
నేటితో పార్లమెంటు సమావేశాల ముగింపు
పార్లమెంటు సమావేశాలు గురువారంతోనే ముగుస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్నాథ్ తెలిపారు. అవినీతి నిరోధక చట్టం లాంటి కీలక బిల్లులు ఇంకా ఆమోదం పొందాల్సి ఉన్నందున సమావేశాలను పొడిగించాలని తాము తలపెట్టినా, విపక్షాలు మాత్రం పొడిగింపునకు అంగీకరించలేదని ఆయన చెప్పారు.
దీంతో ఇక.. ఇప్పటివరకు ఆమోదం పొందని బిల్లులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సులు జారీ చేయాలని నిర్ణయించింది.