం, శాంతిభద్రతలపై శాసన మండలి చర్చించనుంది. -
ఏకకాలంలో శీతాకాల, బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ఈసారి ఒకేసారి జరిపే సూచనలు కనిపిస్తున్నాయి. కోవిడ్–19 కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రెండింటిని వేర్వేరుగా కాకుండా ఒకే విడతలో నిర్వహించాలని కేంద్రం యోచిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ, దీనిపై ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని పేర్కొన్నాయి. సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఏటా నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతాయి. బడ్జెట్ సెషన్స్ కూడా జనవరి చివరి వారంలో మొదలవుతాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఏడాదికి మూడు పర్యాయాలు పార్లమెంట్ సమావేశాలు జరపడం సంప్రదాయమే తప్ప, తప్పనిసరి కాదని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య తెలిపారు. రెండు సమావేశాల మధ్య గడువు ఆరు నెలలు మించరాదని మాత్రమే రాజ్యాంగం చెబుతోందన్నారు. శీతాకాల, బడ్జెట్ సమావేశాలను కలిపి నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు కూడా కోవిడ్ మహమ్మారి కారణంగా ముందుగానే ముగియడం తెలిసిందే. అదేవిధంగా, కోవిడ్ సమయంలో మునుపెన్నడూ లేని విధంగా చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలతో వర్షాకాల సమావేశాలు జరిగాయి. కోవిడ్–19 నిబంధనలను పాటిస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ పలువురు సభ్యులు, సిబ్బంది కోవిడ్ బారిన పడటంతో సెప్టె్టంబర్ 14వ తేదీన మొదలైన ఈ సమావేశాలను ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే 8 రోజులు ముందుగానే ముగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీల ఖరారు
-
ఐదు రోజులే శీతాకాల సమావేశాలు
-
27 నుంచి తెలంగాణ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, మండలి శీతాకాల సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఈ నెల 27 నుంచి సమావేశాలు నిర్వహించాలని అసెంబ్లీ కార్యదర్శికి ప్రతిపాదనలు పంపింది. 26న బీఏసీ సమావేశం నిర్వహించి, ఎన్ని రోజులు సభ జరపాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో వ్యూహ కమిటీ భేటీ అయింది. నెలరోజుల పాటు సమావేశాలు నిర్వహించేలా ప్రతిపాదించాలని.. 15 నుంచి 20 రోజుల పాటు పనిదినాలు ఉండేలా షెడ్యూల్ ఖరారు చేసేలా కోరాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రభుత్వం తరఫున ఈ ప్రతిపాదనను అసెంబ్లీ కార్యదర్శికి పంపించాలని సూచించారు. శాసనసభ ఎన్ని రోజులు జరిగితే.. అన్ని రోజులు మండలి కూడా జరపాలని అన్నారు. శాసనసభలో చర్చ జరిగిన ప్రతి అంశంపైనా మండలిలోనూ చర్చ జరగాలన్నారు. అన్ని అంశాలపై చర్చ ప్రజలకు సంబంధించిన అన్ని విషయాలపై కూలంకషంగా చర్చ జరగాలని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలి. సభ్యులు లేవనెత్తే ప్రతి అంశంపై జవాబు చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధం. ప్రజలకు అన్ని విషయాలను అసెంబ్లీ ద్వారా వివరించాలి. దీనికోసం మంత్రులు సిద్ధం కావాలి. ప్రతిపక్ష సభ్యులు ఏ అంశంపై ఏ ప్రశ్నలు వేసినా ప్రభుత్వం నుంచి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల సంక్షేమం కోసం దేశంలో మరెక్కడా అమలు చేయని ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. వాటి గురించి వివరించాలి. సభ్యుల సందేహాలను నివృత్తి చేయాలి. విలువైన సూచనలు స్వీకరించాలి. అంతిమంగా అసెంబ్లీ నుంచి ప్రజలకు కావాల్సిన సమాచారం పోవాలి. ఎన్ని రోజులు సభ నిర్వహించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నెల రోజుల పాటు సభ నిర్వహించాలని అధికార పక్షం నుంచి కోరదాం. ప్రతిపక్ష సభ్యులు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభ నిర్వహించడానికి అభ్యంతరం లేదు. సభ హుందాగా నడవాలి. ప్రతీ అంశంపై చర్చ జరగాలి..’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక మాతృభాష పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైనా అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలని ఆకాంక్షించారు. ఇంటర్ వరకు కచ్చితంగా తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండాలన్న నిబంధనతో మాతృభాష పరిరక్షణ జరగడంతో పాటు అనేక మంది తెలుగు పండిట్లకు ఉద్యోగావకాశం కూడా లభిస్తుందన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించనున్నట్లు వెల్లడించారు. స్పష్టమైన తీర్మానాలు చేయాలి ప్రస్తుత సమావేశాలు చాలా ముఖ్యమై నవిగా భావించాలని, ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై మంత్రులు స్పష్టమైన ప్రకటనలు చేయాలని కేసీఆర్ సూచించారు. వివిధ అంశాలపై సభ్యులందరూ మాట్లాడేలా కూలంకషంగా చర్చ జరగాలని, కొన్ని బిల్లు లను ఆమోదించుకోవాలని చెప్పారు. ఇక అసెంబ్లీలో గతంలో అనేక అంశాలపై తీర్మా నాలు చేసి కేంద్రానికి పంపినా.. అక్కడి నుంచి స్పందన రాలేదన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్, హైకోర్టు విభజన, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్ల పెంపు, సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్ను మినహాయింపు, ఉపాధి హామీ పనులను వ్యవసాయంతో అనుసంధానం చేయడం, తెలంగాణలో ఎయిమ్స్ స్థాపన తదితర అంశాలపై కేంద్రాన్ని కోరుతూ మరోసారి అసెంబ్లీ గట్టిగా కోరాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ఈ మేరకు మరోసారి తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని, ఒత్తిడి పెంచాలని పేర్కొన్నారు. కాగా సమావేశాలకు సంబం ధించి ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. -
ఐదు రోజులే శీతాకాల సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు నవంబర్ 8 నుంచి ప్రారంభం కానున్నాయి. 13వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఈ మేరకు అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి మంగళవారం సమావేశాల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆ ప్రకారం ఐదు రోజులు మాత్రమే ఈ సమావేశాలు జరగనున్నాయి. నిబంధనల ప్రకారం వర్షాకాల సమావేశాలను నిర్వహించకుండా ఉద్దేశపూర్వకంగా వాటిని వాయిదా వేసి ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర జరిగే సమయంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలను ప్రకటించటం గమనార్హం. -
జానా వర్సెస్ కేటీఆర్.. అసెంబ్లీ హాట్ హాట్
-
జానా వర్సెస్ కేటీఆర్.. అసెంబ్లీ హాట్ హాట్
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నాలుగోరోజు కాస్త వాడివేడిగా చర్చ జరిగింది. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడే సందర్భంలో 'నా తెలంగాణ' అనడంతో మాజీమంత్రి, ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. 'నా తెలంగాణ కాదు.. మన తెలంగాణ అనాలి' అంటూ హితబోధ చేశారు. అయితే, జానారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఎదురుదాడి మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నా తెలంగాణ అని భావించలేదని, 1956లో ఇష్టంలేని పెళ్లి చేసి తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఏమీ తెలంగాణ ఇవ్వలేదని.. పోరాడితేనే అది వచ్చిందని చెప్పారు. అయితే.. ఆంధ్రా నేతల మూకుమ్మడి రాజీనామాలతో కేటీఆర్ తన ఇంటికి వచ్చారని, తెలంగాణ సాధనకు ఏం చేద్దామని అడిగారని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని సోనియాగాంధీకి నచ్చజెప్పింది తామేనని జానారెడ్డి అన్నారు. అప్పుడు ఇక్కడ, అక్కడ కూడా తామే అధికారంలో ఉన్నామని, అందువల్ల తలుచుకుంటే ఉద్యమాన్ని అణిచేసేవాళ్లమని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. దాంతో జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జానారెడ్డి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
పార్లమెంటు ఉభయసభలు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: లోక్ సభ, రాజ్యసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇరు సభల స్పీకర్లు సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది శీతాకాల సమావేశాలు నిస్సారంగా సాగాయి. ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ సభలు ముగిసిపోయాయి. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్ సభకు హాజరయ్యారు. ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ బిల్లు-2016ను లోక్ సభ ఆమోదించింది. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై ప్రతిపక్షాలు, అధికారపక్షం ఒకరిపై ఒకరు ఆరోపణల మినహా ఇరు సభల్లో ఎలాంటి చర్చా జరగలేదు. మొత్తం 30 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ఒక్క రోజు కూడా సభ సజావుగా సాగలేదు. -
చర్చలు లేకుండానే నిరవధిక వాయిదా
ఎలాంటి చర్చలు లేకుండానే రాజ్యసభ శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ప్రధాని మోదీ సభకు వచ్చిన కొద్ది సేపటికీ సమావేశాలు నిరవధిక వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ హమ్మీద్ అన్సారీ ప్రకటించారు. నవంబర్ 15 నుంచి ఈ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైనప్పటి నుంచి పెద్దనోట్ల రద్దు, అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంతో పాటు ఇతర అంశాలు రాజ్యసభను కుదిపేశాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం, పట్టువిడుపులు విడవకపోవటంతో ఒక్క రోజు కూడా ఎలాంటి చర్చలేకుండానే రాజ్యసభ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. కేవలం రెండు బిల్లులను మాత్రమే ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించారు. ఒకటి పెద్ద నోట్ల రద్దు తర్వాత తేలే నల్లధనంపై కొరడా ఝళిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన సవరణలతో తీసుకొచ్చిన ఆదాయపు పన్ను చట్టం. ఆ బిల్లు లోక్‌సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. రెండోది గత యూపీఏ ప్రభుత్వం చివరి రోజుల్లో తీసుకొచ్చిన దివ్యాంగుల చట్ట సవరణ బిల్లు. 119 సవరణలతో తీసుకొచ్చిన ఈ బిల్లును ఎట్టకేలకు రాజ్యసభ ఆమోదించింది. అసమ్మతి, అంతరాయం, ఆందోళనల మధ్య వ్యత్యాసాన్ని అన్ని సెక్షన్ల వారు తమను తాము పరిశీలించుకోవాల్సినవసరం ఉందని వైస్ ప్రెసిడెంట్ హమ్మీద్ అన్సారీ అన్నారు. -
నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు..
-
సభాసమరం!
► నేటి నుంచే అసెంబ్లీ, మండలి శీతాకాల సమావేశాలు ► ఉదయం 10 గంటలకు ప్రారంభం.. ► ప్రభుత్వంపై ముప్పేట దాడికి సిద్ధమైన ప్రతిపక్షాలు ► ‘డబుల్’ ఇళ్లు, రుణమాఫీ, రైతు సమస్యలు, ప్రాజెక్టులు, భూసేకరణపై నిలదీసేందుకు సిద్ధం ► దీటుగా జవాబిస్తామంటున్న అధికార పక్షం.. ► ఎదురుదాడితో తిప్పికొట్టేందుకు వ్యూహాలు ► అభివృద్ధి, సంక్షేమాన్ని గట్టిగా చెప్పుకోవాలని నిర్ణయం.. సుమారు 20 అంశాలపై చర్చ! ► తొలిరోజు అసెంబ్లీలో నోట్ల రద్దుపై, మండలిలో విద్యుత్ పరిస్థితిపై చర్చ హైదరాబాద్: రాష్ట్రంలో సభా సమరానికి రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు చలికాలంలోనూ వేడి పుట్టించనున్నాయి. రెండున్నరేళ్ల పదవీకాలంలో ఏం చేశారంటూ అధికార పక్షంపై ముప్పేట దాడి చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమైపోతే.. ఎదురుదాడితో దీటుగా సమాధానం ఇచ్చేందుకు పాలక పక్షం సన్నద్ధమైపోయింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని గురువారం జరిగిన బీఏసీ భేటీలో నిర్ణయించారు. సెలవు రోజులు పోగా 12 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. అవసరమైతే మరిన్ని రోజులు పొడిగించేందుకు సిద్ధమని ప్రభుత్వం వెల్లడించింది. ఈ సమావేశాల్లో ప్రధానంగా 20 దాకా అంశాలు చర్చకు రావచ్చని అంచనా వేస్తున్నారు. తొలిరోజున అసెంబ్లీలో ‘నోట్ల రద్దు’ అంశంపై, మండలిలో రాష్ట్ర విద్యుత్ పరిస్థితిపై చర్చలు జరుగనున్నాయి. అయితే ఈ రెండున్నరేళ్లలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాల గురించి చర్చించి, రెండున్నరేళ్ల ప్రోగ్రెస్ రిపోర్టును అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజల ఎదుట పెట్టాలని అధికార టీఆర్ఎస్ భావిస్తోంది. మొత్తంగా ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అటు అధికార పక్షంతో పాటు ఇటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, టీడీపీలు కూడా తీవ్రంగా కసరత్తు చేశాయి. హామీలపై నిలదీతకు విపక్షాలు సన్నద్ధం ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో దేనిని కూడా పూర్తి చేయలేదన్న వాదనను విపక్షాలు లేవనెత్తనున్నాయి. ప్రధానంగా వ్యవసాయరంగ సమస్యలను ప్రస్తావించి చర్చకు పెట్టనున్నారు. రుణమాఫీ, పంట రుణాలు పొందడంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇన్పుట్ సబ్సిడీ అందకపోవడం, కరువు వంటివి చర్చకు రానున్నాయి. ఇక సాగునీటి ప్రాజెక్టుల విషయంలో భారీగా అవినీతి చోటు చేసుకుందంటూ ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు వ్యూహం రచిస్తున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లోనూ అక్రమాల అంశాన్ని లేవనెత్తాలని భావిస్తున్నాయి. ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ విషయంలో ప్రజలను పెట్టిన ఇబ్బందులను ఏకరువు పెట్టనున్నారు. భూసేకరణకు సంబంధించి రాష్ట్ర పరిధిలోని అంశాలకు సవరణలు చేసి ఈ సమావేశాల్లోనే భూసేకరణ బిల్లును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న నేపథ్యంలో... ఈ అంశం సభను వేడెక్కించే అవకాశముంది. ఇక నోట్ల రద్దు తర్వాత కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన సీఎం కేసీఆర్... ఢిల్లీ పర్యటన తర్వాత ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నారని విపక్షాలు ఇప్పటికే ఆరోపించాయి. కాంగ్రెస్ ఈ అంశంపై సమావేశాల తొలిరోజే దూకుడు ప్రదర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ‘డబుల్’ ట్రబుల్ టీఆర్ఎస్ ఎన్నికల హామీల్లో ప్రధానమైన రెండు పడక గదుల ఇళ్ల పథకంపై విపక్షాలు గొంతెత్తనున్నాయి. సీఎం అధికారిక నివాసం కోసం ఏకంగా రూ.40 కోట్లకుపైగా ఖర్చుపెట్టారని మండిపడుతున్న ప్రతిపక్షాలు.. ‘డబుల్’ ఇళ్ల ప్రగతిపై చర్చకు పట్టుబట్టనున్నాయి. అదే మాదిరిగా లక్షలాది మంది విద్యార్థుల చదువుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి సంఘాలు సైతం ఆందోళనకు దిగుతున్నాయి. సభలో ఈ అంశం దుమారం రేపే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఇంటికో ఉద్యోగం హామీ, సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు, ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల అమలు తదితర అంశాలపైనా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. విశ్వనగరం చేసేదెప్పుడు!? గ్రేటర్ ఎన్నికల ముందు హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని ఊదరగొట్టిన అధికార పక్షం.. తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయాయని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మెట్రో రైలు ఆలస్యంపై, నగర రోడ్ల దుస్థితిపై నిలదీయనున్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతల అంశాన్నీ లేవనెత్తనున్నాయి. ఎదురు దాడే వ్యూహం! ప్రతిపక్షాలు సంధించే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సిద్ధమైపోయిన అధికార టీఆర్ఎస్... మరోవైపు ఎదురు దాడి వ్యూహానికీ పదును పెడుతోంది. టీడీపీ, కాంగ్రెస్‌ల పాలనా హయాంలో జరిగిన అభివృద్ధి ఎంత, అవినీతి అంశాలను ఎత్తి చూపనుంది. మరోవైపు కేవలం రెండున్నరేళ్లలోనే తాము సాధించిన విజయాలను వివరించడం ద్వారా ప్రతిపక్షాలకు దీటైన సమాధానం ఇవ్వాలని నిర్ణయించింది. విపక్షాలు ఏ అంశాలను లేవనెత్తే అవకాశం ఉందో ముందే ఓ అంచనాకు వచ్చిన టీఆర్ఎస్... ఆ మేరకు తమ మంత్రులు, ఇతర ముఖ్య సభ్యులను సిద్ధం చేసింది. మొత్తంగా అధికార, విపక్షాలు శీతాకాల సమావేశాలను వేడెక్కించేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. -
‘జీఎస్టీ’ కోసం ముందుగానే శీతాకాల సమావేశాలు
నవంబర్ తొలి వారంలో జరపాలని కేంద్రం యోచన న్యూఢిల్లీ: కీలకమైన వస్తు సేవల బిల్లుకు సంబంధించిన కార్యక్రమాలన్నీ వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 1నుంచి అమలుచేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా సీజీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లులను ఆమోదించేందుకు పార్లమెంటు శీతాకాల సమావేశాలను కాస్త ముందుగానే నిర్వహించాలనుకుంటోంది. సాధారణంగా నవంబర్ మూడు, నాలుగో వారాల్లో శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే ఈసారి మొదటి వారంలోనే (దీపావళి అయిపోయిన తర్వాత) మొదలుపెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం పార్లమెంటు వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. వర్షాకాల సమావేశాల్లాగే శీతాకాల సమావేశాలనూ విజయవంతం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. అనకున్న సమయానికి సీజీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లులకు ఆమోదం పొందితే.. ఆర్థికశాఖ జీఎస్టీని అంత పకడ్బందీగా అమలు చేసేందుకు అవకాశం దొరుకుతుంది. వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన జీఎస్టీ బిల్లుకు 50శాతానికి పైగా రాష్ట్రాలు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నెల మొదట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బిల్లుకు అంగీకారాన్ని తెలపగా.. కేంద్రం వెంటనే జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కాగా, జీఎస్టీతోపాటు తయారీరంగాన్ని కాపాడుకునేందుకు ఒక్కో ఉత్పత్తికి ఒక్కో పన్ను విధానం (శ్లాబులు) విధించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. అన్ని రంగాలకూ ఒకే రకమైన రేటుతో పన్నులు విధించలేమన్నారు. చిన్న సంస్థలకు కూడా స్థిరమైన జీఎస్టీని అమలు చేయటం ద్వారా అవి మనుగడ సాధించలేవని.. అందువల్ల వీటికి తక్కువ పన్ను విధిస్తామన్నారు. బికనీర్ పాపడ్‌పై కేవలం ఒకశాతం పన్ను మాత్రమే అమల్లో ఉందని మంత్రి తెలిపారు. -
5న మరోసారి బుద్ధప్రసాద్ కమిటీ భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కమిటీ వచ్చే నెల 5న మరోసారి సమావేశంకానుంది. అదే రోజున నివేదిక తయారు చేసే యోచనలో కమిటీ ఉన్నట్టు సమాచారం. బుధవారం సమావేశమైన బుద్ధప్రసాద్ కమిటీ.. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్, అసెంబ్లీ వీడియో లీకేజీపై చర్చించింది. కమిటీలోని అధికార విపక్ష సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా సభలో చోటు చేసుకున్న పరిణామాలు, వీడియోల లీకేజీ, తదితర అంశాలను విచారించేందుకు కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. -
శాసనసభా వ్యవహారాలపై బుద్ధప్రసాద్ కమిటీ
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా డిసెంబర్ 22వ తేదీన సభలో సభ్యుల ప్రస్తావించిన పలు అంశాలపై ఓ కమిటీని నియమించారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. టీడీపీ సభ్యుడు శ్రవణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ సభ్యుడు జి.శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రధానంగా ఈ కింది అంశాలపై పరిశీలన జరుపుతుంది సభా కార్యకలాపాలకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులు సోషల్ మీడియాలోకి ఎలా వచ్చాయో విచారిస్తుంది. అసెంబ్లీ ఐదో, ఆరో సమావేశాల ఆడియో వీడియో టేపులను పరిశీలించి, సభలో సభ్యుల ప్రవర్తన, సభలోనే స్పీకర్ మీద వ్యాఖ్యలు తదితర అంశాలను పరిశీలిస్తుంది ఇకమీదట సభా నిర్వహణ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన పరిష్కార మార్గాలను సూచిస్తుంది కమిటీ తొలిసారి సమావేశమైన తర్వాత 20 రోజుల్లోగా తన పరిశీలనలు, సూచనలు, ప్రతిపాదనలను స్పీకర్‌కు సమర్పించాలి. కమిటీ గడువు కూడా తొలి సమావేశం జరిగినప్పటి నుంచి 20 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. -
'సెక్స్ రాకెట్' వల్లే బాబుకు డాక్టరేటా?'
-
కాల్‌మనీపై వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం
ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజు వాయిదా తీర్మానం ఇచ్చింది. రుణాల ముసుగులో మహిళలను లైంగికంగా లోబరుచుకోవడం, అత్యాచారాల రూపంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఈ తీర్మానాన్ని ఇచ్చారు. ఇదే అంశంపై అసెంబ్లీ రూల్స్ 344 కింద కూడా వైఎస్ఆర్సీపీ నోటీసులు ఇచ్చింది. గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలను మరిన్ని రోజులు పెంచాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. -
17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలను ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఈ నెల 17 నుంచి 22 వరకు ఆరు రోజులపాటు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ఈ సారి కూడా హైదరాబాద్‌లోనే జరగనున్నాయి. -
చెరిగిపోని మరకలు
-
సలీం వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం
-
26 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
-
10 వరకు అసెంబ్లీ
* బీఏసీ సమావేశంలో నిర్ణయం * 10 రోజుల పాటు వర్షాకాల సమావేశాలు * నేటి నుంచి సోమవారం దాకా సెలవులు * 29న రైతు ఆత్మహత్యలు, వ్యవసాయంపై చర్చ * ప్రశ్నోత్తరాల సమయం గంటన్నరకు పెంపు * ఆ తర్వాతే వాయిదా తీర్మానాలు * పార్టీ ఫిరాయింపులపై చర్చించాలన్న ఎర్రబెల్లి * దీనిపై గతంలో ఎన్నడూ చర్చించలేదని, ఈసారీ అంగీకరించబోమన్న మంత్రి హరీశ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 10వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సభను జరపాలని నిర్ణయించింది. మొత్తంగా పది రోజులపాటు సమావేశాలు జరుగుతాయి. గురువారం (24వ తేదీ) నుంచి 28 వరకు, అక్టోబర్ 2 నుంచి 4 వరకు సెలవులుగా ప్రకటించారు. అక్టోబర్ 5 నుంచి 10 వరకు వరుసగా ఆరు రోజుల పాటు సభ జరగనుంది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి మృతికి సభ సంతాపం తెలిపింది. నేతల సంతాప సందేశాల తర్వాత స్పీకర్ మధుసూదనాచారి సభను ఈనెల 29కి వాయిదా వేశారు. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశం జరిగింది. రైతు ఆత్మహత్యలపై అవసరమైతే రెండ్రోజులు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై బీఏసీ సుమారు గంటపాటు చర్చించింది. సమావేశంలో పాల్గొన్న సభ్యుల నుంచి అందిన సమాచారం మేరకు.. ప్రతిరోజూ నిర్వహించే ప్రశ్నోత్తరాల సమయాన్ని గంటన్నరకు పెంచాలని నిర్ణయించారు. వాయిదా తీర్మానాలను కూడా ప్రశ్నోత్తరాల సమయం తర్వాతే ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఇందుకు టీడీపీ అంగీకరించలేదు. 29వ తేదీన ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ రంగంపై చర్చిస్తారు. ఒకరోజు సమయం సరిపోకపోతే మరో రోజు కూడా చర్చకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇవే కాకుండా సాగునీటి ప్రాజెక్టులు, రీ డిజైనింగ్, మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు, పారిశ్రామిక పాలసీ, విద్యుత్, విషజ్వరాలు, వైద్యసేవలు, తదితర అంశాలపై సమావేశాల్లో చర్చించనున్నారు. వివిధ రంగాల్లో ప్రభుత్వం చేస్తున్న కృషిని సభా వేదికగా ప్రజలకు వివరించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. ఫిరాయింపులపై చర్చించలేం.. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ఫిరాయింపులపై చర్చకు ప్రభుత్వం అంగీకరించలేదు. బీఏసీ సమావేశంలో ఈ అంశాన్ని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి లేవనెత్తారు. అయితే ఫిరాయింపుల అంశాన్ని గతంలో ఎన్నడూ సభలో చర్చించలేదని, ఈసారి కూడా చర్చకు అంగీకరించమని మంత్రి హరీశ్‌రావు అన్నట్లు సమాచారం. ఇదే అభిప్రాయాన్ని సీఎల్పీ నేత జానారెడ్డి కూడా వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమకు ముందు వరుసలో రెండు సీట్లు కేటాయించాలని ఎర్రబెల్లి వాదనకు దిగగా.. బీఏసీ సమావేశం నిర్వహిస్తోంది సీట్ల కేటాయింపు కోసం కాదని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. సీట్ల కేటాయింపుపై స్పీకర్, శాసనసభ కార్యదర్శిని సంప్రదించాలని, ప్రతిపక్షాలు చెప్పినట్లు చేయడానికి ప్రభుత్వం లేదని సీఎం కేసీఆర్... ఎర్రబెల్లికి చురకేసినట్లు తెలిసింది. ఏవైనా డిమాండ్లు ఉంటే రాతపూర్వకంగా ఇవ్వాలని సూచించారు. తమపై మంత్రులు ఎదురు దాడి చేస్తున్నారని, ఒకేసారి ముగ్గురు ముగ్గురు సమాధానాలు ఇస్తున్నారని, మంత్రులను సీఎం కంట్రోల్ చేయాలని ఎర్రబెల్లి పేర్కొనగా.. ‘‘మీ వాళ్లు అయిదారుగురు లేసి మాట్లాడితే, మంత్రులు అలా సమాధానం ఇవ్వక ఏం చేస్తారు..’’ అని సీఎం అన్న ట్లు సమాచారం. సభలో చర్చ సక్రమంగా జరగాలని, సభ జరగకుండా గొడవ చేస్తే ప్రభుత్వం ఊరుకోద న్న అంశంపై సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. బీఏసీ భేటీలో సీఎం కేసీఆర్‌తోపాటు, స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు, మం త్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌తోపాటు సీఎల్పీ నేత జానారెడ్డి, చిన్నారెడ్డి(కాంగ్రెస్), ఎర్రబెల్లి దయాకర్‌రావు(టీడీపీ), అక్బరుద్దీన్ ఒవైసీ(ఎంఐఎం), లక్ష్మణ్(బీజేపీ), పాయం వెంకటేశ్వర్లు (వైఎస్సార్సీపీ), సున్నం రాజయ్య (సీపీఎం), రవీంద్ర కుమార్ (సీపీఐ) పాల్గొన్నారు. -
రైతన్న ఆక్రోశం వినపడదా?
ఎన్నికల ప్రచార సమయంలో రైతు రుణ మాఫీ గురించి గొప్ప గొప్ప ప్రకటనలు చేసి, వాటిని అరకొరగా అమలు చేసినందువల్ల కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ దుస్థితి దాపురించిందన్న సత్యాన్ని అంగీకరించాలి. ఈ విషయంలో తెలంగాణ కొంత మెరుగే అయినా, ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి లక్ష రూపాయలు రుణ మాఫీ కింద చెల్లించి ఉంటే బాగుండేది. ఈ శాసనసభ సమావేశాలు ముగిసిన నాటి నుంచి ఒక్క రైతు కూడా రాష్ర్టంలో ఆత్మహత్య చేసుకోకుండా ఉండేందుకు ఒక కార్యక్రమాన్ని అన్ని పార్టీలు కలసి చర్చించి రూపొందిస్తే బాగుండేది. ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోయే తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావే శాలలో ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి అధికారపక్షం అస్త్రాలు సిద్ధం చేసు కుంటున్నట్టు పత్రికలలో వార్తలొచ్చాయి. గతనెలలో ఆంధ్రప్రదేశ్ శాసన సభ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఐదురోజులు మాత్రమే జరిగిన ఆ రాష్ర్ట శాసనసభ సమావేశాలలో కూడా అధికార పక్షం అవతలి పక్షాన్ని మాట్లాడని వ్వకుండా, మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎదురుదాడినే ఎంచుకున్నది. దాడులు, ఎదురుదాడులకే శాసనసభలు పరిమితం అయి పోయి ప్రజా సమస్యలు చర్చకు రాకుండా, పరిష్కారాలకు నోచుకో కుండా నిరర్థకంగా తయారుకావడం ఇవాళ కొత్తేంకాదు. అసలు ప్రతి పక్షమే ఉండకూడదన్న ఒక పూర్తి అప్రజాస్వామిక, ప్రమాదకర ధోరణి కింది నుంచి పైదాకా రాజకీయాలలో చొరబడింది. ప్రజా సమస్యలను పట్టించుకునే నాథుడే లేని ఒక దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ దేశంలో నెలకొని ఉంది. కొంతకాలం క్రితం వరకూ రాష్ట్రాల శాసనసభలు ఎలా ఉన్నా పార్లమెంట్ సమావేశాలు పద్ధతి ప్రకారం జరుగుతూ ఉండేవి. ఇప్పుడు అక్కడ కూడా విపక్షం నోరు మూయించడానికి అధికారపక్షం ఎదురుదాడి అనే ఆయుధాన్ని ఎంచుకోడంతో జనం దృష్టిలో అవీ పలచనైపోయాయి. ప్రభుత్వం చేస్తున్న పనులలో మంచీచెడులను ఎత్తిచూపడం విపక్షాల పని. వాటిని సరిచేసుకోడం ప్రభుత్వ పక్షం బాధ్యత. తప్పులు జరుగుతున్నా యని మొత్తుకుంటూ ఉంటే, వినడానికి కూడా సహనం లేని అధికారపక్షాలు ప్రజాస్వామ్యానికి చేటు చేస్తాయి తప్ప, ప్రజాసమస్యల పరిష్కారానికి ఏమా త్రం ఉపకరించవు. ఎక్కడైనా ఆ దృశ్యాలే గత నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల నిర్వాకం చూశాం. రేపటి నుంచి తెలంగాణ సమావేశాలు కూడా ఇంచుమించు ఇదే పద్ధతిలో జరుగుతాయనడంలో సందేహం లేదు. అయితే ఒక్క తేడా ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక్కటే విపక్షం. అది ఎంత బలమైన విపక్షం అయినా, తోడు మరో విపక్షం ఏదీ సభలో లేక ఒంటరి పోరాటం చేయవలసి వస్తున్నది. తెలంగాణ సభలో పరిస్థితి వే రు. ఒకటి కంటే ఎక్కువ ప్రతిపక్షాలు ఉమ్మడిగా అధికార పక్షం మీద దాడికి సిద్ధమవుతున్నాయి. తెలంగాణ సభలో చర్చకు రావలసిన అంశాలు చాలానే ఉన్నా, ప్రధానంగా చర్చ జరగవలసింది- అడ్డూ ఆపూ లేకుండా జరిగిపోతున్న రైతుల ఆత్మహత్యల మీద. గాలికి కొట్టుకుపోయిన హామీ తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే ఇక అన్నదాతల ఆత్మహత్యలు ఉండబోవని ఉద్య మకాలంలో పదే పదే ప్రకటించిన తెలంగాణ రాష్ర్ట సమితి ఇవాళ అధికారం లోకి వచ్చాక ఆ విషయంలో ఇరుకున పడబోతున్నది. అందుకే ఎదురుదాడికి సిద్ధమవుతున్నది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడినా రైతుల ఆత్మహత్యలు ఆగ లేదు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండూ ఉమ్మడి రాష్ర్టంలో అధికారం చలాయించినవే. ఆ పార్టీలు అధికారంలో ఉన్న కాలంలో కూడా రైతుల ఆత్మహత్యలు జరిగిన మాట వాస్తవం. ‘మీ మీ ప్రభు త్వ హయాంలలో జరిగిన రైతుల ఆత్మహత్యల మాటేమిటి?’ అనే ఎదురు దాడికి ప్రస్తుత అధికారపక్షం సిద్ధంగా ఉందనే విషయం మంత్రులు చేస్తున్న ప్రకటనలను బట్టి అర్థమవుతూనే ఉంది. నిజానికి ఇప్పుడు తెలంగాణ లో ఏ సమస్య గురించి మాట్లాడబోయినా, ఇదంతా గతంలో దశాబ్దాల తరబడి అధికారంలో ఉండగా మీరు చేసిన నిర్వాకం ఫలితమేననీ, ఆంధ్రపాలకుల కారణంగానే ఈ దుస్థితి దాపురించిందనీ ఎదురుదాడికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. ఆకుపచ్చ తెలంగాణ నా స్వప్నం అన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హయాంలో, ఈ ఏడాదిన్నర కాలంలో కొన్ని వందల మంది రైతన్నలు ఆత్మ హత్యలు చేసుకున్నారన్నది వాస్తవం. ప్రణాళిక రూపొందించలేరా? నిజానికి ఈ శాసనసభ సమావేశాలు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను ఆపడానికి ఏం చెయ్యాలో చర్చిస్తే బాగుండేది. అవసరమను కుంటే మిగతా సభా కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి అన్ని రాజకీయ పార్టీలు ఈ ఆత్మ హత్యలను ఆపడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో చర్చించి, ఒక ప్రణా ళిక రూపొందిస్తేనన్నా అన్నదాతలలో ఆత్మ విశ్వాసం పెరగడానికి అవకాశం ఉంటుందేమో! కానీ అటువంటి ప్రయత్నం జరగదని మనకూ తెలుసు. కొంతకాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యల మీద చలించిపోయిన సభ్య సమాజం మన దేశ వ్యవసాయ విధానం, రైతుల కోసం చేయవలసిన కార్యక్రమాలను నిర్ణయించేందుకు పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభలూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఒక సమగ్ర విధానం రూపొందించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆ మార్గంలో వెళ్లేందుకు ఏలికలు ఆలోచించడమే లేదు. గతవారం తెలంగాణ రాష్ర్ట మంత్రి వర్గం సమావేశం జరిపి, ఆత్మహత్యలు చేసుకునే రైతుల కుటుంబాలకు ఆరు లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అందరూ హర్షించవలసిందే. అయితే ఈ నిర్ణయం జరిగిన తరువాత ఆత్మ హత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకే ఇది వర్తిస్తుందనడం న్యాయం కాదు. ఇప్పటికే ఈ ఏడాదిన్నర కాలంలో చనిపోయిన రైతు కుటుంబాల గతే మిటి మరి? నిజమే, ఖజానాకు భారమే కావచ్చు. కానీ ఆ మేరకు ఇతరత్రా జరగబోతున్న బోలెడు వృథా వ్యయాన్ని నివారించగలిగితే ఇది సాధ్యమే. ఆ పని చేయవలసింది పోయి, ఒక మంత్రిగారు ఇంకొంచెం ముందుకు పోయి, మరో నాలుగేళ్ల తరువాత జరిగే రైతుల ఆత్మహత్యలకు మాత్రమే మా ప్రభుత్వానిది బాధ్యత, ఇప్పుడు జరిగేవన్నీ పాత ప్రభుత్వాల ఖాతాలో వెయ్యాలి అన్నారు. ఓ పక్క మనకు తిండి పెట్టే రైతు బలవంతంగా ప్రాణం తీసుకుంటుంటే, మనం దాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలా అని ఆలోచిస్తున్నాం. ఆ మంత్రి తక్షణం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కావడా నికి పూర్తిగా అర్హుడు కదా! ఇటువంటి పిచ్చి ప్రకటనలు గత ప్రభు త్వాలలో మంత్రులు, కొందరు ముఖ్యమంత్రులు కూడా చేశారు. ఒక మంత్రి మానసిక వ్యాధుల కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుం టున్నారంటే, ఒక ముఖ్యమంత్రి స్వయంగా, ప్రభుత్వం చెల్లించే పరి హారం కోసం వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రంటూ వాచాల త్వాన్ని కూడా ప్రదర్శించారు. అసలు ఎన్నికల ప్రచార సమ యంలో రైతు రుణ మాఫీ గురించి గొప్ప గొప్ప ప్రకటనలు చేసి, వాటిని అర కొరగా అమలు చేసినందువల్ల కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ దుస్థితి దాపురించిందన్న సత్యాన్ని ప్రభుత్వాలు అంగీకరించాలి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంత మెరుగే అయినా, ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి లక్ష రూపాయలు రుణ మాఫీ కింద చెల్లించి ఉంటే మరింత బాగుండేది. అసలు ఇదంతా కాదు. ముందే చెప్పుకున్నట్టు ఈ శాసనసభ సమావేశాలు ముగిసిన నాటి నుంచి ఒక్క రైతు కూడా రాష్ర్టంలో అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకోకుండా ఉండేందుకు ఒక కార్యక్రమాన్ని అన్ని పార్టీలు కలసి చర్చించి రూపొందిస్తే బాగుండేది. కానీ అది సాధ్యమేనా, రాజకీ యంగా ఎవరికి వారు తమదే పైచేయి అనిపించుకునే ప్రయత్నంలో పడి దాడి, ఎదురుదాడులతోనే కాలం గడపడం ఖాయం. ఆత్మహత్యలే ప్రధాన ఎజెండా కాగలదా? రైతుల ఆత్మహత్యలే ప్రధాన ఎజెండాగా ప్రతిపక్షాలు ఉమ్మడి పోరు సాగిం చాలని అనుకున్నా, అది ఇప్పుడున్న పరిస్థితులలో సాగకపోవచ్చు. కాంగ్రెస్ పక్షం శాసనసభలో రెండు వర్గాలుగా విడిపోయి ఉన్నది. అధికార పక్షాన్ని ఎండగట్టాలన్న వర్గం ఒకటయితే, చూసీచూడనట్టు పోవాలన్న ధోరణి మరో వర్గానిది. తెలుగుదేశం పరిస్థితి మరీ దారుణం. ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల సందర్భంగా జరిగిన ఓటుకు కోట్లు ఉదంతంలో పట్టుబడి, జైలుకు కూడా వెళ్లి వచ్చిన రేవంత్‌రెడ్డిని పక్కన పెట్టుకుని ఆ పార్టీ ఎవరికి, ఏ నీతి చెప్పగలుగుతుంది శాసనసభలో? మరో పక్షం మజ్లిస్ ఉన్నా, అది అధి కార పక్షానికి కొంచెం దగ్గరగా, కొంచెం దూరంగా ఉంటుంది. వామపక్షాల ఉనికి అంతంత మాత్రమే. అందుకే అద్భుతమైన వాక్పటిమ కలిగిన అధికార పక్ష సభ్యుల ఎదురుదాడిని తట్టుకుని నిలబడటం ప్రతిపక్షాలకు కష్టమే. datelinehyderabad@gmail.com - దేవులపల్లి అమర్ -
ప్రతిష్టంభన వెనుక ప్రతీకారేచ్ఛ
సభలో చర్చ జరగనీయకుండా ప్రతిష్టంభన సృష్టించడం ప్రజాస్వామ్య విధానంలో భాగమేనంటూ అప్పుడు ప్రకటించిన అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లు ఇప్పుడు అందుకు భిన్నంగా వాదిస్తే ఎవరు ఆలకిస్తారు? ఈ సమావేశాలలో మాత్రమే కాదు వచ్చే శీతాకాల సమావేశాలలో కూడా నిర్మాణాత్మకమైన చర్చ జరిగే అవకాశం లేదు. సవాలక్ష సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. రాజకీయ నాయకులకు వారి పట్టుదలలే ప్రధానం. వారి ప్రయోజనాలకే ప్రాముఖ్యం. దేశం ఏమైనా, ప్రజలు ఏమైనా పర్వాలేదు. పార్లమెంటు లోపలా, బయటా సాగుతున్న పెనుగులాటలో గెలిచేది ఎవరో తెలియదు కానీ ఓడేది మాత్రం ప్రజలే. వానాకాల సమావేశాలు ప్రతీకార రాజ కీయాల వెల్లువలో కొట్టుకుపోయినట్టే లెక్క. యూపీఏ హయాంలో ప్రతిపక్ష బీజేపీ ఏ విధంగా చర్చకు అంతరాయం కలిగించిందో అదే విధంగా ఇప్పుడు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ పాలనలో సర్వోన్నత చట్టసభలో చర్చ చట్టుబండలు కావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉన్నది. ‘తానాషాహీ నహీ చెలేగీ’ (నియంతృత్వం సాగదు) అంటూ పార్లమెంటు భవనం బయట కాం గ్రెస్ అధినేత సోనియాగాంధీ నినాదాలు చేయడం, ఒకవైపు రాహుల్‌గాంధీ, మరోవైపు జ్యోతిరాదిత్య సింధియా చెలరేగడం వెనుక పాతకక్ష లేకపోలేదు. యూపీఏ హయాంలో బీజేపీ సృష్టించిన ప్రతిష్టంభనకు మాత్రమే ప్రతీకారం కాదు. యూపీఏ ప్రభుత్వం ఏర్పడటానికి ముందు సంభవించిన నాటకీయ పరిణామాలలో ప్రధాని పదవికీ, సోనియాగాంధీకీ మధ్య నిలిచిన నాటి ప్రతి పక్ష నేత సుష్మాస్వరాజ్పైన ఇది కక్షసాధింపు. సుష్మాపైనే ఎందుకు గురి? విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే సింధియా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పదవుల నుంచి వైదొలిగే వరకూ పార్లమెంటులో చర్చ జరగబోదని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ ముగ్గురిలో తక్కువ తీవ్రత ఉన్నది సుష్మాస్వరాజ్పైన వచ్చిన ఆరోపణలలోనే. ఐపీఎల్ క్రికెట్ సృష్టికర్త లలిత్మోదీకీ, వసుంధర రాజే కుమారుడికీ ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయి. మధ్య ప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణంలో 35మందికి పైగా వ్యక్తులు మరణించినట్టు రుజువులు ఉన్నాయి. లలిత్‌మోదీ పోర్చుగల్ వెళ్ళడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతిస్తే దాని వల్ల భారత్‌తో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం లేదని పూచీ ఇవ్వడం సుష్మాస్వరాజ్ చేసిన తప్పిదం. ఈ విషయం మంత్రివర్గంలోని ఇతర బాధ్యులకు తెలియకుండా గోప్యంగా జరగడం నిశ్చయంగా అసాధార ణమే. అక్రమమే. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులపైన వచ్చిన ఆరోపణలలోని తీవ్రత సుష్మాపైన చేస్తున్న ఆరోపణలలో లేదు. గురి సుష్మాపైనే ఎందుకు పెట్టారు? 2004లో ఎన్నికలైన తర్వాత తన నాయకత్వంలోని కూటమికి లోక్ సభలో సాధారణ మెజారిటీకి అవసరమైన 272 సభ్యుల మద్దతు ఉన్నదంటూ అబ్దుల్ కలాంను కలుసుకునేందుకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్ళిన సోనియాగాంధీ తిరిగి వచ్చిన తర్వాత త్యాగం సీనుకు తెరలేపారు. తాను స్వయంగా ప్రధాన మంత్రి పదవిని స్వీకరించకుండా మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్సింగ్ను గద్దెపైన కూర్చోబెడుతున్నట్టు ప్రకటించారు. దీనికి నేపథ్యం ఏమిటో చాలా మందికి తెలుసు. ఇటలీ దేశస్థురాలైన సోనియాగాంధీని కనుక ప్రధానిగా నియ మిస్తే తాను శిరోముండనం చేయించుకొని, తెల్లచీర కట్టుకొని జన్‌పథ్‌లో నిరా హార దీక్ష చేస్తానంటూ సుష్మాస్వరాజ్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. అప్పటి ఆగ్రహం సొనియాగాంధీ హృదయంలో రగులుతూనే ఉంది. ఇప్పుడు సుష్మాను బోనె క్కించే అవకాశం వచ్చింది. పోర్చుగల్ ప్రయాణానికి అవసరమైన పత్రాలు లలిత్ మోదీకి అందేందుకు దోహదం చేయడమే కాకుండా సుష్మా భర్త, కుమార్తె క్రికెట్ మాయావికి న్యాయసలహాదారులుగా ఉండటం కాంగ్రెస్ దాడికి పదును పెట్టింది. ‘లలిత్‌మోదీ సుష్మా భర్తకూ, కుమార్తెకూ ఎంత చెల్లించారో వెల్లడిం చాలి’ అంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. రాటుదేలుతున్న రాహుల్ కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతీఇరానీ సవాలు చేసినట్టు ఒకటిన్నర నిమి షం మాత్రమే కాకుండా గంటన్నర సేపు మాట్లాడటం సోనియాకు కానీ రాహు ల్కి కానీ ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చును కానీ, కొన్ని ఘాటైన మాటల (పంచ్ లైన్ల)తో మోదీని వేధించడంలో రాహుల్ విజయం సాధించినట్టే కనిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ ‘ న ఖావూంగా, న ఖానేదూంగా’ (తినను, తిననివ్వను) అంటూ చేసిన వాగ్దానాన్ని పదేపదే ఉటంకించడం ద్వారా అవినీతి వ్యవస్థకు మోదీ అధ్యక్షత వహిస్తున్నారనే భావనను రాహుల్ జయప్రదంగా ప్రచారంలో పెట్టగలిగారు. మోదీకి దేశ ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి కార ణాలు ప్రధానంగా మూడు. ఒకటి, మోదీ అవినీతికి ఆమడ దూరం. రెండు, మోదీ సమర్థ పాలకుడు. మూడు, అభివృద్ధి సాధకుడు. రాహుల్ సుదీర్ఘ విరా మం ముగించుకొని వస్తూనే మోదీ ప్రభుత్వాన్ని ‘సూట్ బూట్ కీ సర్కార్’ అంటూ దుయ్యపట్టారు. పేదలకు వ్యతిరేకిగా, కార్పొరేట్ సంస్థలకు అనుకూలు డుగా అభివర్ణించారు. ‘అటు అంబానీ, ఇటు అదానీ, మధ్య ప్రధాని’ అంటూ తెలుగులో సైతం చలోక్తులు వినిపించాయి. ఈ మచ్చ మాపుకోవడం కోసం మోదీ ప్రయత్నిస్తున్నారు. కొర్పొరేట్ రంగ ప్రతినిధులను కలుసుకోవడానికి సైతం సంకోచిస్తున్నారు. అందుకే ‘ఇది మోదీ ప్రభుత్వం కాదు’ అంటూ బజాజ్ ఆటో అధిపతి రాహుల్ బజాజ్ వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ లాగా రాహుల్ బజాజ్ రాజకీయవాది కాదు. పైగా మోదీ అభిమాని. మోదీ తన ప్రత్యే కతలనూ, స్వశక్తిని విస్మరించి పేదలకు వ్యతిరేకి కాదనే పేరు తెచ్చుకునే ప్రయ త్నంలో గట్టి పనులు చేయలేకపోతున్నారని బజాజ్ ఫిర్యాదు. పారిశ్రామికవేత్తలతో, వణిక్ప్రముఖులతో సమాలోచనలు జరిపి పరిశ్రమ లనూ, వ్యాపారాన్నీ విస్తరించడం ద్వారా కొత్త ఉద్యోగాలు సృష్టించాలనీ, నిరు ద్యోగాన్ని తగ్గించాలనీ మోదీ అభిమానులు కోరుకుంటున్నారు. వెనకటి నుంచి పన్ను కట్టించుకునే చట్టాన్ని (రెట్రాస్పెక్టివ్ టాక్స్ లా) ఉపసంహరించుకోవా లనీ, గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ)చట్టాన్ని తీసుకురావాలనీ అభిల షిస్తున్నారు. మోదీ మరింత సమర్థంగా, శక్తిమంతంగా పరిపాలన నిర్వహిం చాలనీ, శషభిషలు లేకుండా బాణంలాగా దూసుకుపోవాలనీ 2014లో అరు దైన అవకాశం ప్రసాదించిన దేశప్రజలు కోరుకుంటున్నారు. కొన్ని అరుదైన విజయాలు ప్రధానిగా మోదీ సాధించిన విజయాలు లేకపోలేదు. గత ప్రభుత్వాలు ఆరం భించిన కొన్ని విధానాలను కొనసాగించడమే కాకుండా వాటిని ఇంకా ఎక్కువ బలంగా ముందుకు తీసుకొని వెడుతున్నారు. బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఒప్పం దం చరిత్రాత్మకమైనది. 1974లో ఇందిరాగాంధీ, ముజీబుర్ రెహ్మాన్ సంతకాలు చేసిన ఒప్పందాన్ని, బీజేపీ దశాబ్దాలుగా వ్యతిరేకిస్తూ వచ్చిన నిర్ణయాన్ని మోదీ అమలులోకి తేగలిగారు. ముయ్వావర్గంతో ఇటీవల కుదుర్చుకున్న శాంతి ఒప్పందం నాగభూమిలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి దోహదం చేస్తుంది. దౌత్యరంగంలో భారత్‌కు గుర్తింపు సాధించడంలో మోదీ కృషి కొంత వరకూ ఫలించింది. పార్లమెంటులో ప్రతిష్టంభన కారణంగానూ, తన పార్టీలోని ప్రముఖులపైన అవినీతి ఆరోపణలు వచ్చిన కారణంగానూ మోదీ మౌనం వహించడం ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసింది. అద్భుతమైన వాగ్ధాటి కలిగిన నాయకుడుగా, ప్రజలతో నేరుగా సంభాషించే నేర్పు కలిగిన రాజకీయవేత్తగా పేరున్న మోదీ స్వపక్షీయులపైన వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టలేక, ఒప్పుకో లేక మౌనాన్ని ఆశ్రయించడం బలహీనతగానే ప్రజలకు అనిపించింది. ఎన్నికల సమయంలో మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అనేకం అమలుకు నోచుకోలేదు. ముఖ్యంగా రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపైన చర్చ సందర్భంగా సీనియర్ బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదాపైన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి. ఈ సమస్య క్రమంగా రగులుతోంది. శనివారంనాడు తిరుపతిలో ఒక యువకుడు ఆత్మ హత్యాయత్నం చేసుకునే వరకూ పరిస్థితి వెళ్ళింది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2014 సార్వత్రిక ఎన్నికలలో గెలిపించడానికి రెండు వాగ్దానాలు కారణం. ఒకటి, రైతుల రుణ మాఫీ. రెండు, ప్రత్యేక హోదా. రెండూ ఆచరణకు నోచుకోలేదు. ఈ వైఫల్యానికి తెలుగుదేశం ఎంత కారణమో బీజేపీ సైతం అంతే కారణం. చర్చ ఎవరికి కావాలి? పార్లమెంటులో చర్చను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒక కార ణం అంటూ ఉంది. కాంగ్రెస్ పార్టీతో సమాలోచనలు జరిపి ఆ పార్టీ సహకారం పొందడానికి నరేంద్రమోదీ ఎందుకు ప్రయత్నించలేదు? పార్లమెంటులో చర్చ జరగకుండా సమయం వృధా అవుతున్నా నిమ్మకు నీరె త్తినట్టు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? గులాం నబీ ఆజాద్‌నూ, మల్లికార్జున్ ఖార్గేనూ బీజేపీ నాయ కులు సంప్రతించారు. చర్చను అడ్డుకోవాలన్నదే తమకు అధిష్ఠానం నుంచి అం దిన ఆదేశమని వారు చెప్పడంతో బీజేపీ నాయకులు అంతటితో వదిలివేశారు. మోదీ స్వయంగా చొరవ తీసుకొని సోనియాగాంధీతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మరో సంవత్సరంపాటు రాజ్యసభలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగు తుంది. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 68. ఎన్డీఏకి 64 మంది ఉన్నారు(బీజేపీకి 48 మంది, మిత్రపక్షాలకు 16). 2016లో మొత్తం 76 మంది సభ్యుల పదవీ విరమణ ఉంటుంది. వారిలో 21 మంది కాంగ్రెస్‌కు చెందినవారు. వీరిలో అత్యధికులు రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ వంటి కాంగ్రెసేతర రాష్ట్రాల నుంచి ఎన్నికైనవారు. సగం సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కవు. పదవీ విరమణ చేయనున్న 17 మంది బీజేపీ సభ్యులు, ఏడుగురు మిత్రపక్షాల సభ్యుల స్థానంలో ఆ పార్టీలకి చెందినవారే ఖాయంగా ఎన్నికై సభకు తిరిగి వస్తారు. 2016 మార్చిలో 12 మంది నామి నేటెడ్ సభ్యులు పదవీ విరమణ చేస్తారు. సాధారణంగా అధికార కూటమి సూచించినవారినే రాష్ట్రపతి నామినేట్ చేస్తారు కనుక వారు బీజేపీకి అను కూలురే ఉంటారు. పరిస్థితులు అనుకూలించే వరకూ వేచి ఉండాలని మోదీ నిర్ణయించుకొని ఉంటారు. ప్రస్తుతానికి బిహార్ ఎన్నికలపైనే బీజేపీ దృష్టి నిలిపింది. ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉంటే ముందు బిహార్‌కు ఆ వరం మోదీ ప్రసాదించేవారు. 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ ఓటర్లతో పని లేదు. బిహార్ తర్వాత కేరళ, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరు గుతాయి. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరుణ్ గగోయ్‌కి అస్సాంలో వ్యతిరేకత ప్రబలంగా ఉంది. 1985 నుంచి కేరళలో అధికారంలో ఉన్న కూటమిని గెలిపించే ఆనవాయితీ లేదు. అక్కడ బీజేపీ విజయం సాధించ లేకపోయినా కాంగ్రెస్ ఓడిపోతుంది. రాజ్యసభలో కాంగ్రెస్ బలం క్షీణించే వరకూ ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందడం సాధ్యం కాదని మోదీ గ్రహించి ఉంటారు. ఆర్థిక సంస్కరణల కంటే, ప్రజాహితం కంటే ప్రతీకార రాజ కీయాలకే కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తున్న కారణంగా మోదీ చేయగలిగింది ఏమీ లేదు. కాంగ్రెస్ పట్టువిడుపులు లేని వైఖరి అవలంబించడానికి బీజేపీ గత లోక్‌సభలో అనుసరించిన అనుచిత ధోరణే కారణం. నాడు అడ్డుకున్న జీఎస్టీ బిల్లును ఇప్పుడు సభ చేత ఆమోదింప జేయాలని ప్రయత్నించడం కపట రాజ కీయాలకు నిదర్శనం. సభలో చర్చ జరగనీయకుండా ప్రతిష్టంభన సృష్టించడం ప్రజాస్వామ్య విధానంలో భాగమేనంటూ అప్పుడు ప్రకటించిన అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లు ఇప్పుడు అందుకు భిన్నంగా వాదిస్తే ఎవరు ఆలకిస్తారు? ఈ సమావేశాలలో మాత్రమే కాదు వచ్చే శీతాకాల సమావేశాలలో కూడా నిర్మా ణాత్మకమైన చర్చ జరిగే అవకాశం లేదు. సవాలక్ష సమస్యలతో ప్రజలు సత మతం అవుతున్నారు. రాజకీయ నాయకులకు వారి పట్టుదలలే ప్రధానం. వారి ప్రయోజనాలకే ప్రాముఖ్యం. దేశం ఏమైనా, ప్రజలు ఏమైనా పర్వాలేదు. సామరస్య వాతావరణానికి ఎవ్వరూ సుముఖంగా లేరు. పదవీ రాజకీయాల పతనావస్థకు మనం ప్రత్యక్ష సాక్షులం. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ - కె.రామచంద్రమూర్తి -
ఒక్క విషయం పైనైనా చర్చ జరిగిందా?
-
రైతుల ఆత్మహత్యలపై చంద్రబాబు
-
కాలక్షేపం చేయకుండా కొల్లేరును పట్టించుకోండి
-
గిరిజనులకు ఒక్క రూపాయైనా ఇచ్చారా?
-
ప్రభుత్వానికి ముస్లింల పట్ల ప్రేమ లేదా?
-
ఫోర్త్ ఎస్టేట్: ఏపీ అసెంబ్లీని అట్టుడికించే అంశాలేంటీ?
-
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం
-
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
-
3 నుంచి మళ్లీ భే‘టీ’
-
3 నుంచి మళ్లీ భే‘టీ’
అసెంబ్లీ వాయిదా.. జనవరి 3 నుంచి 23 వరకు రెండో విడత.. సీఎం పేరుతో ఎమ్మెల్యేలకు బులెటిన్ పత్రాల పంపిణీ విభజన బిల్లుపై మొత్తం 13 రోజుల చర్చ జనవరి 3 నుంచి 10 వరకు ఆదివారం మినహా అన్ని రోజుల్లోనూ.. 11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు తిరిగి 16 నుంచి 23 వరకు శాసనసభ సమావేశాలు గురువారమూ సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో మార్మోగిన సభలు.. తుపానును ఆపలేకపోయినా విభజనను ఆపుతానన్న మాటకు ఈ రోజుకూ కట్టుబడి ఉన్నా. సమైక్యం కోరుతున్న సీమాంధ్ర నేతలు తెలంగాణ వారిని నొప్పించకుండా మాట్లాడాలి. - ముఖ్యమంత్రి కిరణ్ సీమాంధ్ర ఎమ్మెల్యేల బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గి సభను వాయిదా వేసిన సీఎం, స్పీకర్ వైఖరికి నిరసనగా వారి దిష్టి బొమ్మలు దహనం చేస్తాం. సభలో బిల్లు పెట్టడమే మాకు ముఖ్యం. - టీఆర్ఎస్ స్పీకర్ మనోహర్ సీమాంధ్ర నేతల ఒత్తిడికి తలొగ్గడం సరికాదు. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తే తలనొప్పులు లేకుండా తెలంగాణ ఏర్పడుతుంది. - తెలంగాణ టీడీపీ నేతలు సభలో ముందు సమైక్య తీర్మానం పెట్టాల్సిందే. ఆ తర్వాతే విభజన బిల్లుపై చర్చ చేపట్టాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరిదాకా పోరాడతాం. - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దిగ్విజయ్‌సింగ్‌కు స్పీకర్ అమ్ముడు పోయారు. సమైక్యరాష్ట్రానికి సీఎంగా కొనసాగిస్తే చాలని సీఎం సాగిలపడ్డాడు. దిగ్విజయ్ వీళ్లిద్దరినీ డబ్బులతో కొనేశాడు. - సీమాంధ్ర టీడీపీ నేతలు సాక్షి, హైదరాబాద్: శాసనసభ మలివిడత సమావేశాలు జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 12న ప్రారంభమైన శాసనసభ శీతాకాల సమావేశాలకు స్పీకర్ గురువారం సుదీర్ఘ విరామం ప్రకటించారు. 14 రోజుల విరామం తర్వాత తిరిగి జనవరి 3 నుంచి రెండో విడత సమావేశాలు ఏర్పాటు చేశారు. స్పీకర్ అసెంబ్లీని వచ్చేనెల 3కు వాయిదా వేయగా.. అప్పట్నుంచి ఎన్ని రోజుల పాటు సమావేశాలు జరుగుతాయన్న విషయంలో సభా నాయకుడు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేరుతో బులెటిన్ జారీ అయింది. శాసనసభ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలందరి చేతుల్లో ఈ బులెటిన్ పత్రాలు ప్రత్యక్షమయ్యాయి. సాధారణంగా అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన సమాచారమంతా సభాపతి ఆదేశాల మేరకు శాసనసభ కార్యదర్శి పేరిట బులెటిన్లు జారీ చేస్తారు. అయితే సభ్యులకు అందజేసిన బులెటిన్ పత్రాలు మాత్రం శాసనసభాపక్ష నేత కిరణ్‌కుమార్‌రెడ్డి పేరుతో ఉండటం చర్చనీయాంశమైంది. ఆ బులెటిన్‌లో గురువారం (19.12.2013) కూడా సభ జరుగుతుందని ఉండగా.. స్పీకర్ మాత్రం వచ్చేనెల 3కు వాయిదా వేశారు. జనవరి 3 నుంచి 23 వరకు సెలవులు మినహాయిస్తే సమావేశాలు మొత్తం 13 రోజులపాటు కొనసాగనున్నాయి. బీఏసీ తీసుకున్న నిర్ణయం మేరకే ఈ తేదీలను ఖరారు చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఆయా తేదీల్లో ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ బిల్లు-2013పై చర్చను కొనసాగించాలని, సభలోని ప్రతి ఒక్క సభ్యుడూ బిల్లులోని ప్రతి క్లాజుపై తన అభిప్రాయాలను వెల్లడించాలని సూచించారు. జనవరి 3 నుంచి 10 వరకు మధ్యలో ఆదివారం మినహా అన్ని రోజుల్లో సమావేశాలు కొనసాగుతాయి. శనివారం కూడా సభ జరుగుతుం ది. ఆ తర్వాత ఐదురోజులు (జనవరి 11 నుంచి 15 వరకు) సంక్రాంతి సెలవులిచ్చారు. ఆ తేదీల్లో సమావేశాలు జరుగవు. తిరిగి జనవరి 16 నుంచి 23 వరకు సమావేశాలు నిర్వహిస్తారు. మధ్యలో శని, ఆదివారాలు (18, 19 వ తేదీల్లో) మినహా మిగిలిన 6 రోజులు సమావేశాలు కొనసాగుతాయి. నినాదాలతో మార్మోగిన సభలు: అసెంబ్లీ, శాసన మండలిలో గురువారం కూడా సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలు మిన్నంటాయి. సభలు ప్రారంభం కాగానే ఇరు ప్రాంతాల సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. చర్చ చేపట్టేందుకు అవకాశం లేకపోవడంతో అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, శాసనమండలి చైర్మన్ చక్రపాణి సభలను వాయిదా వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నల్ల దుస్తులు, కాలీప్లవర్లతో అసెంబ్లీకి హాజరై నిరసన వ్యక్తం చేశారు. సభ కార్యక్రమాలు జరగని పరిస్థితి నెలకొనడంతో ప్రారంభమైన నిమిషానికే స్పీకర్ సభను వాయిదా వేశారు. అనంతరం 1.35 గంటలకు మొదలైన తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో వచ్చేనెల 3కు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభంకాగానే వైఎస్సార్ కాంగ్రెస్, సీమాంధ్ర టీడీపీ సభ్యులు ఛైర్మన్ పోడియంలోకి వెళ్లి సమైక్యాంధ్ర తీర్మానం చేయాలంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రాంత సభ్యులు వారి స్థానాల్లో నుంచే జై తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో 5 నిమిషాలకే ఛైర్మన్ సభను వాయిదా వేశారు. తిరిగి 12.25 గంటలకు సభ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రకటన చేస్తానని చైర్మన్ చెప్పడంతో సభ్యులు వారి స్థానాల్లోకి వెళ్లారు. సీఎం ప్రసంగం అనంతరం మళ్లీ గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో పది నిమిషాలకే సభ వాయిదా పడింది. తిరిగి 1.50కి సభ ప్రారంభమైనా 2 నిమిషాల్లోనే వాయిదా పడింది. మాజీ ఎమ్మెల్సీల మృతికి సంతాపం: మాజీ ఎమ్మెల్సీలు పీవీ రంగారావు, ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి మృతికి మండలి సంతాపం ప్రకటించింది. వారి మృతికి సంతాప సూచకంగా సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.