ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజు వాయిదా తీర్మానం ఇచ్చింది. రుణాల ముసుగులో మహిళలను లైంగికంగా లోబరుచుకోవడం, అత్యాచారాల రూపంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఈ తీర్మానాన్ని ఇచ్చారు. ఇదే అంశంపై అసెంబ్లీ రూల్స్ 344 కింద కూడా వైఎస్ఆర్‌సీపీ నోటీసులు ఇచ్చింది.
గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలను మరిన్ని రోజులు పెంచాలని వైఎస్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది.
కాల్‌మనీపై వైఎస్ఆర్‌సీపీ వాయిదా తీర్మానం
Published Thu, Dec 17 2015 8:28 AM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM
Advertisement
Advertisement