శాసనసభా వ్యవహారాలపై బుద్ధప్రసాద్ కమిటీ | Committee constituted to monitor ap assembly proceedings | Sakshi
Sakshi News home page

శాసనసభా వ్యవహారాలపై బుద్ధప్రసాద్ కమిటీ

Published Sat, Jan 2 2016 12:51 PM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

శాసనసభా వ్యవహారాలపై బుద్ధప్రసాద్ కమిటీ - Sakshi

శాసనసభా వ్యవహారాలపై బుద్ధప్రసాద్ కమిటీ

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా డిసెంబర్ 22వ తేదీన సభలో సభ్యుల ప్రస్తావించిన పలు అంశాలపై ఓ కమిటీని నియమించారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. టీడీపీ సభ్యుడు శ్రవణ్ కుమార్, వైఎస్ఆర్‌సీపీ సభ్యుడు జి.శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రధానంగా ఈ కింది అంశాలపై పరిశీలన జరుపుతుంది

  • సభా కార్యకలాపాలకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులు సోషల్ మీడియాలోకి ఎలా వచ్చాయో విచారిస్తుంది.
  • అసెంబ్లీ ఐదో, ఆరో సమావేశాల ఆడియో వీడియో టేపులను పరిశీలించి, సభలో సభ్యుల ప్రవర్తన, సభలోనే స్పీకర్ మీద వ్యాఖ్యలు తదితర అంశాలను పరిశీలిస్తుంది
  • ఇకమీదట సభా నిర్వహణ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన పరిష్కార మార్గాలను సూచిస్తుంది
  • కమిటీ తొలిసారి సమావేశమైన తర్వాత 20 రోజుల్లోగా తన పరిశీలనలు, సూచనలు, ప్రతిపాదనలను స్పీకర్‌కు సమర్పించాలి.
  • కమిటీ గడువు కూడా తొలి సమావేశం జరిగినప్పటి నుంచి 20 రోజుల వరకు మాత్రమే ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement