చేనేత వస్త్రాలు బహూకరించనున్న కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో భాగంగా ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలనే అంశంపై కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వాయిదా తీర్మానం తీసుకొచ్చాయి. కాగా, నేడు అసెంబ్లీలో చేనేత వస్త్రాలకు ప్రాధాన్యత పెంచాలని మంత్రి కేటీఆర్ యోచిస్తున్నారు. నేడు అసెంబ్లీలో స్పీకర్ మధుసూదనచారి సహా పలువురు మంత్రులకు చేనేత వస్త్రాలను కేటీఆర్ బహూకరించనున్నారు. చేనేతకు ఆదరణ పెంచాలని, మద్ధతు ఇవ్వాలని ప్రజా ప్రతినిధులను కేటీఆర్ కోరనున్నారు.