తమ బాగోతం బయటపడుతుందనే భయం: రోజా | ysrcp mla roja takes on chandrababu naidu government | Sakshi
Sakshi News home page

తమ బాగోతం బయటపడుతుందనే భయం: రోజా

Published Fri, Mar 24 2017 10:30 AM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM

తమ బాగోతం బయటపడుతుందనే భయం: రోజా - Sakshi

తమ బాగోతం బయటపడుతుందనే భయం: రోజా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం రాజ్యమేలుతోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా అధికారపక్ష సభ్యులు వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తూ సభను అడ్డుకుంటున్నారని ఆమె అన్నారు. ప్రత్యేక హోదా, కరువు, అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యల సహా ఏ ఒక్క అంశాన్ని ప్రభుత్వం చర్చకు అనుమతించలేదని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు.  చర్చ జరిగితే తమ బాగోతం బయటపడుతుందనే భయం అధికార పక్షానికి పట్టుకుందన్నారు. అందుకే ప్రతిసారి అధికారపక్ష సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు.  

ఓటుకు కోట్లు కేసు ఛార్జిషీటులో ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ప్రస్తావన, సుప్రీంకోర్టు నోటీసులపై చర్చించాలంటూ తాము వాయిదా తీర్మానం ఇస్తే...దానిపై చర్చించకుండా... అదో పనికిమాలిన కేసు అని, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఒకరు, పక్క రాష్ట్రంలో జరిగినదాన్ని తీసుకు వచ్చిన ఏపీ అసెంబ్లీలో ఎలా మాట్లాడతారు అని మరొకరు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. స్పీకర్‌ తమకు తండ్రిలాంటివారని, ఆయనపై తమకు గౌరవం ఉందన్నారు.

ఇక ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్కయ్యారని, ఆడియో, వీడియో టేపుల్లో ఆయన దొరికిపోయారన్నారు. బ్రీఫ్‌డ్‌ మి అన్న వాయిస్‌ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్‌ పరీక్షల్లో తేలిందని, చంద్రబాబు డబ్బులిచ్చారని రేవంత్‌ రెడ్డి స్వయంగా చెప్పారని రోజా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement