
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా మూడు రోజులు పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. తొలిసారిగా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇలా ప్రశ్నోత్తరాలు చేపట్టడం ఇదే ప్రథమం. సమావేశాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగుతాయి. మధ్యలో రెండుగంటల విరామం ఉంటుంది. మరోవైపు ప్రత్యేక హోదాపై చర్చించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది.