తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. సోమవారం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై సుదీర్ఘ చర్చ అనంతరం సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.
కాగా తెలంగాణ అసెంబ్లీ 13 రోజుల పాటు జరిగింది. మొత‍్తం 72.32 గంటల పాటు వివిధ అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో 5 బిల్లులకు ఆమోదం తెలిపింది.