businesman
-
హైదరాబాద్ సహా మూడు నగరాలకు ఫుల్ డిమాండ్: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
పూణే: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పుల కారణంగా రానున్న కాలంలో బెంగళూరు, హైదరాబాద్, పూణే నగరాలకు భారీ ఎత్తున వలసలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వలసల లేకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో నారాయణమూర్తి మాట్లాడుతూ..‘భారత్ సహా పలు దేశాల్లో(ఆఫ్రికన్) ఇటీవలి కాలంలో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా రాబోయే రెండు దశాబ్దాల్లో కొన్ని దేశాల ప్రజలు భారత్‌వైపు చూసే అవకాశం ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాలు నివాసయోగ్యంగా ఉండటంతో వారు ఇక్కడికి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఫలితంగా పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతాయని అన్నారు.ఇదే సమయంలో భారత్ విషయానికి వస్తే హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాల్లోకి వలసలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అందుకే వారంతా ఇక్కడే వచ్చేందుకు చూస్తారు. అప్పుడు ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం కారణంగా ఇక్కడ పరిస్థితులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వలసలను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. కార్పొరేట్ ప్రపంచం, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు కలిసి వాతావరణ మార్పు సమస్యను పరిష్కరించాలని సూచనలు చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు వారంలో 70 గంటలు పనిచేయాలంటూ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాల్సిందేనని కుండ బద్ధలుకొట్టారు. లేకుంటే పేదరికం నుంచి ఎలా బయటపడగలమని? ప్రశ్నించారు. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?. భవిష్యత్తు కోసం మనమంతా కలసికట్టుగా బాధ్యత తీసుకోవాలని పిలుపు ఇచ్చారు. Infosys CEO Narayana Murthy warns of urban overload due to climate change pic.twitter.com/85EwbchiOD— NDTV (@ndtv) December 22, 2024 -
'స్వీట్ స్టార్టప్': జస్ట్ కప్ కేక్స్‌తో ఏడాదికి ఏకంగా..!
బెంగళూరులో మేఘనా జైన్ కూడా ఈ దీపావళికి ఒక కళ. ఆమె నడుపుతున్న ‘డ్రీమ్ ఎ డజన్ ’ నుండి ప్రత్యేక ఆర్డర్లపై వెళ్లే గిఫ్టు హ్యాంపర్లు అక్కడి కార్పోరేట్ ఆఫీస్‌లను మతాబుల్ని మించిన తియ్యటి వెలుగులతో కాంతిపుంజాల్లా మార్చేస్తుంటాయి. 6 రకాల కప్‌కేక్‌లు, 12 రకాల కేక్ వెరైటీలు, వేర్వేరు రుచుల్లోని కేక్కప్స్, చీజ్ కేక్స్‌ను అందమైన హ్యాంపర్లో చుట్టి డెలివరీ చేస్తుంటుంది ‘డ్రీమ్ ఎ డజన్ ’. ఆ స్వీట్ స్టార్టప్ యువ అధిపతే మేఘన! ఒక్క దీపావళికి మాత్రమే కాదు, అన్ని సందర్భాలకు, అన్ని సీజన్లలో ఇక్కడి కప్కేక్లకు మంచి గిరాకీ ఉంటుంది. ఇంత చిన్న వయసులో మేఘన ఏడాదికి కోటి రూపాయల బిజినెస్ చేస్తుందంటే ఇక చూడండి!మేఘన రాజస్థానీ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. స్వీట్లంటే ఇష్టమే కానీ, స్వీట్స్ బిజినెస్ చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేని 18 ఏళ్ల వయసులో ఓ రోజు తమ పొరుగున ఉన్న వాళ్లు సమ్మర్ బేకింగ్ క్లాసులు పెడితే వెళ్లింది మేఘన. కేక్‌ను బేక్ చేయటం నేర్చుకుంది. తర్వాత్తర్వాత తను బేక్ చేసిన కేక్‌లను ఇంట్లో, బయట, కాలేజ్‌లో అంతా మెచ్చుకోవటం ఆమెకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. అంతేకాదు, తిరుచ్చిలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ‘బిజినెస్ ఐడియా’ల పోటీ పెడితే మేఘన చెప్పిన కప్‌కేక్‌ల ఐడియాకు మూడో ప్రైజ్ లభించింది! వెంటనే ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్ వాళ్లొచ్చి ‘‘అమ్మాయ్.. మేము ఇన్వెస్ట్ చేస్తాం. నువ్వు కేక్‌ల బిజినెస్‌కి సిద్ధమేనా? అని అడిగారు! మేఘన డైలమాలో పడిపోయింది. చదువా? బిజినెస్సా? కొంత ఆలోచన తర్వాత చదువు వైపే మొగ్గు చూపింది. డిగ్రీ అయ్యాక మేఘన బెంగళూరులోని ‘ఇన్నర్ చెఫ్’లో డెజర్ట్ విభాగంలో చేరింది. ఫుడ్ టెక్నాలజీ కంపెనీ అది. తర్వాత ‘కేక్వాలా’లో ట్రై నింగ్ తీసుకుంది. తర్వాత ‘స్టార్‌బక్స్’లో ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. అది రాలేదు. అప్పుడే సొంత బిజినెస్ గురించి ఆలోచించింది. అప్పటికే మేఘన కప్‌కేక్‌ల తయారీ తోపాటు, హ్యాంపర్ డిజైనింగ్‌లో మంచి నైపుణ్యం సంపాదించింది. అయితే 2018లో ‘డ్రీమ్ ఎ డజన్‌ను ప్రారంభించబోతుండగా ‘ఉద్యోగం ఇస్తాం రమ్మని’ స్టార్‌బక్స్ నుంచి పిలుపు! ఈసారి డైలమాలో పడలేదు మేఘన. స్టార్ బక్స్‌ను వద్దనుకుంది. కొద్ది పెట్టుబడితో కేక్ బిజినెస్‌ను స్టార్ట్ చేసింది. కరోనా సమయంలో కాస్త ఒడిదుడుకులకు లోనైనా తన ‘డ్రీమ్’ను నిలబెట్టుకుంది.మేఘన దగ్గర ప్రస్తుతం 20 మంది ముఖ్య విభాగాలలో పని చేస్తున్నారు. వారిలో ఎక్కువమంది మహిళలే. అలాగే హ్యాంపర్స్తోపాటు ఇచ్చే పెయింటెడ్ మాస్క్‌లు, ప్రమిదలు, కొవ్వొత్తుల తయారీని స్థానిక స్వయం సహాయక మహిళా బృందాలకు అప్పగిస్తోంది మేఘన. ఆ విధంగా వారికి కూడా ఆర్థికంగా చేదోడుగా ఉంటోంది. చేతిలో నైపుణ్యం ఉండి, బిజినెస్ చేయాలన్న తపన ఉన్న యువతరానికి మేఘన కచ్చితంగా ఒక రోల్ మోడల్. (చదవండి: -
'మన దేశ కుమారుడిని కోల్పోయాం'.. రజినీకాంత్ ఎమోషనల్ ట్వీట్
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా మరణం పట్ల సూపర్ స్టార్ రజినీకాంత్ సంతాపం వ్యక్తం చేశారు. తన విజన్, అభిరుచితో మనదేశాన్ని ప్రపంచపటంలో నిలిపారని కొనియాడారు. దేశంలోని వేలాది మంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలిచారని ఆయనతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఎన్నో తరాలుగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించిన వ్యక్తిని కోల్పోవడం తీరని లోటన్నారు. ఈ మేరకు ఆయనతో ఉన్న ఫోటోను రజినీకాంత్ ట్వీట్ చేశారు. రజినీకాంత్ తన ట్వీట్లో.. 'తన విజన్, అభిరుచితో భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిచారు. వేలాది మంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చి, ఎన్నో తరాలుగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించిన వ్యక్తి. అందరి అభిమానం, గౌరవం పొందిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తితో గడిపిన ప్రతి క్షణాన్ని నేను ఎప్పటికీ గౌరవిస్తాను. భారతదేశానికి నిజమైన కుమారుడు ఇక లేడు. .. మీ ఆత్మకు శాంతి కలగాలి' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.A great legendary icon who put India on the global map with his vision and passion ..The man who inspired thousands of industrialist .. The man who created lakhs and lakhs of jobs for many generations ..The man who was loved and respected by all .. My deepest salutations to… pic.twitter.com/S3yG1G7QtK— Rajinikanth (@rajinikanth) October 10, 2024 -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుందంటే..!!
-
ఆ రెండు కార్ల ఖరీదే రూ.20 కోట్లు - అట్లుంటది అంబానీ ఫ్యామిలీ అంటే..
భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబమైన అంబానీ ఫ్యామిలీ దేశంలో ఖరీదైన అన్యదేశ కార్లను కలిగి ఉంది. గతంలో వీరు చాలా సందర్భాల్లో తమ లగ్జరీ కార్లలో కనిపించారు. తాజాగా మరో సారి ఇలాంటి సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. అంబానీ ఫ్యామిలీ ఓ గుడికి మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ కార్లలో వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, వారి కొడుకు అనంత్ అంబానీ బయటకు రావడం చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న మెర్సిడెస్ బెంజ్ ఎస్ 680 గార్డ్ గోల్డెన్ షేడ్‌లో కనిపిస్తోంది. మరోక బెంజ్ ఎస్ 680 కారు కలర్ స్పష్టంగా కనిపించడం లేదు, బహుశా ఇది మాట్టే సిల్వర్ షేడ్ పొందినట్లు తెలుస్తోంది. ఈ రెండు కార్లు అత్యాధునిక భద్రతలను పొందినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇన్ని రకాల లోన్స్ ఉన్నాయా - లిస్ట్ చూస్తే అవాక్కవుతారు! నిజానికి ముఖేష్ అంబానీకి కట్టుదిట్టమైన భద్రతలు కల్పించడంలో భాగంగా ఏ మెర్సిడెస్ బెంజ్ కార్లను చాలా పటిష్టంగా తయారు చేశారు. అంబానీకి కుటుంబానికి రక్షణ కవచంగా ఉపయోగపడే ఈ కార్లు దాదాపు 2 టన్నుల బరువు కలిగి ఉంటాయి. ఇవి 3.5 నుంచి 4 ఇంచెస్ మందం గల బుల్లెట్ ప్రూఫ్ మల్టీ-లేయర్ గ్లాస్, స్ప్లింటర్ రక్షణ కోసం పాలికార్బోనేట్ లేయర్ పొందాయి. ఈ సెడాన్‌లోని ఒక్కో డోర్ బరువు సుమారు 250 కేజీల వరకు ఉంటుంది. వీటి ఒక్కక్క ధర రూ. 10 కోట్లు వరకు ఉంటుందని అంచనా. -
రూ.20కోట్లు ఇవ్వకపోతే చంపుతామంటూ అంబానీకి ఈమెయిల్..నిందితుడు ఎవరంటే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని చంపుతామంటూ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తనకు రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తానని ఒక వ్యక్తి అంబానీని ఈమెయిల్ ద్వారా బెదిరించినట్లు చెప్పారు. "మీరు మాకు రూ.20 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే మిమ్మల్ని చంపుతాము. భారతదేశంలోనే అత్యుత్తమ షూటర్లు మా వద్ద ఉన్నారు" అని ఈమెయిల్ వచ్చినట్లు చెప్పారు. అయితే ఆ ఈమెయిల్ అక్టోబరు 27న షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి అకౌంట్ ద్వారా వచ్చినట్లు పోలీసులు ధ్రువపరిచారు. అంబానీ నివాసం యాంటిలియాలోని భద్రతా అధికారులు హత్య బెదిరింపుకు సంబంధించిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడంతో విచారణ ప్రారంభించారు. (ఇదీ చదవండి: 29.7 శాతం పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం) అంబానీ, అతని కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బెదిరిస్తూ అనామక కాల్స్ చేసినందుకు బిహార్‌కు చెందిన ఒక వ్యక్తిని ముంబై పోలీసులు గత ఏడాది అరెస్టు చేశారు. దక్షిణ ముంబైలోని అంబానీ కుటుంబ నివాసం 'యాంటిలియా'తో పాటు హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌ను పేల్చివేస్తానని ఆ వ్యక్తి కాల్ చేసి బెదిరించాడు. -
తల్లి పనిమనిషి, కూలీపనులు చేసిన కొడుకు.. ఇప్పుడు ముఖేష్ అంబానీకంటే..
'సక్సెస్'.. ఈ పదం రాసుకోవడానికి చిన్నగా ఉన్నా.. సాధించడానికి చాలా సమయం పడుతుంది. అహర్నిశలు అంకిత భావంతో పనిచేస్తేనే విజయం వరిస్తుంది. ఈ కోవకు చెందిన ఒక వ్యక్తి గురించి మనం ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. బెంగుళూరుకు చెందిన బిలియనీర్ బార్బర్ 'రమేష్ బాబు' అంటే ఈ రోజు అందరికి తెలుసు. ముఖేష్ అంబానీ కంటే కూడా ఎక్కువ కార్లను కలిగి ఉన్న ఈయన ప్రస్తుతం ధనవంతుల జాబితాలో ఒకరు. అయితే ఈయన బాల్యం కడలిలో మునిగిన నావలాంటిదని బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. చిన్నప్పుడే తండ్రి మరణం.. చిన్న తనంలోనే తండ్రిని కోల్పోవడంతో క్వారికున్న బార్బర్ షాప్ అక్కడితో ఆగింది. తల్లి పనిమనిషిగా చేరింది, రమేష్ బాబు తల్లికి సహాయంగా ఉండాలని కూలిపనులు చేసేవాడు. తండ్రి మరణంతో ఒక్కసారిగా కటిక పేదరికంలో పడిపోయారు. మూడు పూటల ఆహరం కోసం కూడా చాలా ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఆ తరువాత తండ్రి మార్గంలో నడవాలని నిర్ణయించుకుని మళ్ళీ బార్బర్ షాప్ ప్రారంభించాడు. తండ్రి బార్బర్ షాప్ ప్రారభించిన అతి తక్కువ కాలంలో వృద్ధిలోకి రావడం ప్రారంభమైంది. బార్బర్షాప్ను స్టైలిష్ హెయిర్ సెలూన్‌గా మార్చాడు. రమేష్ బాబుకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అంతే కాకుండా తన వ్యాపారాన్ని వివిధ మార్గాల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుని కార్లను అద్దెకివ్వాలని నిర్ణయించుకుని మొదటి మారుతి ఓమ్ని వ్యాన్ కొనుగోలు చేశారు. ట్రావెల్ కంపెనీ.. 1994లో ప్రారంభమైన ఈ బిజినెస్ ఆ తరువాత ట్రావెల్ కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం ఈయన వద్ద సుమారు 400కంటే ఎక్కువ కార్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో మెర్సిడెస్ ఈ క్లాస్ సెడాన్, బీఎండబ్ల్యూ, రోల్స్ రాయిస్ ఘోస్ట్, జాగ్వార్, మెర్సిడెస్ మేబ్యాక్ వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. రమేష్ బాబు కార్ రెంటల్ కంపెనీలో 300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం.. వందలాది ఉద్యోగులపై ఎఫెక్ట్! రమేష్ బాబు బిలినీయర్ అయినప్పటికీ తన మూలలను మాత్రం మరచిపోలేదు, దీంతో ఈయన అప్పుడప్పుడు సెలూన్‌కి చాలా సమయం వెచ్చిస్తాడు. మొత్తం మీద భారతదేశంలో బిలియనీర్లైన ముఖేష్ అంబానీ (సుమారు 168 కార్లు), గౌతమ్ అదానీ (10అల్ట్రా లగ్జరీ కార్లు) కంటే ఎక్కువ కార్లను కలిగిన సంపన్నుడిగా రికార్డ్ సృష్టించాడు. కాగా ప్రస్తుతం రమేష్ బాబు నికర ఆస్తుల విలువ రూ. 1200కోట్లు అని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. -
వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంలో విషాదం..నెత్తురోడుతూ హాహాకారాలు చేస్తూ
హర్యానా రాష్ట్రం, నూహ్ జిల్లా న్యూఢిల్లీ - ముంబై ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.190 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు యూటర్న్ తీసుకుంటున్న పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి రోల్స్ రాయిస్ కారు తునాతునకలైంది. అయితే, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న నగీనా పోలీస్‌స్టేషన్ అధికారులు విచారణ ప్రారంభించారు. విచారణలో రోడ్డు ప్రమాదానికి రోల్స్ రాయిల్స్ కారు ప్రముఖ వ్యాపార వేత్త, కుబేర్ గ్రూప్ అధినేత వికాస్ మాలు’దేనని గుర్తించారు. దీంతో వేలకోట్ల కుబేర్ గ్రూప్ సామ్రాజ్యంలో విషాదం అలుముకుంది. నెత్తురోడుతూ హాహాకారాలు చేస్తూ మితిమీరిన వేగంతో వికాస్ ప్రయాణిస్తున్న రోల్స్ రాయిస్ కారు యూటర్న్ తీసుకుంటున్న పెట్రోల్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో వికాస్‌తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయాపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు నెత్తురోడుతూ హాహాకారాలు చేస్తున్న క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ కారు ప్రమాదానికి సంబంధించిన వివరాల్ని నూహ్ ఎస్పీ నరేంద్ర బిజర్నియా మీడియాకు తెలిపారు. ట్యాంకర్లో ప్రయాణిస్తున్న డ్రైవర్, అతని అసిస్టెంట్ అక్కడికక్కడే మృతి చెందగా..మరో డ్రైవర్ అసిస్టెంట్ గౌతమ్ తీవ్ర గాయాల పాలయ్యాడు. వికాస్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రమాదంలో కారు డ్రైవర్ మినహా మిగిలిన ప్రయాణికులు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న నగీనా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలిపిన ఎస్పీ బిజర్నియా..వికాస్ మలు ఆరోగ్యం ఎలా ఉంది? ప్రమాదం జరిగే సమయంలో కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే వివరాలపై స్పందించారు. వికాస్ మాలు, అతని డ్రైవర్ గుర్గావ్ మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వికాస్‌కు ప్రమాదం లేదని అన్నారు. వైద్యులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. డిశ్చార్జ్ అనంతరం, రోల్స్ రాయిల్స్ కారు డ్రైవర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. అతివేగం కుబేర్ గ్రూప్ రోడ్డు ప్రమాదంపై ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. హైవేపై పెట్రోల్ ట్యాంకర్ యూటర్న్ తీసుకున్న సమయంలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు అతివేగతంతో ప్రయాణిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. శాస్త్రీయ పరీక్షల తర్వాతే కారు కచ్చితమైన స్పీడ్‌కు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. హర్యానాలోని ఉజినాలోని తన ఇంట్లో గాయాల నుంచి కోలుకుంటున్న ట్యాంకర్లో మూడో వ్యక్తి గౌతమ్ మాట్లాడుతూ.. ట్రక్కు యు టర్న్ తీసుకుంటుండగా రోల్స్ రాయిస్ ఢీ కొట్టిందని డ్రైవర్, అసిస్టెంట్ పక్కనే కూర్చున్న గౌతమ్ తెలిపారు. ఫాంటమ్ వేగం గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని అన్నారు. తమ ట్యాంకర్‌ను ఢీకొట్టిన తర్వాత బోల్తా పడింది. కారు డ్రైవర్‌దే తప్పని ఆయన పేర్కొన్నారు. వికాస్ ఆరోగ్యంపై స్పష్టత వచ్చేది అప్పుడే రోడ్డు ప్రమాదం తీవ్రత కారు తీరును చూస్తే అర్ధమవుతుంది. రూ.10 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఈ కారు ట్రక్‌ను ఢీకొట్టిన వెంటనే దాని ముందు భాగం ధ్వంసమైంది. ఇంజిన్ కాలిపోయి డోర్లు తెరుచుకున్నాయి. మంటలు వ్యాప్తించిన తర్వాత మెటల్ మాత్రమే మిగిలి పోయి ట్రక్కు పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఘోర రోడ్డు ప్రమాదంపై కుబేర్ గ్రూప్ పూర్తి వివరాల్సి అందించాల్సి ఉంటుంది. అదే జరిగితే వికాస్ మాలు ఆరోగ్యంపై స్పష్టత రానుంది. -
ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం!
Mukesh Ambani Salary Details: భారతదేశంలో అత్యంత సంపన్నుడెవరు అంటే అందరూ ఏకకంఠంతో చెప్పే మాట 'ముఖేష్ అంబానీ' (Mukhes Ambani) అని, కావున ఇందులో ప్రస్తుతానికి ఎటువంటి సందేహం లేదు. అయితే ఈయన వార్షిక వేతనం ఎంత? ఇతర సౌకర్యాలు ఏవి ఉంటాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రిలయన్స్ సంస్థకు చైర్మన్‌గా కొనసాగుతున్న 'ముఖేష్ అంబానీ' పదవీకాలం మరో ఐదేళ్లు కొనసాగటానికి వాటాదార్ల ఆమోదం కోరుతున్నట్లు సమాచారం. నిజానికి 224 ఏప్రిల్ 19 నాటికి ఆయన పదవి కాలం పూర్తవుతుంది. మరో ఐదేళ్లు పొడిగిస్తే పదవి 2029 వరకు కొనసాగుతుంది. ఆరు పదుల వయసులో కూడా అపర చాణక్యుడుగా కంపెనీ అభివృద్ధికి పాటుపడుతున్న ఈయన 2022లో ధీరూభాయ్ అంబానీ మరణానంతరం చైర్మన్ పదవి పొందారు. ఇప్పటి వరకు అది అలాగే కొనసాగుతూ ఉంది. 2022 నుంచి ఎన్నోన్నో కొత్త ఆలోచనలతో కంపెనీని అత్యన్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. ఈ కారణంగా మరో ఐదేళ్లు కంపెనీకి చైర్మన్‌గా నిర్వర్తించనున్నారు. అయితే ఈ సమయంలో ఆయన వార్షిక వేతనం శూన్యం అని తెలుస్తోంది. అంటే మరో ఐదేళ్ల కాలం పాటు ఆయన జీతం సున్నా రూపాయలు. ఇదీ చదవండి: సీఎం చేతుల మీదుగా గోల్డ్ మెడల్.. టాటా కంపెనీలో అది ఈమెవల్లే సాధ్యమైంది! 2019-20 వరకు వార్షిక వేతనం.. నివేదికల ప్రకారం, 2008-09 నుంచి 2019-20 వరకు ముఖేష్ అంబానీ వేతనం రూ. 15 కోట్లు ఉండేది, ఆ తరువాత కరోనా మహమ్మారి సమయంలో జీతం తీసుకోవడం పూర్తిగా మానేసాడు. అందులోనూ 2021లో అయన ఏ మాత్రం జీతం తీసుకోకపోవడం గమనార్హం. జీతం మాత్రమే కాకుండా 2021 నుంచి 2023 వరకు ఎలాంటి అలవెన్సులు తీసుకోలేదని తెలుస్తోంది. ఆ తరువాత శాలరీ అస్సలు తీసుకోనని బోర్డుకి రిక్వెస్ట్ చేసినట్లు.. అదే ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఎంతమంది ఉద్యోగాలు పోయినా వీరు చాలా సేఫ్.. జీతాలు కోట్లలో! ఇతర అలవెన్సులు.. దిగ్గజ కంపెనీ అయిన రిలయన్స్ సంస్థకు అధినేతగా ఉన్నా.. జీతం తీసుకోకున్నా. ఆయనకు కొన్ని ప్రత్యేకమైన అలవెన్సులు ఉంటాయి. ఇందులో ట్రావెలింగ్, బిజినెస్ ట్రిప్స్, ఫోన్ బిల్స్ వంటి వాటితో పాటు తన కుటుంబానికి అయ్యే భద్రతా ఖర్చు కూడా కంపెనీ భరించనుంది. -
పాక్‌లో ముగ్గురు హిందూ బాలికల కిడ్నాప్
కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హిందూ వ్యాపారి ముగ్గురు కూతుళ్లను కిడ్నాప్ చేసి, బలవంతంగా మతం మార్చి ముగ్గురు యువకులు వారిని పెళ్లిళ్లు చేసుకున్నారు. పాకిస్తాన్ దరేవార్ ఇతేహాత్ సంస్థ చీఫ్ శివ కచ్చి ఈ విషయం తెలిపారు. ధార్కి ప్రాంతానికి చెందిన హిందూ వ్యాపారి లీలా రామ్ ముగ్గురు కూతుళ్లు చాందిని, రోష్ని, పరమేశ్ కుమారిలను కొందరు అపహరించుకుపోయారు. బలవంతంగా ఇస్లాంలోకి మార్చి అపహరించిన ముగ్గురు ముస్లింలు వారిని పెళ్లిళ్లు చేసుకున్నారని శివ కచ్చి చెప్పారు. -
ఆనంద్ మహీంద్రా గురించి ఆసక్తికర విషయాలు - డోంట్ మిస్!
పరిచయం అవసరం లేని పేర్లలో 'ఆనంద్ మహీంద్రా' ఒకటి. భారతదేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తల జాబితాలో ఒకరుగా నిలిచి, ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలిస్తూ ఉండే ఆనంద్ మహీంద్రా గురించి దాదాపు అందరికి తెలుసు. అయితే ఈ రోజు ఆనంద్ మహీంద్రా జన్మదినం సందర్భంగా ఆయన గురించి చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి. 1955 మే 1న ముంబైలో హరీష్ మహీంద్రా, ఇందిరా మహీంద్రా దంపతులకు జన్మించారు. పారిశ్రామిక నేపథ్యం ఉన్న కుటుంభంలో జన్మించినప్పటికీ ఎప్పుడూ అతని కుటుంభ సభ్యులు వ్యాపార రంగానికి రావాలని బలవంతం చేయలేదు. కాబట్టి చిన్న తనంలో సినిమా ప్రొడ్యూసర్ కావాలని కలలు కనేవాడని చెబుతారు. పాఠశాల విద్యను లారెన్స్ స్కూల్లో, ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కోర్సులను హార్వర్డ్ యూనివర్సిటీలో, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో MBA పూర్తి చేశారు 1981లో ఇండియాకి తిరిగి వచ్చారు. చదువు పూర్తయిన తరువాత ఆనంద్ మహీంద్రా ఉజిన్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ (ముస్కో)లో ఫైనాన్స్ డైరెక్టర్‌కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా చేరి వ్యాపారాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్లాడు. అయితే ఆ సమయంలో 1991లో సమ్మెలతో అట్టుడికిపోతున్న కండివాలీ ఫ్యాక్టరీ బాధ్యతలను చేప్పట్టవలసి వచ్చింది. కండివాలీ ఫ్యాక్టరీలో కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలు చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో కూడా ఎంతో నేర్పుగా ప్రవర్తించి ఆనంద్ మహీంద్రా ఆ సమస్యలను దూరం చేసి కార్మికులను శాంతింపజేశారు. ఇది ఆయన సాధించిన విజయాల్లో ప్రధానమైనదని చెప్పాలి. అప్పట్లో ఆటోమొబైల్ రంగంలో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న భారతీయ కంపెనీలు వాహనాల తయారీకి ఎక్కువగా విదేశీ కంపెనీల మీద ఆధారపడవలసి వచ్చేది. కానీ ఆ సమయంలో ఫోర్డ్ కంపెనీతో కలిసి ఎస్కార్ట్ కారుని మార్కెట్లోకి పరిచయం చేశారు. కానీ ఇది ఆనంద్ మహీంద్రాకు ఆశించిన విజయాన్ని తీసుకురాలేకపోయింది. అయినా వెనుకడుగేయకుండా 300 మంది ఇంజినీర్లు, ఇతర సభ్యులతో ఒక టీమ్ తయారు చేసి ఒక ప్యాసింజర్ వెహికల్ తయారు చేయడానికి పూనుకున్నారు. ఆనంద్ మహీంద్రా తయారు చేసిన ఈ టీమ్ అహర్నిశలు కస్టపడి మహీంద్రా స్కార్పియో కారుని భారతదేశంలో విడుదల చేసి గొప్ప విజయాన్ని తీసుకువచ్చింది. అప్పటి నుంచి ఆటోమొబైల్ రంగంపై ఆనంద్ మహీంద్రా మంచి పట్టుని సంపాదించాడు. మహీంద్రా స్కార్పియో కారు కేవలం భారత దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో కూడా మంచి ఆదరణ పొందింది. మహీంద్రా స్కార్పియోతో ఆశించిన స్థాయికంటే గొప్ప సక్సెస్ రుచి చూసిన ఆనంద్ మహీంద్రా స్వరాజ్ ట్రాక్టర్స్, పంజాబ్ ట్రాక్టర్స్ వంటి వాటిని కొనుగోలు చేసి మహీంద్రా గ్రూపుని ఎంతగానో విస్తరించాడు. ఇప్పుడు మహీంద్రా ట్రాక్టర్లు ప్రపంచంలో అత్యధిక ప్రహజాదరణ పొంది అమ్మకాల పరంగా ముందంజలో ఉన్నాయి. (ఇదీ చదవండి: ఇంటర్లో తక్కువ మార్కులొచ్చాయని ఇల్లు అద్దెకివ్వని ఓనర్.. ఎక్కడో తెలుసా?) ఆనంద్ మహీంద్రా ప్రముఖ పాత్రికేయరాలైన అనురాధను వివాహం చేసుకున్నారు. ఈమె 'వెర్వ్' అండ్ 'మ్యాన్స్ వరల్డ్' పత్రికలకు సంపాదకురాలు. అంతేకాకుండా ఆమె 'ది ఇండియన్ క్వార్టర్లీ' మ్యాగజైన్ పబ్లిషర్‌గా కూడా పనిచేశారు. వీరికి దివ్య మహీంద్రా, అలిక మహీంద్రా అనే ఇద్డు కుమార్తెలున్నారు. వ్యారరంగంలో మాత్రమే కాకుండా గొప్ప సేవాదృక్పథం ఉన్న ఆనంద్ మహీంద్రా 1996లో భారతదేశంలోని నిరుపేద బాలికల విద్యకు మద్దతు ఇచ్చే నాన్హి కాళీ ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించాడు. 2017 వరకు ఈ ట్రస్ట్ సుమారు 1,30,000 మంది బాలికల విద్యకు దోహదపడింది. అంతే కాకూండా భారతదేశ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కృషి చేసే ట్రస్ట్ నాంది ఫౌండేషన్ డైరెక్టర్ బోర్డులలో ఒకరుగా ఉన్నారు. (ఇదీ చదవండి: ఎగిరే కారు వచ్చేసిందండోయ్! రూ. 6.5 లక్షలతో ఇంటికి తీసుకెళ్లొచ్చు..) 2016లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆనంద్ మహీంద్రాని ఎన్నో అవార్డులు సైతం వరించాయి. భారత ప్రభుత్వం 2020లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును అందించింది. అంతకంటే ముందు 2012లో యుఎస్ బిజినెస్ కౌన్సిల్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డును, 2016లో బ్లూమ్‌బెర్గ్ టీవీ ఇండియా ద్వారా డిస్ట్రప్టర్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు వంటి ఎన్నో అవార్డులను అందుకున్నాడు. (ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్‌లో ఇవి గమనించారా? లేకుంటే పేలిపోతాయ్..) పారిశ్రామిక రంగానికి వన్నె తెచ్చిన ఆనంద్ మహీంద్రాకు కార్లంటే ఇష్టమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కావున ఈయన గ్యారేజిలో ఇప్పటికే మహీంద్రా బొలెరో ఇన్వాడర్, టియువి300, టియువి300 ప్లస్, మహీంద్రా స్కార్పియో, ఆల్టురాస్ జి4, స్కార్పియో ఎన్ మొదలైన కార్లు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
పోలీస్టేషన్‌కు చెత్త పంచాయితీ..పారిశుధ్య కార్మికులపై తుపాకీ ఎక్కుపెట్టి..
చెత్త విషయంలో తలెత్తిన వివాదం కాస్త పోలిస్టేష్టన్లో ఫిర్యాదు చేసేంత వరకు వెళ్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త, పెట్రోల్ పంప్ యజమాని మహేష్ పటేల్‌కి పారిశుధ్య కార్మికులకు మధ్య చెత్త విషయమై వివాదం తలెత్తింది. అతడి ఇంటి వద్ద చెత్తను సేకరిస్తున్నప్పుడూ ఈ ఘటన చోటు చేసుకుంది. పటేల్ భార్య పొడి, తడి చెత్తను వేరు చేయనందున గొడవ జరిగింది. దీంతో ఆమె భర్త పటేల్, అతడి కుమారుడు పారిశుధ్య కార్మికులతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఆ మహేష్ లోపలి నుంచి తుపాకీ తీసుకుని వచ్చి బెదిరింపులకు గురిచేశాడు. దీంతో అక్కడ నుంచి పారిశుధ్య కార్మికులు ఒక్కసారిగా పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారి సంఘటనా స్థలానికి చేరకుని ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదర్చారు కూడా. గానీ చెత్త వ్యాన్లను నడుపుతున్న డ్రైవర్ల సంఘం సభ్యులు బెదిరింపులకు గురైన పారిశుధ్య కార్మికులతో కలిపి పోలీసులను ఆశ్రయించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ వ్యాపారి బీజేపీ మాజీ శాసనసభ్యుడు మనోజ్ పటేల్ బంధువు కావడంతోనే పోలీసులు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోలేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐతే అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో స్పందించిన పోలీసు అధికారి ఆశిష్ మిశ్రా ఆ ఘటనపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముందుగా అక్కడ అసలేం జరిగిందే నిర్థారించడానికి ఫిర్యాదుదారుణ్ణి సంప్రదించి తదుపరి దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు. (చదవండి: పులి భయంతో హడలిపోతున్న గ్రామాలు..దెబ్బకు కర్ఫ్యూ, పాఠశాలలు మూసివేత) -
Pawan Munjal: తిరుగులేని సీఈఓ, 40కి పైగా దేశాల్లో
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచములోని చాలా దేశాల్లో తన ఉనికిని చాటుకుంటోంది. ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను విడుదల చేస్తూ తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తోంది. కంపెనీ ఈ స్థాయిలో ఉందంటే దానికి ప్రధాన కారణం దాని వెనుకుండి నడిపిస్తున్న ఎందరో కార్మికులు. ప్రపంచంలో అతి పెద్ద టూ వీలర్ తయారీ సంస్థగా కీర్తి గడించిన హీరో మోటోకార్ప్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'పవన్ ముంజాల్' నేతృత్వంలో ఇప్పుడు ముందుకు సాగుతోంది. బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ స్థాపించిన ఈ సంస్థ ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది. 2022 డిసెంబర్ 10 నాటికి పవన్ ముంజాల్, వారి కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ 3.55 బిలియన్ డాలర్లు. 2011లో హీరో కంపెనీ హోండా నుంచి విడిపోయిన తరువాత పవన్ ముంజాల్ ముందుండి నడిపించి ప్రపంచ దేశాలకు విస్తరించడంతో గొప్ప కృషి చేశారు. కంపెనీ తన ద్విచక్ర వాహనాలను ఆసియా, ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికా వంటి 40కి పైగా దేశాల్లో విక్రయిస్తోంది. (ఇదీ చదవండి: SBI: మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి.. బ్యాంకుకి వెళ్లకుండా!) ఇప్పటికి పవన్ ముంజాల్ నేతృత్వంలో భారతదేశంలో ఆరు సహా ఎనిమిది తయారీ కేంద్రాలు ఉన్నాయి. అంతే కాకుండా ఆయన హీరో ఇన్వెస్ట్‌కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్ లిమిటెడ్, బహదూర్ చంద్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో కూడా ఒకరుగా ఉన్నారు. హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహన రంగంలో నిలదొక్కుకోవడానికి, 2022 అక్టోబర్‌లో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'విడా' విడుదల చేసింది. ఈ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. కంపెనీ మరిన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది. -
భార్య కోసం రూ. 7 కోట్లు విలువ చేసే గుడి
షాజహాన్ ముంతాజ్ ప్రేమ కోసం తాజ్‌మహల్ కట్టిన సంగతి అందరికీ తెలుసు. పైగా అది టూరిస్టులను ఎక్కువగా ఆకర్షించే ప్రదేశంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా నిలిచింది కూడా. దీని గురించి మనం చరిత్రలో చదివి తెలుసుకున్నాం. వాస్తవానికి నిజ జీవితంలో అలాంటివి జరగడం దాదాపుగా అసాధ్యం. కానీ ఇక్కడొక వ్యక్తి అచ్చం షాజహాన్ మాదిరిగా అత్యంత ఖరీదైన గుడి కట్టి తన భార్య మీద ప్రేమను చాటుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలోని ఓ వ్యక్తి తన భార్య మీద ప్రేమతో సుమారు రూ. 7 కోట్లు విలువ చేసే గుడి కట్టాడు. ఇది కూడా తాజ్‌మహల్ మాదిరిగానే అందంగా ఉంది. అతని పేరు ఖేత్రవాసి లెంక, వ్యాపారవేత్త. అతని భార్య బైజంతి. ఆమె సంతోషి మాత భక్తురాలు. వారికి 1992లో వివాహమైంది. పెళ్లయ్యాక ఈ గ్రామంలో సంతోషి మాతకి చిన్న గుడి కట్టాలని అనుకున్నట్లు తెలిపారు. ఐతే ఇక్కడ ఉన్న నివాసితులు కూడా ఊహించొండరు ఇక్కడ ఉన్న చిన్న సంతోషిమాత ఆలయం కాస్త ఇంత పెద్దగ ఆలయంగా మారిపోతుందని అంటున్నారు ఆ దంపతులు. ఈ గుడి కట్టడంతో తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ ప్రతిష్టించిన అమ్మవారు ఈ గ్రామంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల పూజించి సంతోషి మాత ఆశీస్సులు పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. తన భర్త తన కోసమే కాకుండా గ్రామస్తులందరీ కోసం ఇంత పెద్ద గుడి కట్టారని చెబుతోంది. ప్రస్తుతం బైజంతి తన భర్తతో కలిసి హైదరాబాద్‌లో ఉంటుంది. తాను ఈ గ్రామంలో సంతోషిమా ఆలయాన్ని నిర్మించాలనుకున్నానను, ఐతే నాభర్త నా కోరికను తీర్చాలనుకున్నాడు కాబట్టే ఇది సాధ్యమైందని అని చెప్పింది బైజంతి. తాను 2008లో ఈ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించగా.. ఇప్పటికీ ఈ ఆలయం పూర్తి స్థాయిలో సిద్ధమైందని ఖేత్రవాసి లెంక చెబుతున్నారు. ఈ ఆలయం దక్షిణ భారత శైలిలో నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు చెన్నై నుంచి కళాకారులంతా వచ్చారని బైజంతి చెప్పుకొచ్చారు. (చదవండి: టాయిలెట్లో రూ.2 కోట్లు విలువ చేసే బంగారు కడ్డీలు) -
వీడియో కాల్‌తో ట్రాప్..ఏకంగా ఢిల్లీ హైకోర్టు పేరుతో రూ.2.69 కోట్లు..
గుజరాత్ వ్యాపారవేత్తని ఒక మహిళ మాయమాటలతో ఉచ్చులోకి దింపి ఏకంగా రూ.2.69 కోట్లు కొల్లగొట్టింది. బలవంతంగా వీడియోకాల్స్ మాట్లాడించి ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌కి పాల్పడి, కేసుల పేరుతో భయబ్రాంతులకు గురిచేసి పలు దఫాలుగా డబ్బులు కొల్లగట్టారు. చివరికి బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి, సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకెళ్తే..పునరుత్పాదక ఇంధన సంస్థను నడుపుతున్న ఒక పారిశ్రమాకవేత్తకి గతేడాది ఆగస్టు8న రియా శర్మ అనే మహిళ నుంచి కాల్ వచ్చింది. ఆ తర్వాత ఆమె తన మాయమాటలతో ఆ వ్యక్తిని బట్టలు లేకండ వీడియో కాల్ మాట్లాడేలా చేసింది. ఆ తర్వాత అనుహ్యంగా ఫోన్ కాల్ కట్ అయ్యింది. కాసేపటికి ఆ వ్యాపారవేత్తని మీ నగ్న వీడియో సర్యూలేట్ కాకుండా ఉండాలంటే రూ. 50 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరికొన్ని రోజుల తర్వాత ఢిల్లీ పోలీసు ఇన్స్పెక్టర్ గుడ్డుశర్మ అనే పేరుతో ఓ వ్యక్తి కాల్ చేసి ఏకంగా ఆ వీడియో క్లిప్ తన వద్ద ఉందని పేర్కొంటూ ఏకంగా రూ. 3 లక్షలు దోచేశాడు. సరిగ్గా ఆగస్టు14న మరో కాల్లో.. మీరు వీడియోకాల్ మాట్లాడిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, ఆమె తల్లి మీపై కేసు పెట్టిందుకు సీబీఐని అశ్రయించందంటూ బాంబుపేల్చారు. ఈసారి ఏకంగా రూ. 80 లక్షలు డిమాండ్ చేశారు. సదరు బాధితుడు కేసు అనేసరికి బెంబేలెత్తి...ఎంత డబ్బైనా చెల్లించి ఈ కేసు నుంచి బయటపడాని అనుకున్నాడు. ఆ దుండగలు ఫేక్ ఢిల్లీ హైకోర్టు పేరుతో డిసెంబర్ 15 వరకు బాధితుడు నుంచి డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. చివరి కేసు క్లోజ్ అయ్యిందంటూ ఒక ఉత్తర్వు చేతిలో పెట్టారు. అప్పుడు ఆ ఉత్తర్వు చూడగానే అనుమానం తలెత్తి సైబర్ క్రైంని ఆశ్రయించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బాధితుడు జనవరి 10న సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి, దాదాపు 11 మందిపై కేసు పెట్టాడ. అంతేగాదు తన నుంచి సుమారు రూ. 2.69 కోట్లు దోపిడీ చేసినట్లు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: అయ్యో తల్లీ.. ఎంత పని చేశావ్? ) -
టిక్‌టాక్‌కు భారీ షాక్.. యాప్‌పై అమెరికా ప్రభుత్వం నిషేధం!
భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో టిక్ టాక్‌ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నిషేధం దేశ మొత్తం కాకుండా కేవలం అమెరికా ప్రభుత్వ డివైజ్‌లలో వినియోగించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించి మార్గదర్శకాల్ని విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు టిక్ వినియోగించే అవకాశం కోల్పోనున్నారు. చైనా దేశం బైట్ డ్యాన్స్ సంస్థకు చెందిన టిక్‌టాక్ వినియోగడంతో సెక్యూరిటీ సమస్యలు ఉత్పన్నమవుతాయని అమెరికా ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా అమెరికా కాంగ్రెస్‌లో హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ (ప్రతినిధుల సభ) టిక్ టాక్‌ను వినియోగించకుండా నిషేధం విధిస్తూ హౌస్ చీఫ్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (సీఏఓ) చట్టసభ సభ్యులు, ఇతర సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు టిక్ టాక్‌ను వినియోగించేందుకు అనువుగా ఉండే అన్నీ డివైజ్‌లలో యాప్‌ను డిలీట్ చేయాలని కోరారు. ఇప్పటికే గత వారం టిక్ టాక్ యాప్ సాయంతో అమెరికన్లు, ఇతర అంతర్గత సమాచారాన్ని ట్రాక్ చేస్తుందని 19 రాష్ట్ర ప్రభుత్వాలు..గవర్నమెంట్‌కు చెందిన డివైజ్‌లలో మాత్రమే యాప్‌ను వినియోగించకుండా తాత్కాలికంగా బ్లాక్ చేశాయి. జో బైడెన్ సంతకంతో కొద్ది రోజుల క్రితం అమెరికా ప్రభుత్వం సెప్టెంబర్ 30, 2023 వరకు ఫెడరల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ విభాగాల నిర్వహణకోసం 1.66 ట్రిలియన్ డాలర్ల నిధుల విడుదల చేసేందుకు ఆమోదించింది. దీంతో పాటు టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. సంబంధిత ఫైల్స్ మీద దేశాధ్యక్షుడు జోబైడెన్ సంతకం చేస్తే.. నిషేధం వెంటనే అమల్లోకి రానుంది. అమెరికాలో యాప్‌ను నిషేధించాలని యాప్ వాడకుండా దేశవ్యాప్తంగా నిషేధాన్ని అమలు చేయాలని యూఎస్ చట్టసభ సభ్యులు ప్రతిపాదన తెచ్చారు. కానీ జోబైడెన్ ప్రభుత్వం కేవలం హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్, వారి శాఖలకు చెందిన ఉద్యోగులు టిక్‌టాక్ వినియోగంపై ఆంక్షలు విధించింది. కాగా, అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టిక్ టాక్ యాజమాన్యం బైట్‌డ్యాన్స్ స్పందించలేదు చదవండి👉 ‘నాతో గేమ్స్ ఆడొద్దు’..!, ట్విటర్ ఉద్యోగులకు ఎలాన్ మస్క్ వార్నింగ్! -
కొడుకు హత్యకు తండ్రి సుపారీ
సాక్షి, హుబ్లీ: నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారి భరత్ జైన్ కుమారుడు అఖిల్జైన్ మిస్సింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. సాక్షాత్తూ తండ్రే కిరాయి హంతకులతో ఒప్పందం చేసుకొని కుమారున్ని హత్య చేయాలని సుపారీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 1న మిస్సింగ్ అని ఫిర్యాదు వివరాలు.. అఖిల్ జైన్ ఈ నెల 1 నుంచి కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు కేశ్వాపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అఖిల్ గురించి ఆరా తీశారు. రకరకాల దురలవాట్లకు బానిసైన అఖిల్ గురించి ఇంట్లో వారు ఎంతో మనోవేదనకు గురైనట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ క్రమంలో అఖిల్‌తో పాటు కుటుంబ సభ్యల ఫోన్ కాల్స్‌ను పరిశీలించగా కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. అఖిల్ తండ్రి భరత్ కొందరు ప్రముఖ రౌడీలకు అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. అఖిల్ మిస్సింగ్ ముందు అతని తండ్రి రౌడీలతో తరచూ మాట్లాడాడు. భరత్ జైన్‌ను పిలిచి విచారించగా అసలు విషయం తెలిసింది. కుమారుడిని తానే రౌడీలకు చెప్పి హత్య చేయించానని భరత్ జైన్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు. మృతదేహం దొరకనందున పోలీసులు ఇంకా ధ్రువీకరించడం లేదు. అఖిల్ హతమై ఉంటాడని అనుమానంతో దేవరగుడిహళిలోని భరత్‌జైన్ ఫాంహౌస్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో శవం కోసం పోలీసులు గాలిస్తున్నారు. కిరాయి హంతకులు దొరికితే మిస్టరీ వీడనుంది. (చదవండి: కాళ్లు పట్టుకున్నా.. అన్నని వదల్లేదు.. భార్యతో సంబంధం పెట్టుకున్నాడంటూ..) -
శ్రీమంతుడు 2.0: రూ.24 వేల కోట్ల కంపెనీని విరాళంగా ఇచ్చాడు!
ప్రకృతి ప్రజలకు అవసరమైనవన్నీ ఇస్తుంది. అయితే కొందరు తమ స్వార్థం కోసం భూమిపై ఉన్న వనరులను వాడుకుంటూ అదే ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఇప్పటికే పర్యావరణం ప్రమాదంలో ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణ కొందరు ముందడుగు వేసి తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా యూఎస్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన వేల కోట్ల కంపెనీని లాభాపేక్ష లేని ఓ ట్రస్ట్‌కి విరాళంగా ఇచ్చేశాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. వివరాల్లోకి వెళితే.. యూఎస్‌కు చెందిన వ్యాపారవేత్త యోవోన్ చుయ్‌నార్డ్ తన కంపెనీ ‘పెటగోనియో’ని పర్యావరణ పరిరక్షణకై లాభాపేక్షలేని సంస్థకు విరాళంగా ఇచ్చాడు. ఇకపై ఈ కంపెనీ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం వాతావరణ మార్పులు, జీవ వైవిధ్యం,అటవీ భూములు సంరక్షణకు పాటుపడే సంస్థలకు అందజేయనున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని అతని భార్యాపిల్లలు కూడా మద్దతునిచ్చారు. ఆయన దీనిపై స్పందిస్తూ.. ప్రకృతి అందిస్తున్న వనరులను ఉపయోగించుకుంటూ వాటిని నగదు రూపంలో మార్చుకుంటున్నాం. ఇకపై పెటాగోనియో తన సంపాదనను తిరిగి ప్రకృతికే అందిస్తుందన్నారు. పెటాగోనియో ప్రతి సంవత్సరం సుమారు 1 బిలియన్ డాలర్ల విలువైన జాకెట్లు, స్కై ప్యాంట్లను అమ్మకాలు జరుపుతోంది. కాగా అవుట్డోర్ ఫ్యాషన్ సంస్థగా పెటగోనియాను 50 ఏళ్ల కిందట ప్రారంభించారు. చదవండి: దూసుకుపోతున్న రిలయన్స్ జియో.. జూలైలోనూ జోరు తగ్గలే! -
కేజీఎఫ్ కోటలో కలకలం
బనశంకరి: వందలాది కోట్ల రూపాయలను అక్రమంగా బదిలీ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ నేత, పారిశ్రామికవేత్త కేజీఎఫ్ బాబుపై ఐటీ, ఈడీ సోదాలు దాడులు చేశాయి. బెంగళూరు వసంతనగరలోని రుక్సానా ప్యాలెస్, ఉమ్రా డెవలపర్స్, ఉమ్రా రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఏకకాలంలో దాడులు చేసిన ఐటీ, ఈడీ అధికారులు ముఖ్యమైన ఫైళ్లు, రికార్డులను, బ్యాంకు లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కేజీఎఫ్ బాబు పలు చోట్ల వందలాది కోట్ల విలువచేసే భూములు, స్థలాలు, అపార్టుమెంట్లు, భవనాలు కలిగి ఉన్న పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. కుటుంబసభ్యుల అకౌంట్లలో భారీగా నగదు మొదటి భార్య రుక్సానా, కుమారుడు అఫ్ఘాన్‌తో పాటు కుటుంబసభ్యుల పేర్లతో ఉన్న మొత్తం 23 బ్యాంకు అకౌంట్లు కలిగి ఉన్నారు. కేజీఎఫ్ బాబు తన పేరుతో 12 బ్యాంకు అకౌంట్లు తెరిచారు. కుటుంబసభ్యుల అకౌంట్లలో రూ.70 కోట్లకు పైగా నగదు ఉన్నట్లు తనిఖీలో తెలిసింది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు చెందిన విలాసవంతమైన రూ.6 కోట్ల విలువచేసే రోల్స్‌రాయ్స్ కారును కేజీఎఫ్ బాబు ఒక మధ్యవర్తి ద్వారా కొనుగోలు చేశారు. గత ఏడాది ఆగస్టులో యుబీ సిటీ వద్ద కారును ఆర్టీఓ అధికారులు సరైన పత్రాలు లేవని సీజ్ చేశారు. ఈడీ సమన్లు జారీ ఉమ్రా డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా వందలాది కోట్ల నగదు లావాదేవీల గురించి ఈడీ అధికారులకు ఒకనెల క్రితమే సమాచారం అందింది. విచారణకు రావాలని కేజీఎఫ్ బాబుకు ఈడీ సమన్లు జారీచేసింది. మైసూరులో కేజీఎఫ్ బాబు బంధువు రెహమాన్‌ఖాన్ ఇంటిలోనూ సోదాలు సాగాయి. మరికొన్ని రోజులు సోదాలు కొనసాగే అవకాశముంది. (చదవండి: KGF Babu: ‘కేజీఎఫ్ బాబు’కు ఐటీ షాక్ ) -
టీడీఎస్ విషయంలో వ్యాపారస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
గత వారం వేతన జీవులకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం. ఈ వారం వ్యాపారస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం దేశంలో మళ్లీ కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో రిటర్నులు దాఖలు చేయడానికి గడువు తేదీలు పొడిగించవచ్చు. అయితే, దాన్నలా ఉంచితే.. మీరు ముందుగా అవగాహన పెంచుకోవాల్సిన విషయాలు గురించి తెలుసుకుందాం. మీ ఆదాయానికి సంబంధించి 1-4-2020 నుంచి 31-3-2021 అంటే 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను త్వరలోనే 26ఏఎస్ వస్తుంది. అది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఫారంని డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. ఈ ఫారంలోని అంశాల్లో మీకు వచ్చి న అన్ని ఆదాయాలకు సంబంధించిన టీడీఎస్ వివరాలు ఉంటాయి. వ్యాపారం/వృత్తి రీత్యా వచ్చిన ఆదాయం, దాని మీద టీడీఎస్, ఇంటి అద్దె రూపేణా అందే ఆదాయం మీద టీడీఎస్, వడ్డీ మొదలైన ఇతర ఆదాయాల మీద టీడీఎస్, అలాగే క్యాపిటల్ గెయిన్స్ మీద టీడీఎస్ వంటివన్నీ ఇందులో ఉంటాయి. అయితే టీడీఎస్ జమలు రాకపోతే, అందులో పొందుపర్చకపోతే గాభరా పడక్కర్లేదు. మే/జూన్ లోపల అన్నీ ఎంట్రీలు నమోదవుతాయి. అప్పటిదాకా ఆగండి. ఈ టీడీఎస్ వలన మీ మీద పూర్తి ఆదాయపు పన్ను భారం పడకపోవచ్చు. వ్యాపారం విషయంలో నికర లాభం లెక్కించాలి. స్థూల లాభం మీద టీడీఎస్ వర్తింపచేస్తే .. పన్ను భారం మాత్రం నికర లాభం మీద ఉంటుంది. వ్యాపారస్తులు మరో విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జీఎస్టీ పరిధిలోకి వచ్చే వారు గమనించాల్సిన విషయం ఏమిటంటే జీఎస్ టీ రిటర్నుల్లో.. టర్నోవరు వివరాలను కూడా పొందుపర్చాల్సి ఉంటోంది. ఇది ఇన్‌కం ట్యాక్స్ రిటర్నుల్లో పొందుపర్చిన వివరాలకు సరిపోలి ఉండాలి. ఎందుకంటే ఈ రెండింటినీ పోల్చి చూస్తారు. తేడా వస్తే ఆరా తీస్తారు. బ్యాంకు ఖాతాల్లో జమకి, టర్నోవరుకి సంబంధ లేకపోయినా ఆ డిపాజిట్లతో కూడా సరిపోల్చి చూసుకోండి. ఇటువంటి విశ్లేషణల కోసం వృత్తి నిపుణుల సహాయం తీసుకోండి. బ్యాంకు జమల్లో వ్యాపారపరమైనవి కావచ్చు, వ్యక్తిగతమైనవి కావచ్చు, అప్పులు కావచ్చు.. ఆదాయాలు కావచ్చు.. ప్రతీ జమని సమర్థించుకోగలిగేలా కాగితాలు ఉండాలి. ఇంచుమించు ఇదే పద్ధతిలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి కూడా ప్రణాళికలు వేసుకోండి. ముందు చూపుతో వ్యవహరించడం, సకాలంలో పనులు పూర్తి చేసుకోవడం, చట్టరీత్యా బాధ్యతలు నిర్వర్తించడం .. ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్త వహించండి. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు చదవండి: వేతన జీవులూ.. జర జాగ్రత్త! -
ప్రతి నిమిషం అడిగింది నీ విజయం
ఈరోజు ఆల్ఫ్రెడ్ నోబెల్ జయంతి. ఆ మహానుభావుడి మాటలతోనే స్టోరీలోకి వెళదాం. ‘నాకు వేలాది ఐడియాలు వస్తుంటాయి. అందులో ఏ ఒక్కటో మంచిది కావచ్చు. సక్సెస్ కావచ్చు. ఇంతకు మించిన సంతృప్తి ఏం ఉంటుంది!’ ‘సంతృప్తిని మించిన సంపద లేదు’ హైదరాబాద్‌కు చెందిన ఇరవై ఎనిమిది సంవత్సరాల రాజ్‌కుమార్ స్నేహితులతో కలిసి ‘అగ్రి స్టార్టప్’ ఒకటి మొదలెడదామని రంగంలోకి దిగాడు. అది సక్సెస్ కాలేదు. ఇక అంతే...‘స్టార్టప్’ అనే మాట వినబడగానే బెదిరిపోతాడు. స్టార్టప్ సక్సెస్ కావాలంటే రాసి పెట్టుండాలి అని వేదాంతం కూడా పోతుంటాడు. ఇలాంటి రాజ్‌కుమార్‌లు మీ ఊళ్లోనూ ఉండొచ్చు. కొంతకాలం క్రితం కేరళలోని రేవు పట్టణమైన కొచ్చిలోని ‘ది కిచెన్’ అనే స్వచ్ఛందసంస్థకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. అదే ఫెయిల్యూర్ ల్యాబ్! సక్సెస్ స్టోరీలు వినడానికి చూపించే ఉత్సాహం ఫెయిల్యూర్స్టోరీల దగ్గరికి రాగానే నీరుగారిపోతుంది. నిజానికి సక్సెస్ కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫెయిల్యూర్ స్టోరీలు వినాల్సిందే. అనుభవాన్ని మించిన పాఠం ఏముంటుంది! ‘నేను మొదలు పెట్టిన రెండు వెంచర్లు ఫెయిలయ్యాయి. థర్డ్ వెంచర్ సాల్ట్ మ్యాంగో ట్రీ, ఫోర్త్ వెంచర్ ప్లింగ్ మాత్రమే క్లిక్ అయ్యాయి’ అంటాడు ‘ది కిచెన్’ స్థాపకుడు ఆండ్రిన్. కంప్యూటర్ హార్డ్‌వేర్ స్టార్టప్ మొదలుపెట్టాడు నీల్. ఫరవాలేదనిపించింది. అదే ఉత్సాహంతో మరో స్టార్టప్ మొదలుపెట్టాడు. కానీ ఇది తీవ్రమైన నిరాశను మిగిల్చింది. ఏడు నెలల తరువాత ఈ స్టారప్కు చెల్లుచీటి ఇచ్చాడు. అంతమాత్రానా చేతులు దులుపుకోలేదు. ‘ఎక్కడ పొరపాటు జరిగింది’ అని విశ్లేషించుకున్నాడు. ‘చాలామంది స్టార్టప్ ఓనర్లు ఈ పని చేయడం లేదు’ అంటాడు నీల్. ‘అగ్రో బిజినెస్’ స్టార్టప్ మొదలుపెట్టిన రఫీక్ మొదట నష్టాల పాలయ్యాడు. తరువాత లోపాలను సవరించుకొని వ్యాపారాన్ని లాభాల బాట పట్టించాడు. వీరు మాత్రమే కాదు...