జానా వర్సెస్ కేటీఆర్.. అసెంబ్లీ హాట్ హాట్
జానా వర్సెస్ కేటీఆర్.. అసెంబ్లీ హాట్ హాట్
Published Tue, Dec 20 2016 2:10 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నాలుగోరోజు కాస్త వాడివేడిగా చర్చ జరిగింది. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడే సందర్భంలో 'నా తెలంగాణ' అనడంతో మాజీమంత్రి, ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. 'నా తెలంగాణ కాదు.. మన తెలంగాణ అనాలి' అంటూ హితబోధ చేశారు. అయితే, జానారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఎదురుదాడి మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నా తెలంగాణ అని భావించలేదని, 1956లో ఇష్టంలేని పెళ్లి చేసి తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఏమీ తెలంగాణ ఇవ్వలేదని.. పోరాడితేనే అది వచ్చిందని చెప్పారు.
అయితే.. ఆంధ్రా నేతల మూకుమ్మడి రాజీనామాలతో కేటీఆర్ తన ఇంటికి వచ్చారని, తెలంగాణ సాధనకు ఏం చేద్దామని అడిగారని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని సోనియాగాంధీకి నచ్చజెప్పింది తామేనని జానారెడ్డి అన్నారు. అప్పుడు ఇక్కడ, అక్కడ కూడా తామే అధికారంలో ఉన్నామని, అందువల్ల తలుచుకుంటే ఉద్యమాన్ని అణిచేసేవాళ్లమని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. దాంతో జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జానారెడ్డి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement