శాసనసభా వ్యవహారాలపై బుద్ధప్రసాద్ కమిటీ
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా డిసెంబర్ 22వ తేదీన సభలో సభ్యుల ప్రస్తావించిన పలు అంశాలపై ఓ కమిటీని నియమించారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. టీడీపీ సభ్యుడు శ్రవణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ సభ్యుడు జి.శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రధానంగా ఈ కింది అంశాలపై పరిశీలన జరుపుతుంది
సభా కార్యకలాపాలకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులు సోషల్ మీడియాలోకి ఎలా వచ్చాయో విచారిస్తుంది.
అసెంబ్లీ ఐదో, ఆరో సమావేశాల ఆడియో వీడియో టేపులను పరిశీలించి, సభలో సభ్యుల ప్రవర్తన, సభలోనే స్పీకర్ మీద వ్యాఖ్యలు తదితర అంశాలను పరిశీలిస్తుంది
ఇకమీదట సభా నిర్వహణ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన పరిష్కార మార్గాలను సూచిస్తుంది
కమిటీ తొలిసారి సమావేశమైన తర్వాత 20 రోజుల్లోగా తన పరిశీలనలు, సూచనలు, ప్రతిపాదనలను స్పీకర్‌కు సమర్పించాలి.
కమిటీ గడువు కూడా తొలి సమావేశం జరిగినప్పటి నుంచి 20 రోజుల వరకు మాత్రమే ఉంటుంది.