సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు నవంబర్ 8 నుంచి ప్రారంభం కానున్నాయి. 13వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఈ మేరకు అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి మంగళవారం సమావేశాల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆ ప్రకారం ఐదు రోజులు మాత్రమే ఈ సమావేశాలు జరగనున్నాయి. నిబంధనల ప్రకారం వర్షాకాల సమావేశాలను నిర్వహించకుండా ఉద్దేశపూర్వకంగా వాటిని వాయిదా వేసి ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర జరిగే సమయంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలను ప్రకటించటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment