అమరావతి: ఓటుకు కోట్లు కేసు ఛార్జిషీట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ప్రస్తావన, సుప్రీంకోర్టు నోటీసులు జారీపై చర్చించాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం వాయిదా తీర్మానం ఇచ్చింది. నియామవళి 63 కింద వైఎస్‌ఆర్ సీపీ ఈ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. కాగా అసెంబ్లీ సమావేశాలు ఇవాళ కూడా ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. మరోవైపు అగ్రిగోల్డ్, సాక్షి మీడియా వ్యవహారాలపై అధికార పక్షం మళ్లీ చర్చను లేవనెత్తే అవకాశం ఉంది. ఇక ఆర్‌అండ్‌బి, రవాణా, ఇరిగేషన్, వ్యవసాయం, విద్యుత్, అటవీశాపద్దులపై సభలో చర్చించే అవకాశం ఉంది.
వైఎస్‌ఆర్ సీపీ వాయిదా తీర్మానం
Published Fri, Mar 24 2017 8:51 AM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM
Advertisement
Advertisement