త్వరలోనే అన‍్నపూర‍్ణ భోజన కేంద్రాలు: కేటీఆర్‌ | minister ktr speaks on Rs 5-Meal Centers in hyderabad | Sakshi
Sakshi News home page

త్వరలోనే అన‍్నపూర‍్ణ భోజన కేంద్రాలు: కేటీఆర్‌

Published Thu, Mar 16 2017 11:15 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

minister ktr speaks on Rs 5-Meal Centers in hyderabad

హైదరాబాద్ : హైదరాబాద్‌ నగరంలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో అన్నపూర్ణ భోజన కేంద్రాలు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం శాసనసభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో 109 కేంద్రాల్లో రూ. 5 కే భోజనం పెడుతున్నామని, వీటిని 150 కేంద్రాలకు పెంచుతామని మంత్రి చెప్పారు. ఈ కేంద్రాలకు అన్నపూర్ణ భోజన కేంద్రాలుగా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
 
5 రూపాయల భోజనం నాణ్యంగా ఉన్నదని ఇప్పటికే ప్రతిపక్ష నేత జానారెడ్డితో సహా పలువురు కితాబిచ్చారని గుర్తు చేశారు. ఆస్పత్రులు, లేబర్ అడ్డాల్లో ఈ కేంద్రాలను శాశ్వతంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నాణ్యతతో కూడిన భోజనాన్ని అందిస్తూ.. ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. భోజన కేంద్రాల వద్ద మంచినీటి సదుపాయం కూడా కల్పిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement