అమరావతి: విపక్ష సభ్యుల నిరసనలతో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఓటుకు కోట్లు కేసు ఛార్జిషీటులో ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ప్రస్తావన, సుప్రీంకోర్టు నోటీసులపై చర్చించాలని వైఎస్‌ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు.
అయితే సభ ప్రారంభం కాగానే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి ఆందోళనకు దిగారు. అయితే ప్రశ్నోత్తరాల తర్వాతే ఏ అంశంపైన అయినా చర్చిద్దామని స్పీకర్ స్పష్టం చేశారు. మరోవైపు ఇవాళ కూడా అధికారపక్ష సభ్యులు...ఎదురు దాడికి దిగారు. వ్యక్తిగత దూషణలకు దిగి, నోటికి వచ్చినట్లు మాట్లాడారు. వైఎస్‌ఆర్ సీపీ సభ్యుల నిరసన, నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.