ముఖేష్దేవ్, జేమ్ప్, జోఫిన్ జోసెఫ్, రికీ జాకబ్...మొదలైన స్టార్టప్ ఓనర్లు తమ విలువైన అనుభవాలను ఈ ఫెయిల్యూర్ ల్యాబ్‌లో పంచుకున్నారు. ‘ఐడియాలు రావడం సులభమే కావచ్చు. కాని వాటిని ఫలవంతం చేయడం అంత సులభమైన విషయమేమీ కాదు’ అంటున్నాడు జీన్ పాల్. బిజినెస్ స్ట్రాటజిస్ట్, మోటివేషనల్ కోచ్‌గా గుర్తింపు సంపాదించిన జీన్‌పాల్ రాసిన ‘ఫ్రమ్ ఐడియా టూ రియాల్టీ’ పుస్తకం బాగా పాప్లర్ అయింది. ది ఎసెన్షియల్స్ ఆఫ్ బిల్డింగ్ ఏ బిజినెస్, ఇట్ స్టార్స్ విత్ పాషన్ అండ్ పర్సస్, సెల్ఫ్ అవేర్నెస్: అండర్స్టాండింగ్ వాట్ డ్రైవ్స్ అండ్ సస్టెన్ యూ, బిల్డింగ్ యువర్ డ్రీమ్ టీమ్ అండ్ బిజినెస్, వై ది వరల్డ్ అండ్ యువర్ బిజినెస్ నీడ్ ఏ మోర్ పాషనెట్ యూ, యువర్ పాషన్ అండ్ పర్పస్ విల్ కీప్ యూ హెల్తీయర్ అండ్ హ్యాపియర్, వై యువర్ స్టోరీ మ్యాటర్స్, డిఫైనింగ్ యువర్ బిజినెస్ మోడల్, గ్రోయింగ్ యువర్ పర్పస్, పాషన్ అండ్ బిజినెస్...వీటిని చాప్టర్లు అనడం కంటే విజయానికి మెట్లు అంటే సరిపోతుంది. ఆకాశంలోకి దూసుకుపోవాలంటే రాకెట్ తయారుచేయగానే సరిపోదు. అందులో ఇంధనం అనివార్యంగా ఉండాలి. ఆ ఇంధనమే ఇన్స్పిరేషన్. ఇది అందించడానికి ‘ఫ్రమ్ ఐడియా టు రియాల్టీ’తో పాటు చూజ్ (ది సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ బిఫోర్ స్టార్టింగ్ యువర్ బిజినెస్)–రెయాన్ లివెస్క్, వాట్ ఐ విష్ వెన్ ఐ వాజ్ 20–టినా సిలెగ్, ది ఎంటర్ప్రెన్యూర్ (రోలర్ కోస్టర్)–డారెన్ హార్టి, వాట్ ఇట్ టేక్స్ (హౌ ఐ బిల్డ్ ఏ 100 మిలియన్ డాలర్స్ బిజినెస్ అగేనెస్ట్ వోడ్స్ )–మోయ జోన్స్, స్టార్టింగ్ ఏ బిజినెస్ (లాంచింగ్ ఏ సక్సెస్ఫుల్ స్మాల్ బిజినెస్)–కెన్ కోల్వెల్.....ఇలా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. పుస్తకం హస్తభూషణం మాత్రమే కాదు... ఆత్మవిశ్వాసం పెంచే ఆయుధం కూడా! ఇక ఆలస్యం ఎందుకు పదండి...ఫెయిల్యూర్ ల్యాబ్స్ నుంచి పాఠాలు నేర్చుకొని గెలుపు జెండా ఎగరేయడానికి. -
వ్యాపారుల్ని దొంగలన్నారు
న్యూఢిల్లీ: వ్యాపారులందరూ దొంగలేనని కాంగ్రెస్ పార్టీ అంటోందనీ, గత 70 ఏళ్ల ఆ పార్టీ పాలనలో వ్యాపారులకు అన్నీ అవమానాలే ఎదురయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ధరలు పెరగడానికి వర్తకులే కారణమని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆరోపించేవనీ, అయితే వాస్తవానికి ఆ పార్టీ మనుషులే వస్తువులను నల్లబజారుకు తరలించి ధరలు పెరిగేలా చేసేవారని మోదీ నిందించారు. ఢిల్లీలో పలువురు వ్యాపారులతో మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ‘వ్యాపారులను దొంగలు అంటూ కాంగ్రెస్ దుర్భాషలాడుతోంది. కానీ జాతిపిత మహాత్మా గాంధీ తాను వ్యాపారుల కులమైన బనియాకు చెందిన వాడినని గర్వంగా చెప్పేవారు. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యాపారులు వెన్నెముక. కానీ గతంలో వారికి లభించాల్సిన గౌరవం ఎన్నడూ దక్కలేదు. కష్టకాలంలో వ్యాపారులకు బాసటగా నిలిచింది బీజేపీ ప్రభుత్వమే’ అని అన్నారు. తనఖా లేకుండానే 50 లక్షల రుణం మళ్లీ ఎన్డీయే అధికారం చేపడితే వ్యాపారులకు ఎలాంటి తనఖా లేకుండానే రూ. 50 లక్షల వరకు రుణాలిస్తామనీ, జీఎస్టీ వ్యవస్థలో నమోదైన సంస్థలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని మోదీ తెలిపారు. వ్యాపారులకు క్రెడిట్ కార్డు సౌకర్యం కల్పించడం, చిన్న దుకాణాలు నడుపుకునే వ్యక్తులకు పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టడంతోపాటు కొత్త చిల్లర వర్తక విధానాన్ని తెస్తామని మోదీ ప్రకటించారు. అలాగే జాతీయ వ్యాపారుల సంక్షేమ మండలిని ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. సులభతర వాణిజ్య ర్యాంకుల్లో భారత్ తమ ప్రభుత్వ కాలంలో 65 స్థానాలు మెరుగుపరుచుకుని 77వ ర్యాంకు పొందిన విషయాన్ని మోదీ గర్తుచేశారు. స్టార్టప్‌ల్లో 20 వేల కోట్లు పెడతాం.. తమ ఐదేళ్ల పదవీ కాలంలో పురాతన కాలం నాటి 1,500 చట్టాలను రద్దుచేసి వ్యాపారుల జీవితాలను, పనులను సరళతరం చేశామని మోదీ చెప్పారు. ‘వ్యాపారులు దోహదం చేయడం వల్లే ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చగలిగాం. వ్యాపారుల శ్రమ నన్ను ఆకట్టుకుంది. ఆర్థిక వ్యవస్థ వికసించడానికి వారు సాయపడ్డారు’ అని మోదీ పేర్కొన్నారు. తమ పార్టీ గెలిస్తే యువతను వ్యాపారం వైపు ఆకర్షించేందుకు రూ. 20,000 కోట్లను స్టార్టప్ రంగంలో పెట్టుబడులుగా పెడతామని చెప్పారు. -
హైదరాబాద్‌లో కిడ్నాప్ కలకలం
-
హైదరాబాద్‌లో కిడ్నాప్ కలకలం
హైదరాబాద్: హైదరాబాద్‌లో వ్యాపారస్థుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నార్సింగ్ పోలీసులు రెస్క్యూ చేసి దుండగుల నుంచి వ్యాపారి రమేశ్ చంద్ అగర్వాల్‌ను కాపాడారు. వివరాలు.. అల్కాపూర్ వద్ద రెండు కార్లలో వచ్చిన దుండగులు కత్తులతో దాడి చేసి వ్యాపారి రమేశ్ కుమార్ అగర్వాల్‌ను కిడ్నాప్ చేశారు. ఈ సంఘటనలో రమేశ్‌తో ఉన్న మరో వ్యాపారి ప్రమోద్‌కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ప్రమోద్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ప్రమోద్‌కు చికిత్స అందిస్తున్నారు. వ్యాపారి రమేశ్ చంద్ అగర్వాల్ కుమారుడు ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు దుండగులను పట్టుకున్నారు.