Owner Of 3 Billion Dollar Company Patagonia Donated To Climate Crisis - Sakshi
Sakshi News home page

శ్రీమంతుడు 2.0: రూ.24 వేల కోట్ల కంపెనీని విరాళంగా ఇచ్చాడు!

Published Fri, Sep 16 2022 7:03 PM | Last Updated on Sat, Sep 17 2022 6:28 AM

Owner Of 3 Billion Dollar Company Patagonia Donated To Climate Crisis - Sakshi

పెటగోనియో యజమాని యోవోన్‌ చుయ్‌నార్డ్‌ (PC: Patagonia)

ప్రకృతి ప్రజలకు అవసరమైనవన్నీ ఇస్తుంది. అయితే కొం‍దరు తమ స్వార్థం కోసం భూమిపై ఉన్న వనరులను వాడుకుంటూ అదే ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఇప్పటికే పర్యావరణం ప్రమాదంలో ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణ కొం‍దరు ముందడుగు వేసి తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా యూఎస్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన వేల కోట్ల కంపెనీని లాభాపేక్ష లేని ఓ ట్రస్ట్‌కి విరాళంగా ఇచ్చేశాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. 

వివరాల్లోకి వెళితే.. యూఎస్‌కు చెందిన వ్యాపారవేత్త యోవోన్‌ చుయ్‌నార్డ్‌ తన కంపెనీ ‘పెటగోనియో’ని పర్యావరణ పరిరక్షణకై లాభాపేక్షలేని సంస్థకు విరాళంగా ఇచ్చాడు. ఇకపై ఈ కంపెనీ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం వాతావరణ మార్పులు, జీవ వైవిధ్యం,అటవీ భూములు సంరక్షణకు పాటుపడే సంస్థలకు అందజేయనున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని అతని భార్యాపిల్లలు కూడా మద్దతునిచ్చారు.

ఆయన దీనిపై స్పందిస్తూ.. ప్రకృతి అందిస్తున్న వనరులను ఉపయోగించుకుంటూ వాటిని నగదు రూపంలో మార్చుకుంటున్నాం. ఇకపై పెటాగోనియో తన సంపాదనను తిరిగి ప్రకృతికే అంది​స్తుందన్నారు. పెటాగోనియో ప్రతి సంవత్సరం సుమారు 1 బిలియన్‌ డాలర్ల విలువైన జాకెట్లు, స్కై ప్యాంట్లను అమ్మకాలు జరుపుతోంది. కాగా అవుట్‌డోర్‌ ఫ్యాషన్‌ సంస్థగా పెటగోనియాను 50 ఏళ్ల కిందట ప్రారంభించారు.

చదవండి: దూసుకుపోతున్న రిలయన్స్‌ జియో.. జూలైలోనూ జోరు తగ్గలే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement