ధరల స్థిరీకరణ నిధిపై చర్చించాలంటూ వైఎస్‌ఆర్ సీపీ శనివారం వాయిదా తీర్మానం ఇచ్చింది.
అమరావతి: మిర్చి, ఇతర వాణిజ్య పంటలకు లభించని గిట్టుబాటు ధరలు, ధరల స్థిరీకరణ నిధిపై చర్చించాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం వాయిదా తీర్మానం ఇచ్చింది. కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ కూడా ప్రశోత్తరాలతో సభ ఆరంభం అవుతుంది. అలాగే వివాదాస్పదమైన ఏపీఐడీఈఏ సవరణ బిల్లుపై చర్చ జరగనుంది. ఆరు బిల్లులు, పలుశాఖల పద్దులపై శాసనసభలో చర్చించనున్నారు.