మళ్లీ రెచ్చిపోయిన ఎమ్మెల్యే బోండా ఉమా | TDP mla Bonda uma alleges again ys jagan mohan reddy in assembly | Sakshi
Sakshi News home page

మళ్లీ రెచ్చిపోయిన ఎమ్మెల్యే బోండా ఉమా

Published Fri, Mar 24 2017 9:33 AM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM

మళ్లీ రెచ్చిపోయిన ఎమ్మెల్యే బోండా ఉమా - Sakshi

మళ్లీ రెచ్చిపోయిన ఎమ్మెల్యే బోండా ఉమా

అమరావతి: ఏపీ శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మరోసారి నోరు జారారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. చర్చను పక్కదారి పట్టించేందుకు అధికార పక్ష నేతలు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూ తమ నోటికి పని చెబుతున్నారు. శుక్రవారం కూడా అసెంబ్లీలో అదే జరిగింది. ఓటుకు కోట్లు కేసు ఛార్జిషీటులో ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ప్రస్తావన, సుప్రీంకోర్టు నోటీసులపై చర్చించాలంటూ వైఎస్‌ఆర్‌ సీపీ వాయిదా తీర్మానం ఇచ్చి, దానిపై చర్చకు పట్టుబట్టింది.

 

దీంతో అధికార సభ్యులు మళ్లీ రెచ్చిపోయారు. ప్రతిపక్షానికి సభలో కూర్చొనే అర్హత లేదంటూ అసలు విషయాన్ని పక్కనపెట్టి వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగత దూషణల పర్వం కొనసాగించారు. ఆయన బాటలోనే కూన రవికుమార్‌, యరపతినేని శ్రీనివాసరావు ...ప్రతిపక్షంపై ఎదురు దాడి చేశారు. అగ్రిగోల్డ్‌ అంశంపై ప్రభుత్వం విచారణకు సిద్ధంగా ఉంటే ...ప్రతిపక్షం సభనుంచి ఉడాయించిందంటూ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement