'స్వీట్‌ స్టార్టప్‌': జస్ట్‌ కప్‌ కేక్స్‌తో ఏడాదికి ఏకంగా..! | Bangalore Megna Jain Launched Dream A Dozen Makes 1 Crore Per Year | Sakshi
Sakshi News home page

'స్వీట్‌ స్టార్టప్‌': జస్ట్‌ కప్‌ కేక్స్‌తో ఏడాదికి ఏకంగా..!

Published Thu, Oct 24 2024 12:11 PM | Last Updated on Thu, Oct 24 2024 12:11 PM

Bangalore Megna Jain Launched Dream A Dozen Makes 1 Crore Per Year

బెంగళూరులో మేఘనా జైన్‌  కూడా ఈ దీపావళికి ఒక కళ. ఆమె నడుపుతున్న ‘డ్రీమ్‌ ఎ డజన్‌ ’ నుండి ప్రత్యేక ఆర్డర్‌లపై వెళ్లే గిఫ్టు హ్యాంపర్‌లు అక్కడి కార్పోరేట్‌ ఆఫీస్‌లను మతాబుల్ని మించిన తియ్యటి వెలుగులతో కాంతిపుంజాల్లా మార్చేస్తుంటాయి. 6 రకాల కప్‌కేక్‌లు, 12 రకాల కేక్‌ వెరైటీలు, వేర్వేరు రుచుల్లోని కేక్‌కప్స్, చీజ్‌ కేక్స్‌ను అందమైన హ్యాంపర్‌లో చుట్టి డెలివరీ చేస్తుంటుంది ‘డ్రీమ్‌ ఎ డజన్‌ ’. ఆ స్వీట్‌ స్టార్టప్‌ యువ అధిపతే మేఘన! ఒక్క దీపావళికి మాత్రమే కాదు, అన్ని సందర్భాలకు, అన్ని సీజన్‌లలో ఇక్కడి కప్‌కేక్‌లకు మంచి గిరాకీ ఉంటుంది. ఇంత చిన్న వయసులో మేఘన ఏడాదికి కోటి రూపాయల బిజినెస్‌ చేస్తుందంటే ఇక చూడండి!

మేఘన రాజస్థానీ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. స్వీట్లంటే ఇష్టమే కానీ, స్వీట్స్‌ బిజినెస్‌ చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేని 18 ఏళ్ల వయసులో ఓ రోజు తమ పొరుగున ఉన్న వాళ్లు సమ్మర్‌ బేకింగ్‌ క్లాసులు పెడితే వెళ్లింది మేఘన. కేక్‌ను బేక్‌ చేయటం నేర్చుకుంది. 

తర్వాత్తర్వాత తను బేక్‌ చేసిన కేక్‌లను ఇంట్లో, బయట, కాలేజ్‌లో అంతా మెచ్చుకోవటం ఆమెకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. అంతేకాదు, తిరుచ్చిలోని నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ‘బిజినెస్‌ ఐడియా’ల పోటీ పెడితే మేఘన చెప్పిన కప్‌కేక్‌ల ఐడియాకు మూడో ప్రైజ్‌ లభించింది! వెంటనే ఇండియన్‌ ఏంజెల్‌ నెట్వర్క్‌ వాళ్లొచ్చి ‘‘అమ్మాయ్‌.. మేము ఇన్వెస్ట్‌ చేస్తాం. నువ్వు కేక్‌ల బిజినెస్‌కి సిద్ధమేనా? అని అడిగారు! మేఘన డైలమాలో పడిపోయింది. చదువా? బిజినెస్సా? కొంత ఆలోచన తర్వాత చదువు వైపే మొగ్గు చూపింది. 

డిగ్రీ అయ్యాక మేఘన బెంగళూరులోని ‘ఇన్నర్‌ చెఫ్‌’లో డెజర్ట్‌ విభాగంలో చేరింది. ఫుడ్‌ టెక్నాలజీ కంపెనీ అది. తర్వాత ‘కేక్‌వాలా’లో ట్రై నింగ్‌ తీసుకుంది. తర్వాత ‘స్టార్‌బక్స్‌’లో ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. అది రాలేదు. అప్పుడే సొంత బిజినెస్‌ గురించి ఆలోచించింది. అప్పటికే మేఘన కప్‌కేక్‌ల తయారీ తోపాటు, హ్యాంపర్‌ డిజైనింగ్‌లో మంచి నైపుణ్యం సంపాదించింది. అయితే 2018లో ‘డ్రీమ్‌ ఎ డజన్‌ను ప్రారంభించబోతుండగా ‘ఉద్యోగం ఇస్తాం రమ్మని’ స్టార్‌బక్స్‌ నుంచి పిలుపు! ఈసారి డైలమాలో పడలేదు మేఘన. స్టార్‌ బక్స్‌ను వద్దనుకుంది. కొద్ది పెట్టుబడితో కేక్‌ బిజినెస్‌ను స్టార్ట్‌ చేసింది. కరోనా సమయంలో కాస్త ఒడిదుడుకులకు లోనైనా తన ‘డ్రీమ్‌’ను నిలబెట్టుకుంది.

మేఘన దగ్గర ప్రస్తుతం 20 మంది ముఖ్య విభాగాలలో పని చేస్తున్నారు. వారిలో ఎక్కువమంది మహిళలే. అలాగే హ్యాంపర్స్‌తోపాటు ఇచ్చే పెయింటెడ్‌ మాస్క్‌లు, ప్రమిదలు, కొవ్వొత్తుల తయారీని స్థానిక స్వయం సహాయక మహిళా బృందాలకు అప్పగిస్తోంది మేఘన. ఆ విధంగా వారికి కూడా ఆర్థికంగా చేదోడుగా ఉంటోంది. చేతిలో నైపుణ్యం ఉండి, బిజినెస్‌ చేయాలన్న తపన ఉన్న యువతరానికి మేఘన కచ్చితంగా ఒక రోల్‌ మోడల్‌. 

(చదవండి: 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement