హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కమిటీ వచ్చే నెల 5న మరోసారి సమావేశంకానుంది. అదే రోజున నివేదిక తయారు చేసే యోచనలో కమిటీ ఉన్నట్టు సమాచారం. బుధవారం సమావేశమైన బుద్ధప్రసాద్ కమిటీ.. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్, అసెంబ్లీ వీడియో లీకేజీపై చర్చించింది. కమిటీలోని అధికార విపక్ష సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా సభలో చోటు చేసుకున్న పరిణామాలు, వీడియోల లీకేజీ, తదితర అంశాలను విచారించేందుకు కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
5న మరోసారి బుద్ధప్రసాద్ కమిటీ భేటీ
Published Wed, Jan 27 2016 7:29 PM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM
Advertisement
Advertisement